అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ గోడం నగేష్
చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మొక్కజొన్న, జొన్న పంటలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ పరామర్శించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఎంపీ, జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల గోసను ఆలకించిన ఎంపీ, వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున త్వరితగతిన సహాయం అందేలా చూడాలని ఆదేశించారు. బోథ్ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం (Fire Station) ఏర్పాటు చేయాలన్న రైతుల విజ్ఞప్తిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో అధికారులతో చర్చించి, త్వరలోనే ఇక్కడ అగ్నిమాపక కేంద్రాన్ని తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరే రవీందర్, మాజీ దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జి.వి. రమణ, బోథ్, బజార్ హత్నూర్ పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీజేపీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

