-Advertisement-

రైతు భరోసా నిధుల విడుదల: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కంది శ్రీనివాస రెడ్డి క్షీరాభిషేకం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల ఫ్లెక్సీలకు ఘనంగా క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. రైతు భరోసా నిధుల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో నగదు జమ అయిందని, దీనివల్ల రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం రైతు ఉత్సవాలకు దారితీసిందని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, ఆత్మ చైర్మన్ సంతోష్ రావ్, లోక ప్రవీణ్ రెడ్డి, సాయిచంద్ గౌడ్, నరేష్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments