Home Blog Page 116

దేశాన్ని కదిలించేలా బీసీ బంద్ సంపూర్ణం

0

దేశాన్ని కదిలించేలా బీసీ బంద్ సంపూర్ణం

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా బైంసా బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. తెలంగాణ జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు  శనివారం బీసీల రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసిన అన్ని పార్టీ ప్రజా సంఘాల నాయకులకు, ప్రజలకు, వాణిజ్య, వ్యాపార విద్యా సంస్థలకు ధన్యవాదములు  తెలిపారు. తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సుంకేట పోశెట్టి సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  భైంసా పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం ముందర నిరసన తెలిపి మాట్లాడారు. బీసీ వాదాన్ని దేశాన్ని కదిలించేలా బంద్ ను విజయవంతం చేశారని వారు కొనియాడారు. బీసీల సత్తా ఏంటో చూపిస్థూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు విడుదల చేసిన జీవో 9పై హైకోర్టులో స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీ లు భైంసాలో నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీల ఆత్మగౌరవం, రాజకీయ రిజర్వేషన్స్ లలో వాటా కోసం ఐక్య పోరాటాలు చేయాలన్నారు. బీసీ ఉద్యమానికి ఒక స్వరూపం వచ్చే సమయం ఆసన్నమైందని, స్వార్థ ప్రయోజనాలు వద్దన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, స్టే విధించి బీసీల హక్కులకు విఘాతం కలిగించారని మండి పడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను వాయిదా వేయడం అన్యాయం అన్నారు. గత 75 ఏళ్లుగా బీసీల రాజ్యాధికారానికి ఆధిపత్య కులాలు, పాలక వర్గాలు అడ్డు పడటం దుర్మార్గం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు ఐక్యమై ఒక శక్తిగా అవతరించడం ఎంతో ముఖ్యం అన్నారు. బీసీ రిజర్వేషన్స్ లపై హైకోర్ట్ స్టే బీసీలకు చీకటి రోజన్నారు. 42 శాతం రిజర్వేషన్స్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలన్నారు. అవసరమైతే ఢిల్లీలో పోరాటాలకు సిద్ధమని అన్నారు. ఈ బీసీ బంద్ కార్యక్రమంలో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీ ల నేతలు  పాల్గొన్నారు..

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి

0

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి 

*స్వాగతం పలికిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

*ఆలయ పునర్నిర్మాణాన్ని మ్యాప్ ద్వారా వివరించిన ఎమ్మెల్యే

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ స్వామికి స్వాగతం పలికి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మణాన్ని ఎమ్మెల్యే మ్యాప్ ద్వారా స్వామికి వివరించారు. పవిత్ర పుణ్య క్షేత్రం బాసర ను సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీ సూచనలు సలహాలు తమకు ఎంతో అవసరమని స్వామీజీకి తెలియజేశారు. శృంగేరి పీఠాధిపతిగా అమ్మవారి చెంతకు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వ్యాసమహర్షి తపస్సు చేసిన ప్రాంతం సరస్వతి అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు దర్శనం ఇవ్వడం ఇది ఎంతో పుణ్య భూమి అని విధుశేఖర భారతి స్వామి అన్నారు.

BC ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోథ్ లో బంద్ విజయవంతం

0

BC ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోథ్ లో బంద్ విజయవంతం

చిత్రం న్యూస్, బోథ్: జనాభా ప్రాతిపదికన, బీసీ జనాభా ప్రాతిపదికన, వెనుకబాటు ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ శనివారం చేపట్టిన bc సంఘాల బంద్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ..బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నారు. దానికనుగుణంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంతవరకు బీసీల ఐక్యవేదికగా నిరంతర  కార్యాచరణ చేపట్టాలని బస్టాండ్ లో రాస్తారోకో చేస్తూ నినాదాలు చేశారు.  ఈ కార్యక్రమంలో బీసీ నాయకులతోపాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

ఆబ్కారీశాఖ అధికారులకు వినతి పత్రం అందజేత

0

ఆబ్కారీశాఖ అధికారులకు వినతి పత్రం అందజేత

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ గ్రామంలో ఉన్న రెండు మద్యం షాపులతో పరిసరాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆబ్కారీ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు .చుట్టూ ఉన్న నివాస గృహాలకు. మహిళలకు, స్కూల్ పిల్లలకు, హాస్పిటల్ రోగులకు, బాలికల హాస్టల్ విద్యార్థులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఆటంకం కలుగుతుండడంతో కొత్తగా ఏర్పడ బోయే మద్యం షాపులను వీటికి దూరంగా ఏర్పాటు చేయాలని బోథ్ గ్రామస్తులు కోరారు.

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 

0

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాల 36 మంది లబ్ధిదారులకు రైతు వేదికలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసర మండల తహసీల్దార్ పవన్ చంద్ర,  బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, బీజేపీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అడానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ

0

అడానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ

చిత్రం న్యూస్ బేల : అడానేశ్వర ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్ ఆధ్వర్యంలో మండలంలోని మసాలా(బి) గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు శుక్రవారం ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడనేశ్వర ఫౌండేషన్ పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  డోప్టాల సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మాజీ సర్పంచ్ భీంరావు, ఆల్చెట్టి హన్మాన్లు, మంచాల కిష్టన్న, నైతం గులాబ్, మారుతి ఆడే ,అంగన్వాడీ టీచర్ ముక్కే సారిక, ఆయా తదితరులు ఉన్నారు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం

0

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం

కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు 

చిత్రం న్యూస్: హైదరాబాద్: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం ప్రారంభం కానుంది. కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులను ఇప్పుడు స్వీకరిస్తున్నారు. అర్హత కలిగిన గృహాలకు LPG కనెక్షన్లు అందించడం ఈ పథకం యెుక్క లక్ష్యం. దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సమర్పించాలి. రేషన్ కార్డు (FSC) జిరాక్స్ కాపీ, రేషన్ కార్డులో జాబితా చేయబడిన కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, మహిళా ఇంటి పెద్ద (రేషన్ కార్డు యజమాని) బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, మహిళా గృహయజమాని యొక్క రెండు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి. సమర్పించిన రేషన్ కార్డులో జాబితా చేయబడిన కుటుంబంలోని ఏ సభ్యుడైనా ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యం

0

అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆత్మవిశ్వాసం, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని బాసర ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ అలిసెరి గోవర్ధన్ అన్నారు. ఆయన వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరఫున ఆయన్ను మర్యాదపూర్వకముగా కలిసి చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉల్లెంగ ముత్యం మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి ఆర్జేయూకేటీ లో జరుగుతున్న మంచి మార్పులను, అంకిత భావంతో పనిచేస్తున్న విధానాన్ని గురించి  కొనియాడారు. విద్యార్థుల అభివృద్ధి కోసం, వారికి ఏ సమస్య వచ్చినా కూడా సమస్య పరిష్కారం కోసం ముందుండి పనిచేసిన అనేక ఉదాహరణలను గురించి వివరించారు. వైస్ ఛాన్సలర్ గెస్ట్ ఫాకల్టీ ల కోసం చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ గోవర్ధన్ మాట్లాడుతూ..ఫ్యాకల్టీలకు అనేక సూచనలు చేశారు. అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలని, దానితోపాటు మన స్థాయిని కూడా పెంచుకొని మంచి ఫ్యాకల్టీగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఫ్యాకల్టీలు తమ యొక్క బోధన స్థాయిలను రకరకాల కార్యక్రమాల ద్వారా పెంచుకొని విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ సభ్యులు బైరు రాజేష్, కోటగిరి కృష్ణ, బి.సురేష్, బాదావత్ నవీన్, శ్రీధర్,రాజు, సోఫియా, వీణ, హారిక తదితరులు పాల్గొన్నారు.

అజయ్ సింగ్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి

0

అజయ్ సింగ్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: కర్ణాటక రాష్ట్రం జేవర్గి ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ సీఎం కుమారుడు, ఆదిలాబాద్ డీసీసీ అబ్సర్వర్  అజయ్ సింగ్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.  ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి  కోసం  పరిశీలనకు వచ్చిన  ఆయనతో  చర్చించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ రాంకుమార్, ఇమ్రాన్,  భూమన్న,  నాయకులు శ్రీకాంత్, భూపేందర్ తదితరులు ఉన్నారు.

రహదారి సమస్య పరిష్కారం తీరేనా!

0

రహదారి సమస్య పరిష్కారం తీరేనా!

చిత్రం న్యూస్, జైనథ్: మహరాష్ట్ర సరిహద్దు నుంచి అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామం మీదుగా కాఫ్రి వరకు R&B ద్వార రహదారి నిర్మించారు. రోడ్డు ట్రాఫిక్ అసౌకర్యానికి, ప్రమాదాలకు సంబంధించి కూర గ్రామస్తులు ప్రజవాణి ఫిర్యాదులో దాదాపుగా సంవత్సరం క్రితం వినతి పత్రం అందించారు. గ్రామం మీద నుంచి వెళ్లే వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, R&B అధికారుల రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు అనుమతించబడనప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి తగిన రంబుల్ స్ట్రిప్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా గ్రీవెన్స్ లో R&B అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సంవత్సరం గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.