-Advertisement-

జైనథ్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం: భక్తులతో పోటెత్తిన లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం

జైనథ్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం: భక్తులతో పోటెత్తిన లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం

చిత్రం న్యూస్, జైనథ్:  ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో శుక్రవారం ‘హిందూ సమ్మేళనం’ అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిర ప్రాంగణంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సమ్మేళనానికి గౌరవ అతిథిగా గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి విచ్చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రాంత ప్రముఖ్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణ, సామాజిక సమరసత, ఐక్యత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, దేశాభివృద్ధిలో హిందూ సమాజం పోషించాల్సిన పాత్రను వారు నొక్కి చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, వందేమాతరం గీతం పఠనం చేశారు. ముఖ్యంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమ్మేళనానికి విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, నారాయణ స్వామి ఆలయ చైర్మన్ రుకేష్ రెడ్డి, పలు పార్టీల నాయకులు జగదీష్ రెడ్డి, పిడుగు సంతోష్ యాదవ్, సర్సన్ లింగారెడ్డి, కట్కం రాందాస్, వెంకట్ రెడ్డి, చిలుకూరి లింగారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాంరెడ్డి, రాకేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పిడుగు స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.  హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కులాలు, ప్రాంతాలు మరియు పార్టీలకు అతీతంగా “మనమంతా హిందువులం” అనే ఏకైక భావనతో ఈ సమ్మేళనం నిర్వహించబడింది. మన దేశాన్ని, ధర్మాన్ని మరియు ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments