Home Blog Page 110

మశాల (బి)లో  “పోలీసులు మీకోసం”  కార్యక్రమం

0

చిత్రం న్యూస్, బేల: అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించాలని జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బేల మండలంలోని మశాల (బి)లో  సైబర్ క్రైమ్ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారి మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. గ్రామంలో  అనుమానిత వ్యక్తులు కనబడిన, ఆకతాయిలు వేధించిన,  ఇబ్బందులు కలిగించిన 100 డయల్ చేయాలన్నారు. పోలీసులు వచ్చి సమస్య తెలుసుకొని పరిష్కరిస్తారన్నారు. బేల ఎస్సై ఎల్. ప్రవీణ్ మాట్లాడుతూ..గ్రామంలో ఎవరైనా దేశీదారు అమ్మినా, గంజాయి విక్రయించిన, పండించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పోలీసులకు సమాచారం అందించాలని వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు తలెత్తితే పోలీస్ స్టేషన్ కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కోకాపేట్‌లోని శ్లోక ది గ్లోబల్ స్కూల్ లో లక్ష దీపోత్సవం

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: కోకాపేట్‌లోని శ్లోక ది గ్లోబల్ స్కూల్ లో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్రమైన లక్ష దీపోత్సవ వేడుకను ఆధ్యాత్మికతతో, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్లోక చైర్మన్, అధ్యక్షుడు పి.జైపాల్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజనాదేవి, అకడమిక్ డైరెక్టర్ బాలాజీ, శ్లోక పాఠశాల మెంబర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.

పాఠశాల ఆవరణలో వెలిగిన అనేక దీపాలతో ఆ ప్రాంగణమంతా దివ్య కాంతితో మెరుస్తూ, ప్రశాంత వాతావరణాన్ని సృష్టించింది. అనేకమంది తల్లిదండ్రులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐక్యత, సానుకూలతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దీపికా ఠాకూర్ మాట్లాడుతూ. మా విద్యార్థుల తల్లిదండ్రులే కాక సమాజం నుండి వచ్చిన వారు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం మా హృదయాన్ని తాకిందన్నారు. మనం అందరం కలిసి ఈ సాయంత్రాన్ని ఒక దివ్యమైన, చిరస్మరణీయమైన అనుభూతిగా మార్చుకున్నాం అన్నారు. తల్లిదండ్రులు, అతిథులు, సిబ్బంది అందరికీ స్కూల్  తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమం ప్రార్థనలతో, చిరునవ్వులతో,ఐక్యత వెలుగులతో ముగియగా..పాఠశాల యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక వికాస యాత్రలో మరో అందమైన మైలురాయిగా నిలిచింది.

పాఠశాల విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ చేసిన ముడుపు మౌనిష్ రెడ్డి

0

చిత్రం న్యూస్, సాత్నాల: విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సాంగ్వి, గోండుగూడ, పాఠగూడ గ్రామాలలో గల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, అంగన్వాడీ పిల్లల్లకు పలకలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే లక్ష్యం నిర్దేశించుకొని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభాత్ రావు, మోతిరాం, గ్రామస్తులు మాధవరావు, సంపత్ రావు, సోంజి, పొచ్చిరాం,  వెలదీ వసంతరావు, ఆత్రం భగవాన్ దాస్, చిత్రు, కిన్క శ్యామ్ రావు, ఇస్తారి,అర్జున్, బాపురావు తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ గోపిని కోరిన ఎమ్మెల్యే రామారావు పటేల్

0

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వ్యవసాయశాఖ కమిషనర్ గోపిని కోరారు. గురువారం హైదరాబాద్ లో ఆయన్ను కలిసి సన్మానించారు. రైతులు పంటలపై సాంకేతిక సలహాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు వివరించారు. ఈ రబీ సీజన్‌లో యూరియా, డీఎపీ వంటి ఎరువులు కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కోరారు. కౌలు రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగం బలోపేతానికి సిబ్బంది లోటు తక్షణమే పూరించాలన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

భైంసా–బాసర రహదారిపై పోలీసుల విస్తృత తనిఖీలు

0

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని ఐ హాస్పిటల్ సమీపలోని భైంసా–బాసర రహదారిపై గురువారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏఎస్ఐ రవూఫ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను నిలిపి వివరాలు సేకరించారు. రహదారిపై క్రమశిక్షణ పాటించేలా డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రత, చట్టం–శాంతి పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు వాహనదారులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని,  పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రజలు చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.

బాసరలో ఘనంగా జగద్గురు నరేంద్ర స్వామి పాదుక రథయాత్ర

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో జగద్గురు నరేంద్ర స్వామి పాదుక రథయాత్రను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామానందచార్య సాంప్రదాయ సేవ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వామీజీ రాకతో ప్రత్యేక పూలదండలతో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు.  స్వామి పాదుకలను పురవీధుల గుండా భాజా భజంత్రీల మధ్య భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో  చేపట్టారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా బాసర ఆలయంలో భక్తుల సందడి  

0

కార్తిక పౌర్ణమి సందర్భంగా బాసర ఆలయంలో భక్తుల సందడి

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రోచ్ఛరణలతో సరస్వతి అమ్మవారికి అభిషేకం,అర్చన, మహా హారతి, గణపతి పూజ, సరస్వతి మంత్రపుష్పం, సరస్వతి పారాయణం పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి చెంత భక్తులు కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి గంటల సమయం పట్టింది.

ఆదిలాబాద్ జిల్లాలో “పోలీస్ అక్క” కార్యక్రమం ప్రారంభం

0

*వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆధ్వర్యంలో “పోలీస్ అక్క” అనే వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ (“పోలీస్ అక్క”) ఉంటారు. వీరు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి బాలికలతో మమేకమై  గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, ఈవ్-టీజింగ్ & సైబర్ వేధింపులు,పోక్సో చట్టం, చట్టపరమైన హక్కులు, సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించడం, స్వయం రక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆదిలాబాద్ సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో 250 మందికి పైగా విద్యార్థినుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. షీ టీమ్‌తో కలిసి జిల్లాలోని అన్ని పాఠశాలలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి బాలిక రక్షించబడినట్లు, సమాచారం పొందినట్లు, సాధికారత పొందినట్లు భావిస్తుంది. పోలీసు వ్యవస్థ విద్యార్థులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న లోక ప్రవీణ్ రెడ్డి దంపతులు

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలోని శ్రీ వీరహనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్తిక శుక్ల ద్వాదశి ఆదివారము రోజు పూజ ప్రారంభమై కార్తీక శుక్ల త్రయోదశి  సోమవారము ఉదయం 10:21ని. లకు ఉత్తరబాద్ర నక్షత్రంలో శాస్త్రోక్తంగా ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమం పూజారి చేపట్టారు.  గ్రామ ప్రముఖుడు లోక ప్రవీణ్ రెడ్డి దంపతులు యజ్ఞ, హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం హారతి కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ధ్వజస్తంభం కోసం తమ వంతుగా రూ.12 వేలు అందజేశారు.

మాజీ మంత్రి హరీష్ రావుకు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్  పరామర్శ

0

చిత్రం న్యూస్, ముథోల్: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఇటీవల మరణించడంతో హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని, సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.