Home Blog Page 10

మాంగ్రూడ్ గ్రామంలో బయోరీసర్చ్ సెంటర్ ప్రారంభం

0

చిత్రం న్యూస్, బేల: మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో సీపీఎఫ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జీవామృత కేంద్రాన్ని జిల్లా ఉద్యానవన శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సయ్య, మండల అధికారులు, ఏరువాక శాస్త్రవేత్తలతో కలిసి ప్రారంభించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువుల ద్వారా తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్ లను ఏర్పాటు చేసి అందులో లభించే పోషకాల గురించి వివరించారు. ఈ సందర్బంగా సీపీఎఫ్ స్వచ్చంద సంస్థ ప్రోగ్రామ్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడకంతో భూమి యొక్క సారవంతం తగ్గిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతుందన్నారు.రసాయనిక ఎరువులు వాడకంతో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.జీవామృతం వంటి మట్టి ఆరోగ్యాన్ని పెంపొందించడం, రైతులకు పెట్టుబడి ఖర్చును తగ్గించడం, విషరహిత ఆహార ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన వ్యవసాయానికి దోహదపడతుందన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్

0

చిత్రం న్యూస్, సిద్దిపేట: అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో మురుగు కాలువలు, మంచినీటి సరఫరా వ్యవస్థను సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. గ్రామంలో పారిశుద్ధ్యం మొరుగుపరచాలని, ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆరో వార్డ్ మెంబర్ నీల బాలమని, ఐతం మల్లేశం, పంచాయతీ కార్యదర్శి మమత, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ 

0

చిత్రం న్యూస్, హిందూపురం: హిందూపురం పట్టణ ప్రముఖులు బీ ఎస్.శ్రీధర్ స్వామి ఇటీవలే మృతి చెందారు.ఈ విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, ఏఐసీసీ సభ్యులు కేటీ శ్రీధర్ శుక్రవారం హిందూపురం పట్టణంలోని మృతుని నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీధర్ స్వామి చిత్ర పటానికి పుష్పాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు బీఎస్టీ కంపెనీ బస్సులలో ఫ్రీ పాసులు అందిస్తూ వారికి ఉన్నతమైన చదవులకు చేయూతనిస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు శ్రీధర్ స్వామియని కొనియాడారు.అలాంటి మహోన్నతమైన వ్యక్తి శివైక్యం పొందడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ బి.ఎస్ విద్యాసాగర్, అప్పుస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు తదితరులు ఉన్నారు.

గాయపడ్డ వ్యక్తికి ఎంపీ లావు కృష్ణదేవరాయలు పరామర్శ

0

చిత్రం న్యూస్, గురజాల: గత రెండు రోజుల క్రితం గురజాల మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బత్తుల ఏడుకొండలు రౌడీ మూకల దాడిలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు శుక్రవారం ఆయన్ను పరామర్శించారు. గుంటూరులోని సంజీవని ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు చైర్మన్ పులుకూరి కాంతారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు 

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో బొజ్జ బాలాజీ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి జడ్పీటీసీ  మాజీ సభ్యులు గోక గణేష్ రెడ్డి, కొండ గంగాధర్, సీనియర్  నాయకులు లోక ప్రవీణ్ రెడ్డిశుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలాజీ కుటుంబ సభ్యులు నేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏలేటి లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కొమ్ము వెంకటేష్, నాయకులు నిట్టేడి గంగాధర్, గాజుల సాంబశివ్, గోక సాగర్ రెడ్డి, ఇస్తారి, జి.మల్లారెడ్డి, బి.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలో గౌతం రెడ్డికి ఆదిలాబాద్ జిల్లా బెస్ట్ స్పాట్ పార్టిసిపెంట్ అవార్డు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సిద్దిపేటలోని రంగనాయక సాగర్ డ్యాం పైన జరుగుతున్న సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో బాలురు అండర్ 15 విభాగంలో భోరజ్ మండల కేంద్రానికి చెందిన కాళ్ళ గౌతం రెడ్డి ఇండివిజువల్ టైం ట్రావెల్ పోటీలో అదిలాబాద్ జిల్లా బెస్ట్ స్పాట్ పార్టిసిపెంట్ అవార్డు గెలుపొందారు. రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైన గౌతంరెడ్డి ఈ ఘనత దక్కించుకున్నాడు. భోరజ్ కు చెందిన గౌతం గత నాలుగేళ్ల నుండి సైక్లింగ్ లో సాధన చేస్తున్నాడు. వివిధ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో పాల్గొన్నాడు. తండ్రి సర్వేశ్వర్ రెడ్డి ప్రోత్సాహంతో సైక్లింగ్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. కోచ్ పాండు జాదవ్ ఆధ్వర్యంలో ఎప్పటికైనా అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధిస్తానన్న పట్టుదల తనకుందని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.

సీతగొంది వద్ద మిషన్ భగీరథ నీటి పైప్‌లైన్ మరమ్మతులు

0

*రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేత

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలోని సీతగొంది వద్ద NH 44 బ్లాక్ స్పాట్ ప్రాంతంలో ఉన్న మిషన్ భగీరథ 1000 mm MS పైప్‌లైన్ మార్పిడి పనుల కారణంగా, ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఫిబ్రవరి 24, 25 తేదీలలో నీటి సరఫరా ఉండదని, ఆదిలాబాద్ మునిసిపాలిటీతో పాటు ఆదిలాబాద్ గ్రామీణ, బేల, జైనథ్,మావల, తాంసి, భీంపూర్, తలమడుగు, గుడిహత్నూర్ మండలాలు గ్రామ పంచాయతీలు సీతగొండి, గార్కంపేట్-1, మాచాపూర్, మల్కాపూర్, వైజాపూర్, కమలాపూర్ గ్రామాల్లోని దాదాపు 406 గ్రామీణ ఆవాసాలకు సరఫరా నిలిచిపోనుంది.పైప్‌లైన్ ఆధునీకరణ పనుల దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు సంబంధిత MPDOలు, MPOలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు తమ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బెల్లూరి గ్రామానికి బస్సు సౌకర్యం ప్రారంభం

0

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలంలోని బెల్లూరి గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరింది. రవాణా సౌకర్యాల మెరుగుదలే ధ్యేయంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ర్ శంకర్ సహకారంతో బెల్లూరి గ్రామానికి సోమవారం నుండి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సదుపాయం వల్ల ముఖ్యంగా పైచదువులకు వెళ్లే విద్యార్థులకు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే కూలీలకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బస్ సౌకర్యం కోసం సహకరించిన డిపో మేనేజర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సర్పంచ్ ,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

కామారెడ్డి ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా జైనథ్‌లో రాస్తారోకో

0

చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని, బాన్సువాడలో చెలరేగిన అల్లర్లను నిరసిస్తూ సోమవారం బీజేపీ నాయకుల, కార్యకర్తలు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటకు పైగా బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధిపై, ఆయన కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని, బాన్సువాడలో సామాన్యుల ఆస్తుల విధ్వంసానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపి పార్టీ అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ సంతోష్ యాదవ్, బీజేపీ నాయకులు వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, అశోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు 

0

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలో పాల్గొన్న భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు

చిత్రం న్యూస్, ఖానాపూర్: బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శకులు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బంజార సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బంజార నాయకులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బాసరలో గోదావరి నది తీరాన 45 రోజులపాటు దీక్షలో కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాసరలో 5 ఎకరాల విస్తీర్ణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది బాసరలో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాలలో సందర్భంగా మంత్రి సీతక్క, ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీ విధంగా బాసరలో 5 ఎకరాల భూమిని, గుడి నిర్మాణానికి రూ.5 కోట్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు.