-Advertisement-

నిబంధనలను పట్టించుకోని బట్టీలను తక్షణమే సీజ్ చేయాలి

*జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో కు సామాజిక సేవకులు కర్నె బాబురావు వినతి

చిత్రం న్యూస్: అశ్వాపురం: మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల ఏర్పాటుతో సమీప గ్రామాల ప్రజలు వాయుకాలుష్యంతో నరకం చూస్తున్నారని, యదేచ్చగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై అధికారులు తక్షణ మే చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ, సామాజిక సేవకులు కర్నె బాబురావు సోమవారం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో కు వేరువేరుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ, వాస్తవానికి ఇటుక బట్టి నిర్వహణకు భూగర్భగనులు, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయితీరాజ్,, అటవీ కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖ, నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలని, ముందుగా మైనింగ్ నుండి బ్రిక్లిన్ సర్టిఫికెట్, తీసుకొని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకుని నాలా వచ్చిన తర్వాత బట్టిలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటుకబట్టీల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా కొనసాగుతూ కలుషిత వాతావరణానికి కారణమవుతున్న  ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవటంలో అధికారులు తాత్సారమెందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని, బాబురావు ప్రశ్నించారు.ఇటుక బట్టీల నిర్వహణతో మొండికుంట, తుమ్మల చెరువు, సర్వాయిపాడు బంజర, గొల్లగూడెం, సీతారాంపురం గ్రామాల ప్రజలు వాతావరణ కాలుష్యం తో తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినా కనీస పట్టింపు లేదని వాపోయారు. ఇటుక బట్టీల యజమానుల నిర్వాకంతో వ్యవసాయ పంటలు కూడా ద్వంసమవుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ అటవీ భూముల్లో అక్రమంగా బట్టీలు నిర్వహిస్తున్నా,రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలన్నారు. మండలంలోని పలు గ్రామాలలో ప్రభుత్వ భూమిలో ఇష్టారాజ్యంగా బట్టీలు నడుపుతుండగా, ఈదురు గాలులకు బూడిద ఇళ్ళలోని నీటిపై పడుతుండగా, అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. దీనిపై అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశామని, స్పందన కరువు వవ్వటంతో ప్రజావాణిలో ఐటీడీఏ పీవో, కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.గ్రామాలలో రోజు రోజుకు ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనల ప్రకారం పలుశాఖల నుండి తీసుకున్న అనుమతుల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా అటు వైపు కన్నెత్తి చూసే తీరిక అధికారులకు లేకపోవడంతో బట్టీలయజమానులు ఆడిందే ఆటగా తయారైందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడికి పాల్పడినా,చిన్న పిల్లల చేత పని చేయిస్తూ బాల కార్మిక చట్టాలను తుంగలో తొక్కినా ఎవరూ పట్టించుకోకుండా, ఇక్కడ పనిచేసే కార్మి కులకు కనీస సౌకర్యాలు కలిపించకుం డా వలస కార్మికులతో పెట్టి చాకిరీ చేయిం చుకోవడంతో కార్మికులు దుర్భర జీవి తాలు గడుపుతున్నారన్నారు. పని చేసిన కడుపునిండా తిండి నింప కుండా పిల్లల్ని సైతం బాల కార్మికులుగా మారుస్తున్నారన్నారు. వారి బాల్యాన్ని ఇటుక బట్టీల్లో బందీ చేస్తూ చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారని ద్వజ మెత్తారు. ఇంత జరుగుతున్నా పర్యవేక్ష ణ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరె త్తినట్లుగా వ్యవహరిస్తూ ఇటుక బట్టీల వ్యాపారు లకు అండదండగా అంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే రహదారి పక్కనే ఇటుక బట్టీలు ఉండడంతో వాటికి వినియోగించే బూడిద,బొగ్గు,ఊక పదార్థాలను వినియో గించడంతో పూర్తిగా వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా ఇటుక బట్టీల కాల్చడం కోసం కలప అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతుందన్నారు. టన్నుల కొద్దీ కలపను ఇటుక బట్టీలకు తరలతున్న కనీసం ఫారెస్ట్ అధికారులకు పట్టింపేలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇటుక బట్టీల దందాపై కొరడా జూలిపించి అనధికార బట్టీలపై చర్యలు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments