Home Blog Page 93

ఆర్మీ జవాన్ కి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

ఆర్మీ జవాన్ మహేందర్ కు ఘన స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భాది గ్రామానికి చెందిన ఆకుల మహేందర్ దేశ సరిహద్దులను కాపాడే వీర సైనికుడిగా విశేష సేవలందించి పదవీ విరమణ చేశారు. గురువారం తన సొంత గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పూలదండ వేసి శాలువాలతో సత్కరించారు. జవాన్ మహేందర్ మాట్లాడుతూ..ఇన్ని రోజులు దేశానికి సేవ చేయడం తనకు చాల సంతోషం ఇచ్చిందని, ప్రతి ఒక్కరు దేశ పౌరులుగా దేశభక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు. యువత ఆర్మీలో చేరాలని పిలుపునిచ్చారు.

✖ Close హోం

యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

*తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు

*ప్రధాని గారి చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా జరుపుకుంటున్నం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మావలలోని రత్న గార్డెన్స్ లో గురువారం తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 6 వ యోగా పోటీలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన యోగ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతు.. రాష్ట్ర స్థాయి పోటీలను జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. యోగాను ప్రతి ఒక్కరు సాధన చేయాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, నాయకులు విజయ్ బోయర్, లాలా మున్నా, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

మురుగు కాలువలో పసికందు మృతదేహం లభ్యం

మురుగు కాలువలో పసికందు మృతదేహం లభ్యం

భైంసాలో అమానవీయ ఘటన

5 నుంచి 6 నెలల వయస్సు శిశువుగా గుర్తింపు

చిత్రం న్యూస్, భైంసా:ఏ తల్లి కన్నబిడ్డో..ఆ తల్లికి ఎందుకు భారమైందో  తెలియదు.  తన పొత్తిళ్ళలో నిద్రించాల్సిన ఆ శిశువు మురుగుకాలువ పాలయింది. కనులు తెరిచి లోకాన్ని చూడాల్సిన  ఆ పసికందు లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. నిర్మల్ జిల్లాలోని మున్సిపల్ కేంద్రమైన భైంసాలో గురువారం ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. కలకలం రేపింది.

మురుగు కాలువలో మృతదేహం లభ్యం

స్థానిక నర్సింహనగర్ కాలనీ ప్రాంతంలోని వేదం హైస్కూల్ పక్కన, రేయిన్బో హైస్కూల్ ముందరి భాగంలోని మురుగుకాలువలో శిశువు మృతదేహం లభ్యమయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు నెలలు నిండని పసికందును మురుగు కాలువలో పారవేసినట్లుగా తెలిసింది. మధ్యాహ్నం వేళలో అక్కడి మార్గం మీదుగా వెళ్తున్న కొందరు మురుగు కాలువలోని శిశువు మృతదేహాన్ని గుర్తించడంతో ఘటన వెలుగు చూసింది. సంబంధిత సమాచారం అందుకున్న పట్టణ సీఐ గోపీనాథ్ , మున్సి పల్ అధికారులు, సిబ్బందితో కలిసి మురుగు కాలువలో  ఉన్న శిశువు పిండాన్ని బయటకు తీసారు. అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. శిశువు మృతదేహం ఐదు నుంచి ఆరు నెలల వయసు ఉన్నట్లు గుర్తించారు.

✖ Close హోం

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ

రిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన తొడసం సోనేరావ్ నివాసంలో జరిగిన గ్యాస్ ప్రమాదంలో గాయపడి ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 గురు పేషంట్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో మాట్లాడి అందరికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. వీరి వెంట సర్పంచుల సంఘం  మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ స్వామి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, తిరుమల్ గౌడ్, శ్రీరామ్ నాయక్, చంద్రమోహన్, కేదారేశ్వర్ రెడ్డి, ఇఫ్తేకార్ తదితరులు ఉన్నారు.

✖ Close హోం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు రావాలని టీపీసీసీ నేత ఆత్రం సుగుణకు ఆహ్వానం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు రావాలని టీపీసీసీ నేత ఆత్రం సుగుణకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న రాయ్ సెంటర్ పెద్దలు

చిత్రం న్యూస్, ఉట్నూర్:  ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఘనంగా నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను గౌరవ ఆతిథిగా రావాలని గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ పెద్దలు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ప్రతినిధులు ఆమెను ఉట్నూర్ మండల కేంద్రంలో కలిసి ,ఈ సభ ముఖ్య ఉద్దేశ్యాలు, ఆదివాసీ హక్కులపై చర్చించారు. ఆదివాసి గూడాల అభివృద్ధి కోసం ఆత్రం సుగుణ చేస్తున్న నిరంతర కృషిని కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఆత్రం సుగుణ మాట్లాడుతూ..ఆదివాసుల హక్కులు, వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆదివాసీల హక్కులు, భూసమస్యలు, యువత భవిష్యత్తు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ జిల్లా సార్ మెడీ మెస్రం దుర్గు,తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాది రావ్,మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం బుజంగరావు,మర్సు కొల తిరుపతి-సరస్వతి, సిడం గంగాధర్,పూర్కా బాపురావ్,గేడం మారుతీ,కొట్నాక్ గణపతి, ఆత్రం రాహుల్,కొట్నాక్ ఒమేశ్వర్, ఆడ హన్మంత్, రాధ బాయి, విమల బాయి,వెట్టి పార్వతి బాయి,అన్నపూర్ణ, కనక వెంకటేశ్వర్ రావ్, తొడసం భగవంత్ రావ్, కనక సంతోష్, కొలం గంగారాం,దుందే రావ్, సునీల్, తదితరులు పాల్గొన్నార

✖ Close హోం

బోథ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలకు ఆత్మీయ సన్మానం 

బోథ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలకు ఆత్మీయ సన్మానం

చిత్రం న్యూస్, బోథ్ : జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని స్థానిక మార్కండేయ గుడి ఆలయంలో బోథ్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  నేతన్నలను సన్మానించారు. గతంలో బోథ్ పట్టణం నుంచి భీవండి ,ముంబయి వెళ్లి అక్కడ రాట్నం, మగ్గాలు పై నేత పని చేసి తిరిగి బోథ్ లో స్థిర పడిన నేతన్నలకు,  విశ్రాంత ఉపాధ్యాయుడు దీకొండ సత్యనారాయణకు శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, చేనేత కార్మికులు సబ్బని నర్సయ్య, లక్క వత్తుల నారాయణ. తాటికొండ రాజేశ్వర్. గుండు మల్లేష్. కటకం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

పాఠశాలలో ముందస్తుగా రాఖీ పండగ సంబరాలు

పాఠశాలలో  బాలురకు రాఖీలు కడుతున్న  బాలికలు

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భైంసా మండలం వాలేగాం గ్రామం పాఠశాలల్లో రక్షాబంధన్ పండగను ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మన్,ఉపాధ్యాయులు సోనియా, డీ.రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి పోతన్న ,దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ వారి చేతుల మీదగా రాఖీలు విద్యార్థులకు కట్టించారు. అనంతరం ఉపాధ్యాయురాలు సోనియా మాట్లాడుతూ..రాఖీ బంధం అనేది విద్యార్థులతో  స్నేహం, సోదర, సోదరి భావం ఐక్యతను పెంపొందించడానికన్నారు. రాఖీ కట్టుకోవడం, బహుమతులు పంచుకోవడం ద్వారా విద్యార్థుల మధ్య స్నేహానుబంధం పెరుగుతుందన్నారు. ఈ పండగ యొక్క ప్రాముఖ్యత, సాంస్కృతిక విలువలను విద్యార్థులు తెలియజేయడం ఎంతైనా ఆవశ్యకత ఉందన్నారు. మహేష్ మాట్లాడుతూ.. రాఖీ పండగ అనేది ” నీకు నేను రక్ష,నాకు నీవు రక్ష ” మనమందరం దేశాన్ని రక్షణ వంటి నినాదంతో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలన్నారు. రాఖీ పండగ సంబంధించిన పాటలు పాడారు. నృత్యాలు, నాటకాలు ప్రదర్శించారు.

✖ Close హోం

భైంసా సబ్ కలెక్టర్ గా అజ్మీరా సాంకేత్ కుమార్

భైంసా సబ్ కలెక్టర్ గా  బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సాంకేత్ కుమార్

*బాసర అమ్మవారి దర్శనాంతరం బాధ్యతల స్వీకరణ

*స్వాగతం పలికిన రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది

చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా సబ్ కలెక్టర్ గా అజ్మీరా సాంకేత్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం  హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన మార్గ మధ్యంలో బాసర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అక్కడి నుంచి నేరుగా భైంసాలోని కార్యాలయానికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఆర్డీవో కోమల్ రెడ్డి, భైంసా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ లు, అర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది, సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో అర్డీవో కోమల్ రెడ్డి నుంచి సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సాంకేత్ కుమార్ కు నియోజక వర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు మర్యాద పూర్వకంగా కలిశారు.

✖ Close హోం

మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి

0

మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి

*ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం

*కేంద్ర మంత్రి జితేంద్ర మాంజిని కలిసి విజ్ఞప్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం MSME (మైక్రో, చిన్న మరియు మధ్యతరః పరిశ్రమల)రంగ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రెండు కొత్త MSME పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంజీ కి వివరించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,  సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్,ఎంపీ మల్లు రవి కలిసి విజ్ఞప్తి చేసి లేఖను అందించారు.  MSME రంగం సమగ్ర ఆర్థిక ప్రగతికి కీలక క్షేత్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఖమ్మం జిల్లా మధిర మండలంలోని యెండపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రెమిడిచర్ల గ్రామాల్లో MSME పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. వరుసగా 85 ఎకరాలు, 60 ఎకరాల్లో ఈ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ రహదారి 65 (హైదరాబాద్–విజయవాడ కారిడార్)కు సమీపంలో ఉండటంతో, వీటి భౌగోలిక స్థానం వ్యూహాత్మకంగా ఉంది. సమీప పట్టణాలు, రైల్వే నెట్వర్క్‌లు, పోర్టులతో అనుసంధానం ఉందని తెలిపారు. ఈ పార్కుల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ పార్కులు వివిధ తయారీ రంగాలకు అనుకూలంగా అభివృద్ధి చేయబడి, కనీసం 5,000 ప్రత్యక్షంగా 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలవనే అంచనాలతో ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. MSME-CDP పథకం కింద ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది.

ప్రతి నియోజకవర్గంలో MSME పార్కు ఏర్పాటు

తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. MSME-CDP పథకం కింద కేంద్ర నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం MSME రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో (మొత్తం 119) చిన్న స్థాయి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలతో కూడిన MSME పార్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, ఈ పార్కులు, చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించి, నడిపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని అందించనున్నాయని కేంద్రమంత్రికి తెలిపారు. ఈ MSME పార్కుల్లో హాస్టళ్లు, కిచెన్లు, టాయిలెట్లు, టెస్టింగ్ సెంటర్లు, ఇతర సాధారణ వసతులు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి ఆవిష్కరణ, మార్కెట్ వ్యూహం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. మహిళా ప్రాధాన్యత గల సంస్థలకు ప్రోత్సాహంగా స్ట్రీనిధి పథకం ద్వారా రుణాల మద్దతు కూడా ఇవ్వనున్నామని కేంద్రమంత్రికి వివరించారు. దీని ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు బలోపేతం కావడంతోపాటు, జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. ప్రస్తుతం MSME-CDP పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 ప్రాజెక్టులను కేంద్ర MSME మంత్రిత్వశాఖ సహకారంతో అమలు చేస్తోంది. వీటిలో ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో MSME వ్యవస్థను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర MSME మంత్రిత్వశాఖ మద్దతుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా MSME పార్కులను నెలకొల్పడానికి సంబంధిత పథకాల ద్వారా ఆర్థిక సహాయం కోరుతోంది. ఈ ప్రయోజనాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి ఎదుట వ్యక్తం చేశారు.

✖ Close హోం

ఘనంగా సోషల్ మీడియా కన్వీనర్ జీవన్ జన్మదిన వేడుకలు

ఘనంగా సోషల్ మీడియా కన్వీనర్ జీవన్ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని శంషాబాద్ గ్రామంలో బుధవారం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దర్నె జీవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 30 కుర్చీలను పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రశేఖర్, నాయకులు దశరథ్ పటేల్, దత్తా నిక్కం, సందీప్ ఠాక్రే, బర్కడే రాము, ప్రదీప్ ఖోడే, పొత్ రాజ్ నవీన్, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం