Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 97

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు

0

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు

చిత్రం న్యూస్,కొత్తపేట: రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో  పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. పంచాయితీ రాజ్ నిధులు రూ. 70 లక్షలతో దేవరపల్లి నుండి కొత్తపాలెం వరకు నిర్మించనున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. భూమి పూజచేసి కొబ్బరికాయ కొట్టారు. గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.15.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి ఆకుల రామకృష్ణ,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

యోగాoద్ర అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

0

యోగాoద్ర అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

చిత్రం న్యూస్, పెదపూడి:  11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదపూడిలో యోగాoద్ర అవగాహన ర్యాలీలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు,పెదపూడి మండల NDA నాయకులు, తెలుగు మహిళలు, పెదపూడి గ్రామ NDA నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఏపీ అడుగులు

0

విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఏపీ అడుగులు

*175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలు వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు

*వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్

చిత్రం న్యూస్, ఏలూరు: గత ఐదేళ్ల వైయస్సార్సీపి ప్రభుత్వం సాగించిన అరాచక పాలనలో జరిగిన విధ్వంసం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తుందని రోషన్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సహచర ఎంపీలతో పాటు చింతలపూడి శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా “పీ-4” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు.

దేశంలోని ఏ సీఎంకి రాని ఆలోచనలు ఎన్టీఆర్ కు వచ్చాయి

0

దేశంలోని ఏ సీఎంకి రాని ఆలోచనలు ఎన్టీఆర్ కు వచ్చాయి

*ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరం లీడర్ గా రాణిస్తున్న మంత్రి లోకేష్ బాబు

*తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడివుంటాను

*ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

చిత్రం న్యూస్, ఆస్ట్రేలియా (సిడ్నీ):

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి ఇక్కడి తెలుగు ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.  నందమూరి తారక రామారావు 302 సినిమాల్లో నటించారు…అందులో 270 సినిమాలు హిట్. 94 సినిమాలు 300 రోజులు ఆడగా, 185 సినిమాలు 175 రోజులు ఆడాయి. 1962లో నెల్లూరులో మా కుటుంబ పెద్దలు శ్రీనివాస మహల్ థియేటర్ ను ప్రారంభించారు. ఆ థియేటర్ లో ఎన్టీఆర్ నటించిన వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాను చూడటం ఇంకా గుర్తుంది అన్నారు. 1983 నుంచి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను 1991లో దూబగుంట రోశమ్మ సారథ్యంలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమానికి అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ గా వ్యవహరించాను.

ఉమ్మడి ఏపీలోని అన్ని జిల్లాల్లో సారా వేలం పాటలు నిర్వహించగా, ఒక్క నెల్లూరు మాత్రం జరగకుండా అడ్డుకున్నామని నాటి రోజులను గుర్తుచేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ను కలిసి ఉద్యమం గురించి వివరించాం. మా ఆహ్వానం మేరకు నెల్లూరుకు వచ్చిన ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆ హామీతో అప్రమత్తమైన అప్పటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు నెలల్లోనే సారా నిషేధం అమలులోకి తెచ్చారన్నారు. 1994లో అధికారం చేపట్టగానే ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. రాష్ట్రం ఆదాయం కోల్పోతుందనే ఆందోళన ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారాన్నారు.2019 ఎన్నికల సందర్భంగా వైసీపీకి ఓట్లు వేస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి ఆ మద్యంతోనే వ్యాపారం చేశాడని ఆరోపించారు. సిట్ విచారణలో రూ.3200 కోట్ల కుంభకోణం జరిగిందని తేలింది. అనధికారికంగా జరిగిన విక్రయాలను లెక్కిస్తే ఏపీ లిక్కర్ స్కాం రూ.10 వేల కోట్లకు పైగానే మద్యం స్కామ్ జరుగుతోందని నేను 2019 నుంచి ఏటా ప్రెస్ మీట్లు పెట్టి చెబుతూనే వచ్చాను..ఈ రోజు సిట్ విచారణలో అదే తేలిందన్నారు. నటుడిగా సినిమాల్లో అలుపెరగకుండా పనిచేసిన ఎన్టీఆర్ అధికారం చేపట్టగానే పేదలకు పింఛన్ ఇవ్వాలని సంకల్పించారు. ఒక్క పింఛనే కాదు..మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, సింగిల్ విండో వ్యవస్థ, మండలాల ఏర్పాటు, రైతులకు హార్స్ పవర్ కరెంట్ రూ.50కే తదితర ఎన్నో పథకాలు, వ్యవస్థలను ఆవిష్కరించారు. తెలుగు గంగ ప్రాజెక్టుతో ఆ రోజుల్లోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు కృష్ణా జలాలు కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు ప్రజలతో పాటు చెన్నైకి తాగునీరు ఇవ్వడం ఎన్టీఆర్ ఆలోచనలతోనే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ఎన్టీఆర్ కు వచ్చాయన్నారు. ఆ రోజుల్లో విమానంలో ప్రయాణిస్తుంటే పేదల ఇళ్లు శ్లాబులతో కనిపిస్తే అది ఏపీ అని ఒక కేంద్ర మంత్రి చెప్పారంటే ఎన్టీఆర్ చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణం పుణ్యమేనన్నారు. రైతులకు 7 శాతం వడ్డీకే రుణాలు..సకాలంలో చెల్లిస్తే 5 శాతమే వడ్డీ వంటి పథకాలు అందించారు. ఎన్నో మంచి పనులు చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేసే అదృష్టం నాకు లభించిందన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో మూడు సార్లు మంత్రిగా వ్యవహరించానని, నారా లోకేష్ బాబుతోనూ కలిసి మంత్రిగా పనిచేశా..ఇప్పుడు వారితో కలిసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్నారు. యువగళం పాదయాత్రతో లోకేష్ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించి ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరం హీరోగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ టీడీపీ -జనసేన- బీజేపీ కూటమి ఘనవిజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.

ప్రభుత్వ విద్య నాణ్యమైన విద్య

0

ప్రభుత్వ విద్య నాణ్యమైన విద్య

చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని ZPHS కన్నాపూర్. MPPS ముత్తారం పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట నిర్వహించారు. ముత్తారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి , ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన ఉందన్నారు. ఈ కార్య్రమంలో కన్నాపుర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవన్ రెడ్డి, ముత్తారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్,చంద్రమౌళి,రామానంద తీర్థ, కుమారస్వామి , అంజనీ దేవి, అంగన్ వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు 

0

ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు 

*అభినందించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు

చిత్రం న్యూస్, ఏలూరు:  భీమడోలు ఏఎంసి చైర్మన్ శేషపు శేషగిరి  కుమారుడు శేషపు మోక్షిత్ సాయి జయంత్ ను అప్కాబ్ చైర్మన్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అభినందించారు. ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు సాధించారు.

బీజేపీ పార్టీ భోరజ్ మండల అధ్యక్షుడిగా గాజుల సన్నీ

0

బీజేపీ పార్టీ భోరజ్ మండల అధ్యక్షుడిగా గాజుల సన్నీ

*జైనథ్ మండల కార్యవర్గ సమావేశంలో ఎన్నిక 

చిత్రం న్యూస్, జైనథ్: ప్రధాని నరేంద్ర మోడీ  11 సంవత్సరాల పరిపాలన పైన బీజేపీ జైనథ్ మండల కమిటీ కార్యవర్గ సమావేశం నిరాల గ్రామంలో నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ ఎల్టి అశోక్ రెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.  భోరజ్ మండల అధ్యక్షులుగా గాజుల సన్నీని ఎన్నుకున్నారు.  నమ్మకంతో పదవి కట్టబెట్టినందుకు ఎంఎల్ఏ పాయల్ శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జైనథ్ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, జైనథ్ మండల ఉపాధ్యక్షులు గౌకర్ విశాల్, నాయకులు తోట రమేష్, గజానన్, దంతెల రవీందర్,ఏనుగు సూర్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూనె మంగాలక్ష్మి 

0
  1. పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూనె మంగాలక్ష్మి 

*కొలువుదీరిన పాలకవర్గం

చిత్రం న్యూస్ ,పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నూనె మంగా లక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. వైస్ చైర్మన్ గా మాదిరెడ్డి, చంద్రశేఖర్, రేలంగి వెంకట్రావు తో పాటు 13 మంది పాలకవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నేతలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

చింతలపూడి ఎమ్మెల్యే  రోషన్ కుమార్ పల్లె నిద్ర

0

చింతలపూడి ఎమ్మెల్యే  రోషన్ కుమార్ పల్లె నిద్ర

చిత్రం న్యూస్, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి కూటమి తలపెట్టిన పల్లె వెలుగు- స్వర్ణగ్రామం పథకంలో భాగంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహించేందుకు చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు ఆకర్షించేలా నాటక ప్రదర్శనలు నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టాం

0

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టాం

*పకడ్బందీగా పరీక్ష ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు

*ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం

*పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించాం

*మొట్టమొదటి సారిగా 4 వేల మందికి స్కూల్ అస్సిటెంట్లుగా పదోన్నతి

*విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష

చిత్రం న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ చేపట్టామని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో 4 గంటలకు పైగా సుదీర్ఘంగా వివిధ అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డిఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. డిఎస్సీ పరీక్షకు తొలిరోజు ఉదయం 88శాతం, సాయంత్రం సెషన్ లో 86శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్, లీప్ యాప్ కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసి విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. అంతిమంగా రాబోయే నాలుగేళ్లలో  ఏ పీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే తమ లక్ష్యమని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కూడా విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు. 27 వేలమందికిపైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టాం. ఇదివరకెన్నడూ లేనివిధంగా 4వేలమందికి పైగా టీచర్లకు స్కూల్ అస్సిటెంట్లు గా ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఎటువంటి రాజకీయజోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ మేరకు పూర్తి పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమం

రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో 15 – 59 సంవత్సరాల వయస్సు గలవారిలో ఇప్పటికీ 81 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉండటంపై మంత్రి విస్మయం వ్యక్తంచేశారు. భారదేశంలోనే వయోజన విద్యలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉన్న నేపథ్యంలో ఇకపై మిషన్ మోడ్ లో వయోజన విద్యా కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ఉల్లాస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఏడాది మార్చిలో 3.95 లక్షల మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా, 3.53 లక్షలమంది (90.12%) మంది పాసయ్యారని తెలిపారు. వయోజన విద్యా విభాగంలో 247 పోస్టులకుగాను 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా మంత్రి దృష్టికి తేగా, నూరుశాతం లక్ష్యాన్ని సాధించగలిగే అంకితభావం కలిగిన వారిని మాత్రమే పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడేళ్లలో అక్షరాస్యతలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.  సప్లయ్ – డిమాండ్ కు అనుగుణంగా స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ ను ఏర్పాటుచేయాలని, నైపుణ్యం యాప్ ను అప్ గ్రేడ్ చేయాలని స్కిల్ డెవలప్ మెంట్ అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. నైపుణ్యం పోర్టల్ లో అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్ధ్య పరీక్ష, సర్టిఫికేషన్, ఉద్యోగ కల్పన, పరిశ్రమల అనుసంధానం, పరిశ్రమల్లో ఖాళీల వివరాలు మొదలైన వాటిని పొందుపర్చాలని అన్నారు. సెక్టార్ వైజ్ ప్లేస్ మెంట్స్, జాబ్ మేళాల వివరాలను కూడా ఇందులో పొందుపర్చాలన్నారు. నైపుణ్యం యాప్ ద్వారా ఈ ఏడాది 6,83,052మంది దరఖాస్తు చేసుకోగా, 6,45,163మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, వారిలో 77,703మందికి ఉద్యోగాలు లభించాయని ఎపిఎస్ఎస్డిసి సిఇఓ గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆటిజం తో బాధపడుతున్న వారి తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా ఈ సెంటర్లలో నిపుణులను ఎంపిక చెయ్యాలని ఆదేశించారు. ఆటిజం పై ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల కమిటీ సలహాలు తీసుకోవాలని సూచించారు. స్కూల్ కిట్స్ అన్ని త్వరితగతిన విద్యార్థులకు అందేలా చూడాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాస్ ను ఆదేశించారు

ఉన్నత విద్య పై సమీక్ష

ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తూ… యూనివర్సిటీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేటప్పటికే సరైన నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగం సాధించే దశకు చేరుకోవాలని అన్నారు. ఇందుకు అవసరమైన నైపుణ్యశిక్షణ కార్యక్రమాలను కాలేజ్ స్థాయిలోనే పెద్దఎత్తున చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ యూనివర్సిటీల విసి పదవులకు సెర్చి కమిటీల ద్వారా సాధ్యమైనంత త్వరగా పేర్లు సూచించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తిని కోరారు. చైర్మన్ స్పందిస్తూ… ఈనెలాఖరులోగా ఆయా వర్సిటీలకు సెర్చికమిటీ సిఫారసులను పంపిస్తామని తెలియజేసారు. వివిధ యూనివర్సిటీల చట్టాలను సమీక్షించి అతి త్వరలో ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇందులో గవర్నింగ్ బోర్డ్ , ఎగ్జిక్యూటివ్ కమిటీ, అకడమిక్ కౌన్సిల్ మొదలగు విభాగాలు ఉంటాయని మధుమూర్తి మంత్రికి వివరించారు. ఎప్ సెట్, లా సెట్, పిజి సెట్ వంటి ప్రవేక్ష పరీక్షలను నిర్ణీత క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్నామని, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కాలేజీలు ప్రారంభం అవుతాయని తెలియజేసారు. విద్యార్థుల నమోదు కై అపార్ ఐడి 98శాతం పూర్తిచేశామని, త్వరలో నూరుశాతం పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఐఎస్ బి, ట్రిపుల్ ఐటి, ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చి (నైపర్) ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఫారిన్ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులపై మంత్రి సమీక్షించారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కు అడ్డంకిగా ఉన్న జాయింట్ సిర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ (జేసిడి) నిబంధనలను సడలించే అంశం పై చర్చించారు. నాణ్యత పై ఎటువంటి రాజీ లేకుండా ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చే ఎన్ఓసి లు మరింత సులభతరంగా అందజేయాలని ఆదేశించారు. అలాగే త్రిపుల్ ఐటి కనిగిరి ఏర్పాటు పై సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, కళాశాల విద్య డైరక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిఇఓ గణేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.