Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 95

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ముడుపు మౌనిష్ రెడ్డి

0

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ముడుపు మౌనిష్ రెడ్డి

* జైనథ్, బేల మండలాల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ 

*ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున 25 వేలు అందజేత 

చిత్రం న్యూస్, జైనథ్:  జైనథ్, బేల మండలాల్లో  మృతిచెందిన బాధిత కుటుంబాలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున ఐదుగురికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేశారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు తరోడ వాగులో కొట్టుకుపోయి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. సాంగ్వి (కే) గ్రామంలో కరెంట్ షాక్ తో మృతి చెందిన బోయర్ దామోదర్ కుటుంబ సభ్యులను, అనారోగ్యం కారణంగా మృతి చెందిన బావునే గంగారాం కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికీ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల పిడుగుపాటుకు గురై మరణించిన బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన నందిని కుటుంబ సభ్యులను, సోన్ ఖాస్ గ్రామానికి చెందిన కోవా సునీత కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారి వెంట మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, నరేష్, అనిల్, రామాజీ, విలాస్, సాయి కిరణ్ రెడ్డి,  సంజయ్ గుండావార్, సచిన్, బాపురావు, సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, దినేష్, శ్రీకాంత్,సాయి, అతర్వ  తదితరులు ఉన్నారు.

పిల్లల చదువుకు ” తల్లికి వందనం “

0

పిల్లల చదువుకు ” తల్లికి వందనం “

*ఒకే కుటుంబంలో రూ.75 వేలు నగదు ఖాతాలో జమ

*పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప

చిత్రం న్యూస్, సామర్లకోట: పిల్లల చదువుకు ” తల్లికి వందనం ” డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  ఆయన మాట్లాడుతూ..కాకినాడ జిల్లా సామర్లకోట టౌన్ లో భాస్కర్ కాలనీలో 31వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీకి చెందిన కుటుంబంలో  ఐదుగురు పిల్లలకు తల్లికి వందనం కింద రూ. 75 వేలు నగదును ఖాతాలో కూటమి ప్రభుత్వం జమ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం  కార్యక్రమంతో తమ పిల్లలకు చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి,  సామర్లకోట టౌన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అకౌంట్లు యాక్టివేట్ చేసుకోండి.. డబ్బులు పడతాయి

0

అకౌంట్లు యాక్టివేట్ చేసుకోండి..డబ్బులు పడతాయి

*మంత్రి నారా లోకేష్

చిత్రం న్యూస్, అమరావతి: అర్హులందరికీ ‘తల్లికి వందనం’ డబ్బులు జమ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మంది పిల్లలకే అమ్మఒడి ఇస్తే మేం 67 లక్షల మందికి ఇస్తున్నాం. కొంతమంది అకౌంట్లు యాక్టివేట్ లేక నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చాయి. అలాంటి తల్లులు బ్యాంకులకు వెళ్లి ఖాతాలు యాక్టివేట్ చేసుకుంటే డబ్బులు పడతాయి’ అని లోకేశ్ సూచించారు.

వికసిత్ భారత్ కి పునాది 

0

వికసిత్ భారత్ కి పునాది 

*కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ 

చిత్రం న్యూస్, కాకినాడ: ప్రధాని మోదీ 11 సంవత్సరాల పరిపాలనలో విజయాలను అలాగే గణనీయమైన పరివర్తన తీసుకువచ్చాయని అధికార పరిరక్షణ నుండి పనితీరు జవాబుదారీతనం వరకు ప్రతిదీ సుపరిపాలన అని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ  అన్నారు. గురువారం పైడా చలమయ్య కళ్యాణ మండపంలో  ప్రధాని మోదీ 11ఏళ్ల పరిపాలనపై నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రజల నేతృత్వంలోనిదని పారదర్శకత భవిష్యత్ విధానానికి కట్టుబడి ఉందన్నారు. వికసిత్ భారత్ కు పునాది వేయబడిందని, భారతదేశానికి అమృతకాలం సేవ అని కొనియాడారు. అనంతరం ప్రధాని మోదీ నిర్వహించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలను ఎగ్జిబిషన్ గా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

0

సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

*మానకొండూర్ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ 

చిత్రం న్యూస్, శంకరపట్నం: దేశంలోనే తెలంగాణ సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాత్రమేనని మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ అన్నారు.  అంబల్పూర్ గ్రామానికి చెందిన తిప్పబత్తిని కవిత, సముద్రాల రాయ మల్లుకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కవంపల్లి, టీపీసీసీ సభ్యులు మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేస్తున్నాడన్నారు. ఎస్సీ,బీసీ, ఎస్టీ, మైనారిటీలకు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి,   అంబల్పూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వడ్లకొండ వినోద్, ఏగుర్ల ఎల్లయ్య. జక్కి రవి, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బేల మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతి

0

బేల మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతి

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలో గురువారం రెండు చోట్ల పిడుగుపడడంతో ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సాంగిడి  గ్రామంలో పిడుగు పాటుకు చేనులో పనులు చేస్తున్న మహిళ  గెడం నందిని మృతిచెందగా మరో మహిళకు గాయాలయ్యాయి. ఇదే మండలంలోని  సోన్ కాస్ గ్రామంలో పిడుగు పడటంతో పొలంలో పని చేస్తున్న మరో మహిళ సునీత మృతి చెందారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప 

0

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప 

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 తో  ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పెద్దాపురం పార్టీ కార్యాలయంలో,నాయకులు ,కార్యకర్తలతో కలిసి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ..ఎంతో సంతోషంగా ఉందని ఆన్నారు. సంవత్సరం కాలంలో ఎన్నో అభివృధి కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ప్రసాద్ ల్యాబ్ లో “ప్రేమిస్తున్న” చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి

0

ప్రసాద్ ల్యాబ్ లో “ప్రేమిస్తున్న” చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి

*హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు సుబ్బు

 

చిత్రం న్యూస్, ఫిలింనగర్: ఐబీఎం ప్రొడక్షన్ హౌస్ అధినేత దుర్గారావు పప్పుల నిర్మాతగా, భాను దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ప్రేమిస్తున్న. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో బుధవారం పూర్తి చేసుకుంది. తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు సుబ్బు మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా “ప్రేమిస్తున్న చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నారు. ప్రేమిస్తున్న చిత్రంలో ఓ కూతురికి తండ్రిలాగా బాధ్యత గల పాత్రను పోషిస్తున్నట్లు తమిళ నటుడు సుబ్బు తెలియజేశారు. దర్శకుడు భాను చెప్పిన కథ విధానం నచ్చి ఈ చిత్రంలో నటించినట్లు ఆయన తెలిపారు. అవకాశం వస్తే తెలుగు సినిమాలలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుబ్బు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు భాను శంకర్, నిర్మాత కనక దుర్గారావు పప్పుల, నిర్వాహకులు.M. రవికుమార్, నటులు శ్రీనివాస్, దర్శక విభాగం, P. ప్రదీప్. శ్రీకాంత్, గణేష్, మేనేజర్ లక్ష్మణ్, తదితరులు  పాల్గొన్నారు.

బీరప్ప జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలి 

0

బీరప్ప జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలి 

_గుడిసె పోచయ్య పెద్ద కురుమ

చిత్రం న్యూస్, శంకరపట్నం: బీరప్ప జాతరను ప్రశాంతంగా ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లను చేస్తున్నట్లు పెద్ద కురుమ కుల గుడిసె పోచయ్య అన్నారు.  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని అంబల్పూర్ గ్రామంలో శ్రీ బీరప్ప ఆలయ జాతర ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివస్తారు. ఈ సందర్భంగా గుడిసె పోచయ్య పెద్ద కురుమ నుశాలువతో సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీరప్ప జాతర వైభవంగా జరగనున్నట్లు ఆయన తెలిపారు.  కురుమ యూత్ నాయకుడు గుడిసె సుమన్ మాట్లాడుతూ ..ఐక్యంగా జాతరను జరుపుకోవాలని అన్నారు. గోస్కుల లింగమూర్తి మాట్లాడుతూ..  బీరప్ప  జాతరను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అన్నారు.  మాజీ పెద్ద కురుమ గుడిసె కొమురయ్య మాట్లాడుతూ.. బీరప్ప జాతరను సమర్ధవంతంగా కుల సభ్యులు అందరూ సఖ్యతగా ఉండేలా చూడాలని అన్నారు.   (కురుమ కుల నాయకుడుగా ఏకగ్రీవంగా ఎన్నిక ) అంబల్పూర్ కుల కురుమ నాయకుడిగా గుడిసె పోచయ్య కురుమ ఏకగ్రీవంగా బుధవారం నాడు 49 మంది సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఈ కార్యక్రమంలో కుల గురువులు కురుమ కులస్తులంతా 49 సభ్యులు పాల్గొన్నారు.

దుగోడ మిషన్ లో చేయి ఇరికి వ్యక్తికి గాయాలు

0

దుగోడ మిషన్ లో చేయి ఇరికి వ్యక్తికి గాయాలు 

*శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఘటన

చిత్రం న్యూస్, శంకరపట్నం: దుగోడ మిషన్ లో చేయి ఇరికి ఓ వ్యక్తికి గాయాలైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో చోటుచసుకుంది. గ్రామానికి చెందిన ముతోజు శ్రీనివాస్ (40) రోజువారి పనిలో భాగంగా బుధవారం దుగోడ మిషన్ తో పనిచేస్తుండగా అకస్మాత్తుగా శ్రీనివాస్ కుడి చేయి దుగోడ మిషన్లో ఇరుక్కుపోవడంతో కుడి చేయి బొటనవేలు నుజ్జు నుజ్జు అయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేయడంతో  ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి,  పైలెట్ కాజా ఖలీలుల్లా సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. క్షతగాత్రుని అంబులెన్స్ లో తీసుకొని కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కు తరలించారు.