అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
*ముగిసిన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు
* ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సాయి చైతన్య
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గత వారం రోజులుగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్నిమాపక శాఖ నిర్వహించిన వారోత్సవాలు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఈ అవగాహనతో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగి సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు. అగ్గిమాపక శాఖ అధికారులు సూచించిన మేరకు జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సీపీ సాయి చైతన్య బహుమతులను ప్రధానం చేశారు. గత ఏడాది సంభవించిన వరదల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి పరమేశ్వర్, నిజామాబాద్ స్టేషన్ అధికారి శంకర్, రూరల్ అధికారి విక్రమ్, బోధన్ కేంద్ర అధికారి సుభాష్, నందిపేట్ ఇన్చార్జ్ అధికారి నరేష్, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులను శాలువాతో సన్మానించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బెస్ట్ ఫైటర్లను శాలువాతో సన్మానించారు.

