Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad ఆదివాసీల కోసం ‘టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ ప్రారంభించిన మంత్రి జూపల్లి

ఆదివాసీల కోసం ‘టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ ప్రారంభించిన మంత్రి జూపల్లి

0
43

ఆదివాసీల కోసం ‘టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ ప్రారంభించిన మంత్రి జూపల్లి

చిత్రం న్యూస్, ఉట్నూర్: ఆదివాసీ గూడాల ప్రజల్లో చైతన్యం నింపి, ఆధునిక సమాజంతో మమేకం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉట్నూర్ మండలం గోండు గూడలో బుధవారం రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ను జెండా ఊపి ప్రారంభించారు.

ముందుగా నాగోబగూడలో మంత్రికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదివాసీ నాయకులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గిరిజన, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బస్సుల్లో సుమారు 250 మంది ఆదివాసీలు హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరు శంషాబాద్ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, లుంబినీ పార్క్, శిల్పారామం, మ్యూజియంలు తదితర చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజు మర్మాట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కామ్డే, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp