చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ ఏనుగు రేఖ రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి సన్మానించారు. శనివారం గ్రామానికి వెళ్లిన ఆయన శాలువా కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచ్ దివాకర్ రెడ్డి, గడ్డం శ్రీకాంత్ రెడ్డి, భూపేందర్, వెంకటి, కన్నా, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీని నెరవేర్చిన సర్పంచ్ అభ్యర్థి చిలుకూరి నవీన భర్త లింగారెడ్డి
జైనథ్ బాజీరావుబాబా మహారాజ్ మందిరానికి మైక్ సెట్ విరాళం
చిత్రం న్యూస్,జైనథ్: జైనథ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో నిల్చి ఓటమి చెందిన కూడా గ్రామస్థులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, సర్పంచ్ అభ్యర్థి నవీన భర్త బీజేపీ యువ నాయకులు చిలుకూరి లింగా రెడ్డి గ్రామంలోని బాజీరావు బాబా మహారాజ్ మందిరానికి మైక్ సెట్‌ను విరాళంగా అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, తన విశ్వసనీయతను చాటుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార సమయంలో లింగా రెడ్డి బాజీరావుబాబా మందిరానికి అవసరమైన మైక్ సెట్‌ను అందజేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీ మేరకు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో మైక్ సెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇవ్వడం సర్వసాధారణం, కానీ వాటిని నెరవేర్చడం అరుదు. చిలుకూరి లింగా రెడ్డి తన మాటను నిలబెట్టుకుని, యువతకు ఆదర్శంగా నిలిచారు,” అని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విరాళం ఆలయంలో జరిగే కార్యక్రమాలకు, ప్రార్థనలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఎల్లమ్మ ఆలయంలో ముడుపు మౌనిష్ రెడ్డి పూజలు
ఎల్లమ్మ ఆలయంలో ముడుపు మౌనిష్ రెడ్డి పూజలు
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం లోని పూసాయి గ్రామంలో కొలువైన ఎల్లమ్మ తల్లి జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.గ్రామంలోని మహిళలు అంతా డప్పుచప్పుల్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారివెంట గ్రామస్తులు బుర్రి శాలిక్, బుశెట్టి గంగాధర్, ఉద్దే సంజీవ్, గంగం సురేందర్ రెడ్డి, బుద్దె రాజన్న, ఇస్తారీ, బుర్రి సంతోష్, నవీన్ తదితరులు ఉన్నారు.
పత్తి నాణ్యత తగ్గడంతో ధర తగ్గింపు -క్వింటాలుకు రూ.50 కోత
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి కొనుగోళ్లపై కీలక ప్రకటన వెలువడింది. పత్తి నాణ్యతా ప్రమాణాలు తగ్గడంతో, భారత పత్తి సంస్థ (CCI) కొనుగోలు ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 22, 2025 సోమవారం నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. వివరాలు:
ధర తగ్గింపు: ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న BB SPL MOD రకం పత్తి ధర నుండి MECH MOD రకానికి మారుస్తూ, క్వింటాలుకు రూ. 8,010 (రూ.50 తగ్గింపుతో )చొప్పున కొనుగోలు చేయనున్నారు.
కారణం: మార్కెట్‌కు వస్తున్న పత్తి శాంపిళ్లను ల్యాబ్‌లో పరీక్షించగా, పత్తి పింజ పొడవు (Staple Length) 27.5 MM నుండి 28.5 MM కన్నా తక్కువగా ఉన్నట్లు మరియు మైక్రోనీర్ వాల్యూ 3.5 నుండి 4.7 ఉన్నట్లు CCI అధికారులు గుర్తించారు. ఇది వారి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ధర తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు.
రైతులకు సూచన: రైతులు తమ పత్తిలో కౌడి, రంగు మారిన పత్తిని కలపకుండా వేరు చేసి, నాణ్యతా ప్రమాణాల ప్రకారంగా మార్కెట్ యార్డుకు తీసుకురావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు రైతులను కోరారు.పత్తి నాణ్యత తగ్గడంతో ధర తగ్గింపు -క్వింటాలుకు రూ.50 కోత
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి నేతల యత్నం..అరెస్టు చేసిన పోలీసులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను వేధించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వంను కోర్టులు తప్పు పట్టడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేసి మావల పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబ గౌరవం తగ్గించడం కోసం గాంధీ కుటుంబం పై నేషనల్ హెరాల్డ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి గత పది సంవత్సరాలుగా వేధించే ప్రయత్నం చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈడీ, సీబీఐ వంటి సంస్థలని ఉపయోగించి ప్రతిపక్షాలని అణచి వేయాలని చూస్తోందని అన్నారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపురావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మావల మండల అధ్యక్షులు, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, గుడిహత్నూర్ మండల అధ్యక్షులు మల్యాల కరుణాకర్, టౌన్ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, వాసిం రంజాని, అడేళ్లు, వాసిం, అసిఫ్, మోసిన్, దోసలి సంతోష్, అలీం , రొడ్డ ప్రదీప్, ఫహీమ్, గంగన్న, ఆరే గంగన్న,రవి, రహీం, రహీం ఖాన్, సమీ ఉల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో చలి తీవ్రత: పాఠశాలల సమయాలు మార్పు
ఆదిలాబాద్‌లో చలి తీవ్రత: పాఠశాలల సమయాలు మార్పు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో విద్యార్థుల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా పాఠశాలల పనివేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో, అన్ని విద్యా సంస్థలకు (ప్రాథమిక, యూపీఎస్ & హైస్కూల్స్) తక్షణమే వర్తించేలా కొత్త సమయాలను ప్రకటించారు.
సవరించిన సమయాలు: పాత సమయాలు: ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:15 వరకు
కొత్త సమయాలు: ఉదయం 9:40 నుండి సాయంత్రం 4:30 వరకు
ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులకు (MEOs), ప్రభుత్వ/LB/KGBV/మోడల్ స్కూల్, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సూచనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలో ఈ సమయాలే కొనసాగుతాయన్నారు.
బోథ్ లో గొర్రెల మందపై కుక్కల దాడి
బోథ్ లో గొర్రెల మందపై కుక్కల దాడి_ 20 గొర్రెలు మృతి
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. బోథ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్న ఏకులారి పోతన్నకు చెందిన దాదాపు 80 మేకలు, గొర్రెలను తన ఇంటి వద్ద ఉన్న మేకల కొట్టంలో ఉంచాడు. అయితే బుధవారం అర్ధరాత్రి మేకల కొట్టంలో ఉన్న గొర్రెల మంద పై కుక్కలు దాడి చేయడంతో దాదాపు 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అంతేగాకుండా 10 చిన్న మేక పిల్లలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి విలువ దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు ఉండడంతో మేకల యజమానితో పాటు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా దాని ఆత్మ, స్ఫూర్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు బిగిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. చట్టంలో మార్పులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో హడావుడిగా బిల్లు ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ఇప్పటికీ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ కుంటిసాకులు చెబుతున్నారని, రాష్ట్రాలకు రావాల్సిన నిధులను విడుదల చేయకుండా కేంద్రం తన అవసరాలకు వినియోగిస్తోందని ఆరోపించారు. సెస్ ల పేరుతో రాష్ట్రాలను దోచుకుంటూ 40 శాతం భారం రాష్ట్రాలపై మోపుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, గుడిహత్నూర్ మండల అధ్యక్షులు మల్యాల కరుణాకర్, టౌన్ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, నాయకులు వాసిం రంజాని, అడేళ్లు, వాసిం, అసిఫ్, మోసిన్, దోసలి సంతోష్, అలీం , రొడ్డ ప్రదీప్, ఫహీమ్, గంగన్న, ఆరే గంగన్న,రవి, రహీం, రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
సాంగిడి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతా..
సాంగిడి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతా..
_సర్పంచ్ మంచాల భూపతి రెడ్డి
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో సర్పంచ్‌గా మంచాల భూపతి రెడ్డి గెలుపొందారు. గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్భంగా సర్పంచ్ మంచాల భూపతి రెడ్డి మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధే నా ధ్యేయం. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాను. పారదర్శక పరిపాలనతో గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను అని పేర్కొన్నారు. సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామస్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఉప సర్పంచ్ ముబీన్ ను సన్మానించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్
*దంతన్ పల్లి గ్రామ చరిత్రలోనే మొదటి మైనార్టీ ఉప సర్పంచ్ ముబీన్
చిత్రం న్యూస్, ఉట్నూర్: మొదటి విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉట్నూర్ మండలంలోని దంతన్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన మొహమ్మద్ ముబీన్ ను మంగళవారం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా నాయకులు మజర్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మజర్ మాట్లాడుతూ.. దంతన్ పల్లి గ్రామ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా మైనార్టీ ఉప సర్పంచ్ కావడం గొప్ప విషయమని, ఇది మైనార్టీలు గర్వపడే విషయమని అన్నారు. 400 ఓట్లు గల దంతన్ పల్లి గ్రామంలో ఎన్నో ఏండ్ల నుంచి మైనార్టీలకు అవకాశం రాలేదని, సేవ చేసేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించుకుని ముబీన్ చరిత్ర సృష్టించారని అభినందించారు.









