-Advertisement-

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:16 వ జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ వ్యసాయ పరిశోదన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.శ్రీధర్ చౌహన్ ఆధ్వర్యంలో ఆదివారం తమ సిబ్బందితో జాతీయ ఓటర్ల ప్రతిజ్ఞను చేయించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమన్నారు. ఓటు అందరి హక్కు. దేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందన్నారు. ఓటుతో అవినీతిని పారదోలే అవకాశం ఉంటుందని, ప్రశ్నించే అధికారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో డా.కె.రాజశేఖర్, డా. మోహన్ దాస్, సీనియర్ అసిస్టెంట్ వి. శ్రీనివాస్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, టైమ్స్ స్కేల్ ఉగ్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments