Home Blog Page 111

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన బోథ్  సీఐ 

0

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిలహాజన్ ను బోథ్ సీఐ గురుస్వామి మర్యాద పూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు.  ఎస్పీ  మాట్లాడుతూ..బోథ్ సర్కిల్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లలో గంజాయి, గుడుంబా వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా కృషి చేయాలని, పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని సూచించారు. గతంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలలో సేవలు అందించిన డి. గురుస్వామి నూతనంగా బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బదిలీపై వచ్చారు. అంతకు ముందు స్పెషల్ బ్రాంచ్ వరంగల్ లో విధులు నిర్వర్తించి, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ సీఐగా గురుస్వామి బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో నేర నియంత్రణ, ప్రజా రక్షణ, శాంతి భద్రత పరిరక్షణలో నిబద్ధతతో పని చేస్తానని సీఐ తెలిపారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం భూసేకరణకు అనుమతి

0

చిత్రం న్యూస్,అదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్‌లో విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని సేకరించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (పౌర, వాయుసేన అవసరాల కోసం) అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన సాంకేతిక-ఆర్థిక అధ్యయన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ భూసేకరణకు ఆమోదం తెలిపింది. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌లోనూ బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను రాబోయే రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని ఏఏఐ యోచిస్తోంది.

భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఏఏఐ సిద్ధంగా ఉంది. ఆదిలాబాద్ కలెక్టర్ దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌లో పౌర విమాన కార్యకలాపాలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పథ సంచలనం 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం పథ సంచలనం (రూట్ మార్చ్) నిర్వహించారు. స్థానిక డైట్ మైదానం నుండి ప్రారంభమైన ఈ పథ సంచలనం వినాయక్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ మీదుగా తిరిగి డైట్ గ్రౌండ్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎంపీ జి.నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ్ బలవత్రి గణేష్, విభాగ్ సంఘ్ చాలక్ నిమ్మల ప్రతాప్ రెడ్డి, నగర సంఘ్ చాలక్ నూతుల కళ్యాణ్ రెడ్డి, ఇందూర్ విభాగ్ కార్యవాహ్ దిగంబర్, ఇతర రాష్ట్రీయ స్వయం సేవకులు, పలువురు పాల్గొన్నారు.

నేడు జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి కల్యాణోత్సవం , రథోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. కార్తిక శుద్ధ ద్వాదశి సందర్భంగా ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవం నవంబర్ 10వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకి ప్రారంభం కానుంది. ఈ నెల 10 నుండి 16 వరకు వారం రోజుల పాటు జాతర జరగనుంది. ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం, ఇది జైనుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. సంవత్సరానికి  రెండు సార్లు సూర్య కిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని తాకడం ఈ ఆలయ ప్రత్యేకత. పక్క రాష్ట్రం మహరాష్ట్రతో పాటు రాష్ట్రంలోని నలుమూలల  నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు.

రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లులను సీజ్ చేస్తాం

0

చిత్రం న్యూస్,ముథోల్: రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హెచ్చరించారు. ఆదివారం ముథోల్ మండలం బ్రహ్మణ్‌గావ్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరి ధాన్యం అమ్మకాల్లో కోత పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లను ఏ మాత్రం ఉపేక్షించమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తే సంబంధిత రైస్ మిల్లులను సీజ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే వెంటనే కలెక్టర్, సబ్ కలెక్టర్ లేదా తహసీల్దార్‌కి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదంటే విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన  పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

బోథ్ కోర్టు భవనాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్

0

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో  కొనసాగుతున్న నూతన కోర్టు భవనాన్ని  ఆదివారం  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్  పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కోర్టు భవనాన్ని వీలైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు, బోథ్ కోర్టు న్యాయమూర్తి పి.మౌనిక. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్ రావు దేశ్పాండే, సెక్రటరీ పంద్రం శంకర్, అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఆర్డీఓ స్రవంతి, తహసీల్దార్ సుభాష్ చందర్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ గురుస్వామి, ఏపీపీ శ్రీధర్, న్యాయవాదులు ఆడెపు హరీష్, ఠాకూర్ రూపేందర్ సింగ్, కుమ్మరి విజయ్ కుమార్, చౌహాన్ విక్రమ్ సింగ్, వివేక్ సింగ్, ఎట్టం రాములు తదితరులు పాల్గొన్నారు.

మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. గత నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈ నెల 15 వరకు నమోదయ్యే గ్రామీణ ఓటర్లను ‘స్థానిక’ ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చాలని సూచించింది. ఎన్నికలు వాయిదా పడినా, మళ్లీ నిర్వహించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

ఆదిలాబాద్ డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డికి సన్మానం

0

చిత్రం న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ ఛైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డితో కలిసి బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రం సహకార బ్యాంకును  సందర్శించారు. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్, సీఈవో నాగభూషణం కలిసి డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజరెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట బండారి దేవన్న, తదితరులు ఉన్నారు.

బోర్ వేయించి కాలనీవాసుల  సమస్య తీర్చిన ఆడే గజేందర్

0

చిత్రం న్యూస్, బోథ్:  బోథ్ మండలం పొచ్చర గ్రామంలో రాంనగర్ కాలనీవాసులు నీటి సమస్య ఉందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బోర్ వేయించి వారి నీటి సమస్యను తీఇచ్చారు. దీంతో కాలనీవాసులు ఆడే గజేందర్ ను శాలువాతో సన్మానించారు. కాలనీ వాసులతో కలిసి నూతన బోర్ ను బటన్ వేసి స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే, సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు వారి వెంట నాయకులు ,కార్యకర్తలు, ఉన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : ప్రముఖ వ్యాపార వేత్త, ఆదిలాబాద్ హోండా షోరూమ్ యజమాని రవీందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఘనంగా జరిగాయి. బుధవారం జరిగిన ఈ వివాహ వేడుకల్లో డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి  పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెంట పలువురు ఉన్నారు.