చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఐపీఎల్ క్రికెట్ అంటే ఇష్టపడని అభిమానులు ఉండరు. పట్టణాలలోని స్టేడియంలోకి వెళ్లి చూసి ఆనందించే అవకాశం తక్కువ మందికే ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా స్టేడియంలోకి వెళ్లి చూడాలని నిరాశ చెందే అభిమానుల కోసం దేశవ్యాప్తంగా 50 నగరాలలో ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ఆపరేషన్ మేనేజర్ వికాస్ పండిట్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ గురించి వివరించారు.జిల్లా కేంద్రంలో ఈ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడం ఇది నాలుగో సారి అని ఆయన తెలిపారు. ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రత్యక్ష అనుభూతిని పొందవచ్చు అని తెలిపారు.ఈ ఫ్యాన్ పార్కులో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కేవలం రూ.100 తక్కువ ఛార్జీలు విధించబడతాయని తెలిపారు.ఇట్టి ఫ్యాన్ పార్క్ లో శని, ఆదివారాలలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు బిగ్ స్క్రీన్ పైన లైవ్ మ్యాచ్ లు చూపించబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, మేనేజర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.


