చిత్రం న్యూస్, బజార్ హత్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనే ఈ భారీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన మంత్రుల బృందానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఘనస్వాగతం పలికారు.
హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులకు కంది శ్రీనివాస రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి ఆయన సభాస్థలిని, పార్కింగ్ ఏర్పాట్లను ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


