Home Blog Page 88

పింఛన్ల సభను జయప్రదం చేయాలి

0

పింఛన్ల సభను జయప్రదం చేయాలి

చిత్రం న్యూస్, భైంసా:చేయూత పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ భైంసా సబ్ డివిజన్ కేం ద్రంలో ఈ నెల 22న నిర్వహించే వికలాంగుల చేయూత, పింఛన్దారుల సన్నాహక  సదస్సును జయప్రదం చేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ కోరారు. నిర్మల్ జిల్లా భైంసా సబ్ డివిజన్ పరిధిలో అన్న బహు సాఠె కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన సమామావేశంలో  గురువారం సందే కార్తీక్ మాదిగ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.2వేల నుంచి రూ.4వేలకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఈ సభకు హాజరువుతారని, వృద్ధులు, దివ్యాంగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు బాలే రావు నందకుమార్, మాదిగ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు గాయక్వాడ్ గంగాధర్, ఎస్సీ, ఎఎస్టీ,బీసి ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్తాపకులు నామత్కర్ దిగంబర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు షెల్కె ఆనంద్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తుకారం, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధికార ప్రతినిధి నిర్మల్ మహేష్, ఎమ్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అంబేకర్ సాయిచంద్, ఎమ్మార్పీఎస్ నాయకులు గజ్జరం, మారుతీ, దిగంబర్, గజేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సమరసతలో మహిళల పాత్ర

సామాజిక సమరసత లో మహిళల పాత్ర

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గురువారం “సామాజిక సమరసత లో మహిళల పాత్ర” అనే అంశంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఆవరణలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరైన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రుక్మిణి దేవి మహిళలు సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడంలో ముఖ్య పాత్ర గురించి మాట్లాడారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రమ్యా రావు M.D (NRI USA) హాజరై మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విలువైనవని వాటిని కాపాడవలసిన బాధ్యత మనందరిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకేంద్రం కళా బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.

ఈ కార్యక్రమంలో సామాజిక సేవా సమితి జిల్లా అధ్యక్షులు రావుత్ రవీందర్, ప్రధాన కార్యదర్శి సామ రమేశ్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు సరిత రాణి, ప్రధాన కార్యదర్రాశురాలు సత్య శివాలిని, సంయోజకులు మెస్రం రాజేశ్వర్, ట్రెజరర్ నాగరాజు,ఉపాధ్యక్షులు చాట్ల స్వామి, కార్యదర్శులు వేణు గోపాల్, కాసర్ల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు భోయర్ అశోక్,సలహాదారులు ఆచి శ్రీనివాస్, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సేవకుదు డాక్టర్ సాప పండరికి దక్కిన అరుదైన గౌరవం

0

సామాజిక సేవకుడు డాక్టర్ సాప పండరికి దక్కిన అరుదైన గౌరవం

*తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండరికి డా.బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు

చిత్రం న్యూస్, భైంసా : నిర్మల్ జిల్లా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 14న జరుపుకునే స్వాతంత్ర సంబరాలలో భాగంగా మత్తుకు యువత చిత్తు, బాల్యవివాహాలు అరికట్టడం, వరకట్న వేధింపులు, అన్యాయం అక్రమం జరుగుతున్న చోట ప్రశ్నించి, పేదలకు తగు విధమైన సహాయం అందించడం వంటి పలు సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డును అందజేస్తారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ అడ్వకేట్, ల్యాండ్ ఎక్స్పర్ట్, తెలంగాణ అగ్రికల్చరల్ మరియు ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు ఎం.సునీల్, అసిస్టెంట్ కమిషనర్ మత్తయ్య, హైకోర్టు ప్రముఖ న్యాయవాదులు కడారి రమేష్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ హిప్నో పద్మకమలాకర్, దళిత రత్న రాజు, ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్, ప్రతినిధులు తిరుమలరావు, నవీన్, దత్త గౌడ్ చేతులమీదుగా డాక్టర్ సాప పండరికి డా. బీఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు”అందించి శాలువాతో సన్మానించారు. అంతే కాక సాప పండరి తండ్రి సాప భూమన్నను శాలువాతో సన్మానించారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండరి సామాజిక సేవా కార్యక్రమాలు అమోఘమైనవని, అద్భుతమైనవని, అహర్నిశలు విద్యార్థుల కోసం, యువత కోసం, నిరుపేదల కోసం వారు చేసే సేవలు మాటలలో వర్ణించలేమని, వారికి మేము తోడుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ ఎవరైనా గాని మా ప్రతినిధులకు తప్పుగా మాట్లాడిన, తప్పుడు పనులు చేసిన వారికి చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.

పెన్ గంగ నదిలో గుర్తుతెలియని మహిళ మృతి దేహం లభ్యం

0

పెన్ గంగ నదిలో గుర్తుతెలియని మహిళ మృతి దేహం లభ్యం

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కౌట గ్రామంలోని  పెన్ గంగ నది ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతిదేహం లభ్యమైందని ఎస్ఐ గౌతం పవార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 45_50 సంవత్సరాల మధ్య ఉంటుందని,  మృతదేహం లభ్యమైన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని, వివరాలు తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి సూచికగా గ్రామ గ్రామాన తిరంగా ర్యాలీ

ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి సూచికగా గ్రామ గ్రామాన తిరంగా ర్యాలీ

*హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ప్రపంచ దేశాలకు మన భారత దేశం నాయకత్వం వహించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పయనిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి సూచికగా గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో తిరంగా ర్యాలీ జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, విద్యార్థులు పట్టణ ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే జాతీయ జెండాను చేత పట్టుకొని పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తి చాటేలా విద్యార్తులు దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు.

అనంతరం అంబేద్కర్ చౌక్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రపంచానికి భారతదేశ సైనిక శక్తి సామర్థ్యాన్ని చెప్పడం జరిగిందన్నారు. 15 నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని పలు స్తావరాలను నేలమట్టం చేసిన గొప్ప శక్తి గల సైన్యం మనది అన్నారు. పక్కనున్న ఉగ్ర దేశం పాకిస్తాన్ మాట్లాడిన మాటలకు, చేష్టలకు నిమిషాల వ్యవధిలోనే మన దేశం సమాధానం చెప్పడం జరిగిందన్నారు. బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

యూనివర్సిటీ సాధనపై విద్యార్థులతో చర్చా కార్యక్రమం 

యూనివర్సిటీ సాధనపై విద్యార్థులతో చర్చా కార్యక్రమం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:యూనివర్సిటీ సాధన సమితి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో యూనివర్సిటి ఏర్పాటుకోసం విద్యార్థులతో చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా NHRC జిల్లా  చైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ..ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడం వలన విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. పలువురు విద్యార్థులు చదువును మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి సైతం ఏర్పడుతోందన్నారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే నాణ్యమైన విద్య అందించబడటమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కోకన్వీనర్ తొగరి భాస్కర్ , కళాశాల ప్రిన్సిపల్ హనుమాండ్లు, దీపక్ ,అరవింద్, విద్యార్థిని, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు  కష్టపడి చదివి  ఉన్నతంగా ఎదగాలి

0

విద్యార్థులు  కష్టపడి చదివి  ఉన్నతంగా ఎదగాలి

*మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో, పలు గ్రామాలతో పాటు విద్యార్థులు చదువుతోపాటు మంచి క్రమశిక్షణతో మెలగాలని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ విద్యార్థులకు సూచించారు. ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ బేల మాజీ జెట్పిటిసి అక్షిత సతీష్ పవార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమo చెయ్యడం చాలా సంతోషకరం.సతీష్ పవార్ బేల మండలంలోని అనేక పాఠశాల విద్యార్థులకు సేవలు అందించడం చాలా అభినందనీయం అన్నారు,గురువారం మండలంలోని సోన్ కాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులకు మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి విద్యార్థులకు టై, బెల్టు, ఐ కార్డ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంభీర్ ఠాక్రే ,గ్రామ మాజీ సర్పంచ్ మెస్రం జనార్ధన్,ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, మాజీ సర్పంచ్లు మస్కే తేజ్రావు, విపిన్ ఖోడే, మాజీ ఎంపీటీసీ మంగేశ్ ఠాక్రే,మార్కెట్ మాజీ చైర్మన్ జి సునీల్, ఆకాశ్ గుండార్,గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.*

పశువులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా  అరెస్టు

0

పశువులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా  అరెస్టు

*నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు

*వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా ముధోల్ లో పశువుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు చేధించారు. నిర్మల్ లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ జిల్లాల్లో మత్తు మందు ఇచ్చి గోవులను అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం ముధోల్ లో పశువు కళేబరాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుల కోసం గాలించినట్లు తెలిపారు. నాందేడ్ కు చెందిన సయ్యద్ సోహెల్ అనే వ్యక్తి దాదాపు 40 మంది తో ముఠాగా ఏర్పడి వాహనాలలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ముధోల్ లో గోవులను చోరీ చేసేందుకు రాగా సీసీ కెమెరాల ఆధారంగా ఒకరిని పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్ లోని అజ్మీర దర్గా వద్ద ఏడుగురు, బైంసాలో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వారిలో సయ్యద్ సోహెల్, షేక్ జమీర్, షేక్ ముర్తుజా, మహమ్మద్ నజీర్, సయ్యద్ అక్రమ్, సయ్యద్ షోయబ్, సయ్యద్ ఫైజాన్, షేక్ ఉమర్, ఖలీద్ లు ఉన్నారన్నారు. వీరి వద్ద నుండి రెండు కార్లు, 8 సెల్ ఫోన్లు, 39,280 రూపాయల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు.

శిథిలావస్థలో హాంపోలి ప్రాథమిక పాఠశాల

0

*పెచ్చులూడుతున్న స్లాబ్‌

*ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హాంపోలి గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు భయంభయంగా విద్యనభ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ప్రభుత్వ పాఠశాల ప్రమాదపుటంచున ఉంది. ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  పాఠశాలకు చెందిన రెండు గదులు, శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పస్తుతం విద్యార్థులు ఉంటున్న గది కూడా స్లాబు పెచ్చులు ఊడుతున్నాయి. దాంతో భయం భయంతో విద్యాబోధన చేయాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పాలకుల మాటలు ఆచరణలో కన్పించడంలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో 22 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతికి ఒకే ఒక గది, ఇద్దరు ఉపాధ్యాయులతో విద్యాబోధన సాగుతుంది. పాఠశాల గోడలు కూడా సగం కూలిపోయి దర్శనమిస్తున్నాయి. నూతన గదులు మంజూరు చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించి నూతన గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

0

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా సబ్ డివిజన్ లోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ తో  కలిసి గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను ప్రజలు నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలను తిరిగి కలుసుకునే విధంగా చేశారు.ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు అప్పుగించి సకాలంలో పరిష్కారించాలని ఆదేశించారు.