Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 85

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 

0

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న కంది శ్రీనివాస రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్  లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రజాసేవ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందించిన వారికి ప్రత్యేక చొరవతో చెక్కులు అందేలా చూస్తామని,  ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.  ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

 

డా.కళ్లెం వెంకట్ రెడ్డికి మెడికల్ ఎక్సలెన్స్ 2005 అవార్డు

0

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా  అవార్డు అందుకుంటున్న డా.కళ్లెం వెంకట్ రెడ్డి

డా.కళ్లెం వెంకట్ రెడ్డికి మెడికల్ ఎక్సలెన్స్ 2005 అవార్డు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డా. కళ్లెం వెంకట్ రెడ్డి జిల్లాలో అందిస్తున్న సేవలకు గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  మెడికల్ ఎక్సలెన్స్ 2005 అవార్డు వరించింది.  రాజ్ భవన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టే ప్రముఖులకు ఈ అవార్డులను ప్రతి ఏటా అందజేస్తారని ఆయన తెలిపారు. అవార్డు అందుకున్న డా.కళ్లెం వెంకట్ రెడ్డిని పలువురు అభినందించారు .

ఘనంగా లోక ప్రవీణ్ రెడ్డి జన్మదిన వేడుకలు

0

రెడ్డి హాస్టల్ లో  కేకు కట్ చేస్తున్న లోక ప్రవీణ్ రెడ్డి

ఘనంగా లోక ప్రవీణ్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి  పుట్టినరోజు వేడుకలను రెడ్డి హాస్టల్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, రెడ్డి సంఘం నేతల నడుమ ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు రెడ్డి బంధువులు జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి, రెడ్డి హాస్టల్ నిర్వహణ కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లూరి భూపతిరెడ్డి, ఉపాధ్యక్షులు సామ స్వామి రెడ్డి,ఆర్థిక కార్యదర్శి విఠల్ రెడ్డి, జలెందర్ రెడ్డి, సతీష్ రెడ్డి,శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు .

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

0

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

చిత్రం న్యూస్, ఇచ్చోడ: వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్ అన్నారు. ఇచ్చోడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రి రికార్డులను , పరిసరాలను, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.

ట్రిపుల్ ఐటీ బాసరకు సామ రేవంత్ రెడ్డి ఎంపిక

0

ట్రిపుల్ ఐటీ బాసరకు సామ రేవంత్ రెడ్డి ఎంపిక

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన సామ రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీ బాసరకు ఎంపికయ్యారు.  తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులో శ్రమించిన రేవంత్, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ ప్రతిరోజూ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకున్నాడు. ఈ అవకాశం వృథా చేయకుండా దేశానికి ఉపయోగపడే ఇంజినీరు కావడమే తన  ఆశయమని రేవంత్ తెలిపాడు. గ్రామస్తులు, బంధువులు, స్కూల్ ఉపాధ్యాయులు రేవంత్‌కు అభినందనలు తెలిపారు.

బోథ్ పేరును నిలబెట్టాలి

0

లాసెట్ లో రాష్ట్రస్తాయి మొదటి ర్యాంక్ సాధించిన రుతికను సన్మానిస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

చిత్రం న్యూస్, బోథ్: ఇటీవల వెలువడిన లాసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన ఎల్కుచి రుతికను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అభినందించారు. శాలువాతో సన్మానించారు.  ఉన్నత చదువులు చదివిస్తూ రితికను సహకరిస్తున్న ఆమె తండ్రి రాజశేఖర్ ను  సైతం సన్మానించారు. ముందు ముందు కూడా చదువులో ఇలాగే రాణిస్తూ బోథ్ నియోజకవర్గానికి  మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏ సమస్య ఉన్న అనిల్ అన్న ఉంటాడని మరచిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ డా. ప్రసాద్ సంధ్యారాణి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

0

విద్యార్థులకు, బ్యాగులను పంపిణీ చేస్తున్న దృశ్యం

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని కామగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన నిమ్మల సుధాకర్ రెడ్డి, నక్కల సంతోష్ రెడ్డి విద్యార్థులకు విరాళంగా అందజేసిన బ్యాగ్స్, పెన్నులను డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించడంతో పాటు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బిక్కుసింగ్, ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, గ్రామస్తులు మహేందర్ రెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీపీస్ శాలపల్లికి ప్యూరిఫైడ్ విరాళం 

0

ఎంపీపీస్ శాలపల్లికి ప్యూరిఫైడ్ విరాళం 

*మ్యాదర శ్రీనివాస్ ఉదారత

చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని ఎంపీపీస్ శాలపల్లికి దాదాపు రూ.15 వేలు విలువ కలిగిన వాటర్ ప్యూరిఫైడ్ ను మ్యాదర శ్రీనివాస్  విరాళం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. పాఠశాల నుండి నేను చాలా నేర్చుకున్నాను. కొంత రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రులతో వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ ను రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు.  ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.శారద  మాట్లాడుతూ..ఇక నుంచి విద్యార్థులు నీళ్ల బాటిల్స్ మోయాల్సిన అవసరం లేదని, వారికి శుద్ధమైన నీరు ఇప్పుడు పాఠశాలలోనే అందజేస్తామని పిల్లలకు కాస్త బరువు భారం తగ్గించినందుకు మ్యాదర.శ్రీనివాస్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు చిన్నక్క మల్లారెడ్డి, జడల అశోక్, తాజా మాజీ ఉపసర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి ,హైమావతి, కృష్ణ, పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్,  తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయుడు ఎం. సతీష్ , పద్మశాలి సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు వేముల రమేష్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు

0

గ్రామ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు

చిత్రం న్యూస్, సైదాపూర్: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభ శుక్రవారం జరిగింది. ఈ సభకు సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. గ్రామస్థాయి నాయకులతో ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా సభ ద్వారా సంభాషించడం ఇదే తొలిసారని ఏఎంసీ ఛైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంత సుధాకర్ తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని గ్రామ, మండల, యువజన, బ్లాక్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులకు మల్లికార్జున ఖర్గే దిశా నిర్దేశం చేసినట్లు సుధాకర్ పేర్కొన్నారు._

గిరిజన యువతులకు ఉచిత కుట్టు శిక్షణ 

0

గిరిజన యువతులకు ఉచిత కుట్టు శిక్షణ 

చిత్రం న్యూస్,తలమడుగు:  తలమడుగు మండలం పల్సీ(కే) గ్రామంలో 30 మంది గిరిజన మహిళలు యువతులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మంద అశోక్ తెలిపారు. శుక్రవారం ఆ గ్రామంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించాడు. ఆరు నెలల శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం కుట్టుమిషన్ సైతం అందించేలా కృషి చేస్తామన్నారు. రెండు మిషన్లతో పాటు రూ. 2 వేల విలువైన కుట్టు సామాగ్రి అందజేసి శిక్షణ ఇచ్చేందుకు ఇద్దరు శిక్షకులను నియమించామన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి భగవాన్ దాస్, ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్ గౌడ్, ప్రకాష్ బండారు దేవన్న దయాకర్ రెడ్డి కరీం అలీ నూరాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సున్నరేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ నైతం పాయల్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.