Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 90

చంద్రమాంపల్లి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించండి 

0

చంద్రమాంపల్లి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించండి 

_ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వినతిపత్రం అందజేస్తున్న  పెద్దాపురం ఏఎంసీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు 

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా అచ్చంపేట లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప క్యాంప్ కార్యాలయంలో నాయకులతో గ్రీవెన్స్  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామస్తులు తమ సమస్యలను వినతి రూపంలో ఇచ్చారు. చంద్రమాంపల్లి గ్రామస్తుల తరపున పెద్దాపురం ఏఎంసీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వినతిపత్రం అందజేశారు. అనంతరం తొలి అడుగు కార్యక్రమం  గురించి, అనుబంద కమిటీలు గురించి చర్చించారు. చంద్రమాంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు రేలంగి బుజ్జి ,టీడీపీ నాయకులు షేక్ రెహ్మాన్, పెద్దాపురం అబ్జర్వర్ బొల్లా వెంకటరమణ, క్లస్టర్ ఇంచార్జిలు, మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు ఇతర నియోజవర్గం నుంచి వచ్చిన మండల, పట్నం అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ పర్యటన

0

 

ముగిసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ పర్యటన

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో  రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది .ఈ సందర్భంగా ప్రజా సేవాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరును పర్యవేక్షించామన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. భూ బారతి వంటి వాటిని గ్రామ సభల ద్వారా మీ సేవ కేంద్రాల్లో ద్వారా ఫిర్యాదు దారులు అప్లై చేసిన తర్వాత అధికారులు పర్యవేక్షించి కంప్యూటరీకరించాలని అన్నారు.  అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ ను పర్యాటకంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే  బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్,  కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి,కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి  కంది శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, కలాల శ్రీనివాస్, బొమ్మ కంటి రమేష్ ,రాంరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

అచ్చంపేట  క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిన రాజప్ప గ్రీవెన్స్ మీటింగ్

0

అచ్చంపేట  క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిన రాజప్ప గ్రీవెన్స్ మీటింగ్

చిత్రం న్యూస్, అచ్చంపేట: పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అధ్యక్షతన సామర్లకోట మండలం అచ్చంపేట  క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చినరాజప్ప గ్రీవెన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజా చినబాబు రాజు , నూనె రామారావు, మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జ్ లు ప్రజలు పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు  టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాజోలు నియోజకవర్గం బోళ్ళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర

0

పూరీ జగన్నాథ్ రథయాత్రకు తరలివచ్చిన అశేష జనవాహిని

రథాలపై గుండిచాదేవి ఆలయం వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి

చిత్రం న్యూస్, ఒడిశా:  ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. నందిఘోష్‌, తాళధ్వజ‌, దర్పదళన్‌ రథాలను ఫండాలు (పూజారులు) సుందరంగా అలంకరించారు. ఈరథాలపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు గుండిచాదేవి ఆలయం వరకు విహరిస్తారు. భక్తులు దారిపొడవునా జై జగన్నాథ్..అంటూ ఆ దేవ దేవుని నామస్మరణ చేశారు.  భక్త జనంతో ఆలయ ప్రాంతమంతా మార్మోగింది.

ఈ ఏడాది రథయాత్రను వీక్షించేందుకు 12 లక్షల మందికి పైగా భక్తులు వస్తున్నట్లు  అంచనా వేశారు. దేశంలోని నలుమూలల నుంచి ఇప్పటికే భారీగా జనం తరలి రావడంతో అధికారులు 10 వేల మంది పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల సాయంతో నిఘా ఉంచారు.

 

కూటమి నాయకులను విడదీయాలని చూడటం సరికాదు 

0

కూటమి నాయకులను విడదీయాలని చూడటం సరికాదు 

చిత్రం న్యూస్, పెద్దాపురం:  బయటి వ్యక్తులు కూటమి నాయకులను విడదీయాలని చూడటం సరికాదని  పెద్దాపురం బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రామకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, ఒకే కుటుంబంలో వారిలా కలిసిపోయి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలకు అతి దగ్గరగా కూటమి ప్రభుత్వం ఉంది అని సంతోషపడే సమయంలో కూటమి నాయకులను విమర్శిస్తూ బయట వ్యక్తులు విడదీయాలని చూడటం చాలా బాధాకరమని అన్నారు. ప్రజలకు చేసే మంచి పనులలో కూడా తప్పులను వెతుకుతూ పార్టీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్త పరిచారు.

నిత్యవసర సరుకులను డోర్ డెలివరీ చేయడానికి కిట్లు సిద్ధం

0

నిత్యవసర సరుకులను డోర్ డెలివరీ చేయడానికి కిట్లు సిద్ధం

చిత్రం న్యూస్ ,పెద్దాపురం: పెద్దాపురం


మిరపకాయల వీధిలో కాకిలేటి అమ్మజీ రేషన్ షాప్ నందు ప్రతినెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటలనుండి 12 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు .65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కోసం రాలేని వయోవృద్ధుల కోసం కిట్లను ఏర్పాటు చేసి డోర్ డెలివరీ చేయడానికి డీలర్ నిత్యవసర సరుకులను సిద్ధం చేశారాన్నారు.

సైనికుడు సుభేదర్ వినోద్ దడాలకు గ్రామస్తుల ఘన స్వాగతం

0

సైనికుడు సుభేదర్ వినోద్ దడాలకు  స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు, నాయకులు

చిత్రం న్యూస్, పెద్దాపురం: ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొని స్వస్థలం పెద్దాపురం వచ్చిన సైనికుడు సుభేదర్ వినోద్ దడాలకు టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం నిర్వహించిన సన్మాన సభలో ఆయన సేవలను కొనియాడారు. సైనికుడు వినోద్ ను ఆయన ఇంటి వరకు బ్యాండ్ మేళాలతో, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

డ్రగ్స్ వాడకాన్ని యువత వ్యతిరేకించాలి

0

డ్రగ్స్ వాడకాన్ని యువత వ్యతిరేకించాలి

చిత్రం న్యూస్, పెద్దపల్లి: డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకాన్ని యువత తీవ్రస్థాయిలో వ్యతిరేకించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన క్యాంపెన్లో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన …నేను డ్రగ్ వ్యతిరేకిని ఫోటో పాయింట్ వద్ద కలెక్టర్ ఫోటో తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.

సారూ..మా సమస్యలు పరిష్కరించండి

0

సారూ..మా సమస్యలు పరిష్కరించండి

*ఎంపీ, ఎమ్మెల్యేకు సాంగిడి గ్రామస్తుల  వినతి

చిత్రం న్యూస్, బేల: మండలంలోని సాంగిడి గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలంటూ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను గ్రామస్తులు  కలిసి విన్నవించారు.  ముఖ్యంగా గ్రామంలోని మోతీజీ మహారాజ్ ఆశ్రమంలో షెడ్డు నిర్మాణం చేపట్టాలని, జడ్పీహెచ్ఎస్ స్కూల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సాంగిడి గ్రామంలో నిరుపేదలైన కొన్ని కుటుంబాలకు ఇల్లు రాలేదని, వారందరికీ ఇండ్లు ఇవ్వాలని దృష్టికి తీసుకెళ్ళారు. బెదోడ నుండి సాంగిడికి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.  వీరిని కలిసిన వారిలో  బీజెపీ నాయకులు కదరపు ప్రవీణ్, మంచాల భూపతిరెడ్డి,నందు గౌడ్ బైర్ వార్, సిద్రాపు ,సుభాష్, ఎల్టి భూమారెడ్డి, మధుకర్ బేదోడ్కార్, నావగరే ప్రభాకర్, తీర్సామృత్కర్ సంజీవ్, గురుదేవ సేవ మండల్ వారు ఉన్నారు.

నకిలీ బాబా అరెస్టు

0

_సీఐ బండారి రాజు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: టెక్నాలజీ రోజు రోజుకు ఎంత పెరగిపోతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని కొందరు దొంగ బాబాలు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫేక్‌ బాబాల నిర్వాకం వెలుగులోకి వచ్చినవే. అయితే.. ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఓ ఫేక్‌ బాబా గుట్టు రట్టైంది. దీంతో.. ఆ నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం. ఇచ్చోడ మండలం కోకస్ మన్నూరు గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ అమాయక ప్రజల బలహీతని ఆసరా చేసుకొని వ్యాధులను నయం చేస్తానంటూ తాయత్తులు కట్టి బురిడీ కొట్టించేవాడని అన్నారు. దీంతో నిందితుడిని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. ప్రజలు ఇలాంటి దొంగ బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులతో మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.