జైనథ్లో ఘనంగా హిందూ సమ్మేళనం: భక్తులతో పోటెత్తిన లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం
జైనథ్లో ఘనంగా హిందూ సమ్మేళనం: భక్తులతో పోటెత్తిన లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో శుక్రవారం 'హిందూ సమ్మేళనం' అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిర ప్రాంగణంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమ్మేళనానికి గౌరవ అతిథిగా గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి విచ్చేసి భక్తులకు ఆశీర్వచనాలు...