Home Blog Page 98

ఘనంగా ఎంఈఓ కోల నరసింహులుకు సన్మానం 

బేలలో ఎంఈఓ కోల నరసింహులు దంపతులను సన్మానిస్తున్న

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా కోల నర్సింహులు ఉద్యోగ విరమణ పొందారు. గురువారం బేల  మండల కేంద్రంలోని గణేష్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆయన్ను ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తహసిల్దార్ రఘునాథ్ రావు ఎంపీడీవో మహేందర్, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణ కుమార్ టిఎన్ స్వామి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవరావు నితిన్, రాష్ట్ర, జిల్లా బాధ్యులు, ఎంఈఓ లు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

✖ Close హోం

పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ 

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈఓ శ్రీనివాసరెడ్డి

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలు పాఠశాలలను గురువారం జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిర్సన్న ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి.. వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు.. పబ్లిక్ పరీక్షలకు ఇప్పటి నుంచి పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం బేల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు  పాఠశాల కొనసాగుతున్న ఏఐ తరగతులను పరిశీలించి కార్యక్రమ నిర్వాణపై ఆరా తీశారు.ముఖ గుర్తింపు హాజరు నమోదుపై అరా తీశారు. అనంతరం ఉర్దూ పాఠశాల సందర్శించి సమస్యలపై అరా తీశారు. అక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందని పోషకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన డీఈఓ సాయంత్రం వేరే పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహాలక్ష్మి, సదానంద్ కు పలు సూచనలు చేశారు.

✖ Close హోం

పంబాల కులస్తులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి

మాట్లాడుతున్న పంబాల సంఘం జిల్లా నాయకులు

చిత్రం న్యూస్, శంకరపట్నం: పంబాల కులస్తులకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ లు కుల, నివాస, ఆదాయ, ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పంబాల కుల సంఘం జిల్లా నాయకులు రౌతు సంపత్ కుమార్. జిల్లా న్యాయవాదుల సంఘం అసోసియేషన్ నాయకుడు కొరిమి ప్రవీణ్ కుమార్, కొరిమి గణేష్ ఆరోపించారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల కులస్తులను గుర్తించి ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఇంటింటికి తిరిగి అధికారులు పంబాల కులాన్ని నమోదు చేయడం జరిగిందని అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ కాస్ట్ ను మూడు కేటగిరీలుగా తీర్మానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  ఇందులో భాగంగా పంబాల కులస్తులను ఎస్సీ ఏ క్యాటగిరిలో చేర్చడం జరిగిందని, సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కు ఎన్నో సార్లు విన్నవించిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.  పంబాల కులస్తులు కొరిమి. రౌతు.గొట్టే. గుంటి.గడ్డం.గంట, దేవ. సుద్దాల. సుకోసి. బత్తుల ఇంటిపేరు ఉంటుందని తెలిపారు.  తాము. జముడికే. సుతి. పంబజోడు. గజ్జలు. తాళాలు. వీర గోల. తదితర వస్తువులు తమ కులస్తుల దగ్గర ఉంటాయని ఆయన చెప్పారు.  తాము ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, భూలక్ష్మి, శ్రీలక్ష్మి  తదితర గ్రామదేవతలను కొలుస్తామని ఆయన చెప్పారు. ఇంతటి చరిత్ర గల పంబాల కులస్తులను గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ,రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

✖ Close హోం

బోగస్ పింఛన్లను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానం

పోస్టాఫీసులో ఫేస్ రికగ్నిషన్ విధానంలో  పింఛను అందజేస్తున్న దృశ్యం

చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణలో పింఛన్ల పంపిణీలో ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా, పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు తీసుకునే వారికి ఈ విధానం వర్తిస్తుంది. దీని ద్వారా వేలిముద్రలు సరిగా పడని లబ్ధిదారులకు కూడా సులభంగా పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇది ఒక సాంకేతికత, దీని ద్వారా ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తించి, వారిని ధృవీకరించవచ్చు. ఈ విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో మోసాలను అరికట్టవచ్చు. వేలిముద్రలు సరిగా పడని వ్యక్తులు, ముఖ్యంగా వృద్ధులు, ఈ విధానం ద్వారా సులభంగా పింఛన్లు పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో తపాలా కార్యాలయాల ద్వారా పింఛన్లు ఈ విధానం ద్వారా బోగస్ పింఛన్లను గుర్తించి, అర్హులైన వారికి మాత్రమే పింఛన్లు అందేలా చూడవచ్చని బీపీఎం భోజన్న పేర్కొన్నారు.

✖ Close హోం

ఇందిరమ్మ ఇండ్ల పనుల పరిశీలన 

ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో మహేష్ కుమార్

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బెల్లూరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ పనులను ఎంపీడీవో మహేష్ కుమార్ గురువారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు బ్యాంక్ లలో తక్కువ వడ్డీకి రుణ సదుపాయం పొందే అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట గ్రామ పంచాయితీ కార్యదర్శి చక్రవర్తి, గ్రామస్థులు బాజీరావ్, పొట్టేన్న , దేవన్న,ఆకాష్, సుజీత్, పలువురు ఉన్నారు.

✖ Close హోం

అర్హులైన పేదలకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి :ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

పంచాయతీ భవనానికి భూమిపూజ చేస్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి

చిత్రం న్యూస్, జైనథ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర నిధులతో ఇల్లు లేనటువంటి పేదవారందరికీ ఇల్లు అందజేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం జైనథ్ మండలంలోని జైనథ్, బెల్గాం గ్రామాలలో డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేసి, నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాలు ఏవి వచ్చినా అర్హులైన వారికి అందే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులు ఎవరు కూడా మధ్యవర్తులను నమ్మవద్దని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి తక్కువ ధరకే సిమెంట్ లభించే విధంగా కంపెనీలతో మాట్లాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, బీజేపి అదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్,మాజీ బీజేపి మండల అద్యక్షుడు కట్కం రాందాస్, బీజేపి మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎల్టీ అశోక్ రెడ్డి, సామ రమేష్ రెడ్డి, తిపిరెడ్డి రాకేష్ రెడ్డి,సూర్య రెడ్డి, ప్రతాప్ యాదవ్, సామ రమేష్ రెడ్డి, విశాల్, కుమ్ర బాజీరావ్, అశోక్,సురేష్ రెడ్డి, పోశాలు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి 

*ఆయిల్ పామ్ సాగుకు తక్కువ నీరు అవసరం

చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణలో అయిల్ పామ్ సాగు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో వివిధ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కలిపిస్తుంది.ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన శాఖ, ప్రీయునిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్తంగా గురువారం కామోల్ రైతు వేదికలో భైంసా ఉద్యాన శాఖ జావేద్ పాషా,ఏఈవో రాజు,ప్రీయునిక్ కంపెనీ శేఖర్, శివాజీ,పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయిల్ పామ్ సాగు కోసం రైతుకి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ లో మొక్కలు అలాగే డ్రిప్ పరికరాలు, పంట సాగు విధి విధానాలు ఉద్యానశాఖ జావేద్ పాషా, వివరించారు. ఏఈవో రాజు మాట్లాడుతూ..ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు వస్తున్నాయని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నార న్నారు. ఈ సాగుతో తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని, అంతర పంటలు కూడా వేసుకోవచ్చని,ప్రభుత్వం కూడా ఈ సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగు 40 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు.ప్రతి సంవత్సరం ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు.నీటి ఆదా ఆయిల్ పామ్ సాగుకు తక్కువ నీరు అవసరం, ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు, దీని ద్వారా అదనపు ఆదాయం పొందవఛారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని,  రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని  పేర్కొన్నారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులను ఈ సాగుకు ప్రోత్సహిస్తోందన్నారు.ఈ కార్యక్రమం అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

✖ Close హోం

ఆయిల్ పామ్ సాగుపై రైతులు ముందుకు రావాలి

ఏఈవో రాజు

చిత్రం న్యూస్,  భైంసా: ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడానికి శుక్రవారం  కామోల్ రైతు వేదిక లో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏఈవో రాజు తెలిపారు. ఈ సదస్సులో ఆయిల్  పామ్ పంట సాగు, యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్యం, మార్కెటింగ్, ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వివరిస్తామన్నారు. రైతులకు ఆయిల్ పామ్ సాగులో మెలకువలు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం అవగాహన కల్పిఇస్తామన్నారు. భవిష్యత్తులో ఆయిల్  పామ్ సాగు ఒక మంచి ఆదాయ వనరుగా ఉంటుందని, రైతులు ఈ పంటను సాగు చేయడానికి ముందుకు రావాలని ఏఈవో రాజు సూచించారు.

✖ Close హోం

ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి కుటుంబానికి రూ.51,500 ఆర్థిక సాయం అందజేత

ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి కుటుంబానికి రూ.51,500 ఆర్థిక సాయం అందజేస్తున్న పీ హెచ్ సీ సిబ్బంది

చిత్రం న్యూస్, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి ఇటీవల మరణించారు. కాగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గొట్టే శ్రవణ్ కుమార్, సిబ్బంది ,ఆశాలు సమిష్టిగా విరాళాలు సేకరించారు. తమ వంతుగా రూ.51,500 నగదును  ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

✖ Close హోం

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి-ఎమ్మెల్యే పాయల్ శంకర్  

బీజేపీలో చేరిన మాజీ ఎంపీటీసీ రేణుకాబాయి కి పార్టీ కండువా కప్పుతున్నా ఎమ్మెల్యే పాయల్ శంకర్  

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, సుమారు రెండు ఏళ్లుగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ను అప్పుల కుప్పగా మారుస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం సాత్నాల మండలం జామిని గ్రామ మాజీ ఎంపీటీసీ రేణుక బాయి తో పాటు పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు, సిసి రోడ్లు, పానాది రోడ్ల నిర్మాణాలు, చివరికి శ్మశానవాటికల నిర్మాణాలు సైతం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు చేరడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపర్చే అభ్యర్థులను గెలిపించి, పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుతో పాటు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు. గ్రామస్థులు పాల్గొన్నారు.

✖ Close హోం