భైంసాలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
*బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల శుక్రవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. ఫిర్యాదుదారుల ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబ వివాదాల పరిష్కారంలో ‘షీ టీం’ పాత్ర:
ఈ కార్యక్రమంలో వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకున్నారు. ప్రజలు నిర్మల్ వరకు రావడం కష్టంగా ఉండగా, భైంసాలోనే కౌన్సిలింగ్ కల్పించడం పై ఎస్పీ గారు చూపిన ఆలోచనను బాధితులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష:
గతంలో గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్ లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు.

