చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో డీఎస్పీగా పి.సాయి కిరణ్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించడం, అలాగే యూనివర్సిటీతో సమన్వయం చేసుకుంటూ విధులను సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.




