*ఎమ్మార్వో చేతుల మీదుగా స్మశానస్థలాల రక్షణ సాధన యాత్ర కరపత్రాలు విడుదల
చిత్రం న్యూస్, కల్యాణదుర్గం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్చి 5న స్మశాన స్థలాల రక్షణ సాధన యాత్ర కళ్యాణదుర్గం నుండి ప్రారంభించే కరపత్రాలను కుందుర్పి ఎమ్మార్వో చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చెలమప్ప మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి ఆధ్వర్యంలో జరుగు యాత్రను విజయవంతం చేయడానికి భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలో ఉన్న స్మశానస్థలాలను రక్షించి ఆక్రమునకు గురైన స్థలాలను గుర్తించి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలమప్ప ఎమ్మార్వోకు జేఏసీ మండల కమిటీ తరఫున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ మండల ఇన్చార్జి మారుతి, తాలుకా జేఏసీ నాయకులు గంగాధర, అనుబంధ సంఘాల నాయకులు జాకీ నరసింహులు, రుద్రమని, తదితరులు పాల్గొన్నారు.

