Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog

శ్రీకొల్లేటి పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్న ముంగర ఉమాదేవి

0

చిత్రం న్యూస్, కైకలూరు: కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోటలోని ” శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మ” జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం కళ్యాణ మహోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి చైర్ పర్సన్ ముంగర ఉమాదేవి శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మవారిని దర్శించుకుని బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషంగా ఉండాలని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నానని ఆమె తెలిపారు.

బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి ‘ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్’ అండ

0

రూ.34,780 ఆర్థిక సాయం అందజేస్తున్న ఇన్ఫినిటీ చారిటబుల్ చైర్మన్ బద్దే నాయక్

చిత్రం న్యూస్, కళ్యాణదుర్గం: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మరోసారి నిరూపించుకున్నారు.కంబదూరు మండలం పి.వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కరియప్ప అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో, ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది.​ కరియప్ప అనారోగ్యానికి గురైనప్పటి నుండి అనంతపురం పట్టణంలోని సన్ రే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులు అమ్మి, అప్పులు చేసి చికిత్స చేయించామని, ఆర్థిక భారం మితిమీరిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావాలంటే కట్టాల్సిన రూ.34,780 బకాయి చెల్లించలేని స్థితిలో వారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్టును ఆశ్రయించారు.

స్పందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్

​కుటుంబ దీనస్థితిని గమనించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తక్షణమే స్పందించింది. ఆసుపత్రి యాజమాన్యం పేరు మీద రూ. 34,780 చెక్కును అందజేసి, బకాయిలను క్లియర్ చేయడమే కాకుండా కరియప్ప ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయించి క్షేమంగా ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమంలో ​ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్, కార్యదర్శి, ​హరీష్, అబ్దుల్ వాహబ్, సభ్యులు తిప్పేస్వామి, మహేష్, రాము, ఓబులేష్, రామాంజినేయులు పాల్గొన్నారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులకు కరియప్ప కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.

పెద్దిరాజు పెద్దమ్మ కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య

0

చిత్రం న్యూస్, సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గం గంబీర్ పూర్ గ్రామం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటయ్యను ముదిరాజ్ సంఘ కులస్తులు, అంబేద్కర్ సంఘ సభ్యులు శాలువాతో సన్మానించారు. సర్పంచ్ బాణాల శ్రీనివాస్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైసయ్య, లింగం,,మాజీ ఉపసర్పంచ్ బాలయ్య, పరుశరాములు,బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

స్మశానస్థలాలకు రక్షణ కల్పించండి 

0

*ఎమ్మార్వో చేతుల మీదుగా స్మశానస్థలాల రక్షణ సాధన యాత్ర కరపత్రాలు విడుదల

చిత్రం న్యూస్, కల్యాణదుర్గం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్చి 5న స్మశాన స్థలాల రక్షణ సాధన యాత్ర కళ్యాణదుర్గం నుండి ప్రారంభించే కరపత్రాలను కుందుర్పి ఎమ్మార్వో చేతుల మీదుగా  శనివారం విడుదల చేశారు.  ఈ సందర్భంగా జేఏసీ చెలమప్ప మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి ఆధ్వర్యంలో జరుగు యాత్రను విజయవంతం చేయడానికి భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలో ఉన్న స్మశానస్థలాలను రక్షించి ఆక్రమునకు గురైన స్థలాలను గుర్తించి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలమప్ప ఎమ్మార్వోకు  జేఏసీ మండల కమిటీ తరఫున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ మండల ఇన్చార్జి మారుతి, తాలుకా జేఏసీ నాయకులు గంగాధర,  అనుబంధ సంఘాల నాయకులు జాకీ నరసింహులు, రుద్రమని, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి అనురాగ్ రెడ్డిని అభినందించిన కలెక్టర్ రాజర్షి షా

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సైన్స్ డే పురస్కరించుకొని సాత్నాల మండలం మేడిగూడ గ్రామానికి చెందిన రిసోనెన్స్ స్కూల్ విద్యార్ధి క్యాతం అనురాగ్ రెడ్డి స్వహస్థాలతో తయారు చేసిన అగ్రికల్చర్ ఫీల్డ్ ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శి షా  అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థితో మాట్లాడుతూ.ఉపయోగ విధంగా కరెంట్, డీజిల్ అవసరం లేకుండా రైతులకు ఉపయోగం ఉన్న వాటిని  తయారు చేసే ప్రయత్నంచేయాలని సూచించారు .సెలవుల్లో మీ వ్యవసాయ భూముల్లో ఇలాంటి వాటిని ప్రయత్నం చేస్తూ సమాజానికి ఉపయోగపడే విదంగా ఉండాలని అనురాగ్ రెడ్డిని ప్రశంసించారు.

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

0
Cheruku srinivas reddy
Cheruku srinivas reddy

చిత్రం న్యూస్, తొగుట: మండలంలోని జెప్తి లింగారెడ్డిపల్లె గ్రామంలో యెన్నం నాగవ్వ కిష్టారెడ్డి దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నాగవ్వ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడికి ఇళ్లు అందించడమే మా ప్రజా పాలన లక్ష్యం అని, విడతలవారీగా నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చూడటమే నా కర్తవ్యం అని అన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్),మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి,సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య, సర్పంచులు కనకయ్య, పాగల శోభా కొండల్ రెడ్డి,గొడుగు జయమ్మ నర్సింలు,ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బిక్షపతి,చందా సత్తయ్య,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి,బుస నిరంజన్ రెడ్డి,పంది రాజు, బండారు రమేష్ గౌడ్,సోలిపేట ప్రసాద్ రెడ్డి,బక్కన్న గారి సంపత్ రెడ్డి, మహ్మద్ షఫీ,స్వామి గౌడ్,చందా రవి,బాలరాజు,తిరుమల్జ, ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

భానుశర్మ కుటుంబానికి ఎంపీ రఘునందనరావు పరామర్శ 

0
MP RAGHUNANDAN RAO
MP RAGHUNANDAN RAO

చిత్రం న్యూస్, దుబ్బాక: భానుశర్మ కుటుంబాన్ని ఎంపీ రఘునందనరావు శనివారం పరామర్శించారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చౌదర్పల్లి గ్రామ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు దుబ్బరాజేశ్వరం శర్మ పరమపదించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ MP రఘునందరావు పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. చౌదర్పల్లి గ్రామ సర్పంచ్ కొత్త నాగరాజు గౌడ్ , ఉప సర్పంచ్ బండారి ఎల్లం, భగత్ సింగ్ యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఏన్కూర్ మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

0
LAKAVATH GIRIBABU
లకావత్ గిరిబాబు

చిత్రం న్యూస్, వైరా: ఏన్కూర్ మాజీ మండల అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు గిద్దగిరి సత్యనారాయణను వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితంసత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం వారి ఇంటికి వెళ్లిన లకావత్ గిరిబాబు సత్యనారాయణను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పొన్నం హరికృష్ణ, భూక్యా ధర్మనాయక్, షేక్ చాంద్ పాషా, షేక్ బాజీ, రాచబంటి వీరభద్రం, ఇల్లూరి రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

తూముకుంటలో ఘనంగా సీపీఐ మహాసభ 

0
CPI
CPI

చిత్రం న్యూస్, అనంతపురం: కుందుర్పి మండలం తూముకుంటలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ ) మహాసభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి పాలెం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, తాలూకా కార్యదర్శి గోపాల్, సీనియర్ నాయకులు వై. గోపాల్, శివలింగప్ప, విరుపాక్షప్ప, మహేష్, రవి, మంజునాథ్, హనుమంత రాయుడు, గంగాధర, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ కార్యదర్శిగా అంగిడి మంజన్న, మఠం సహాయ కార్యదర్శిగా జి.నాగభూషణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఘనంగా సన్మానించారు.

మాంగ్రూడ్ గ్రామంలో బయోరీసర్చ్ సెంటర్ ప్రారంభం

0

చిత్రం న్యూస్, బేల: మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో సీపీఎఫ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జీవామృత కేంద్రాన్ని జిల్లా ఉద్యానవన శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సయ్య, మండల అధికారులు, ఏరువాక శాస్త్రవేత్తలతో కలిసి ప్రారంభించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువుల ద్వారా తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్ లను ఏర్పాటు చేసి అందులో లభించే పోషకాల గురించి వివరించారు. ఈ సందర్బంగా సీపీఎఫ్ స్వచ్చంద సంస్థ ప్రోగ్రామ్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడకంతో భూమి యొక్క సారవంతం తగ్గిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతుందన్నారు.రసాయనిక ఎరువులు వాడకంతో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.జీవామృతం వంటి మట్టి ఆరోగ్యాన్ని పెంపొందించడం, రైతులకు పెట్టుబడి ఖర్చును తగ్గించడం, విషరహిత ఆహార ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన వ్యవసాయానికి దోహదపడతుందన్నారు.