Home Blog Page 84

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

చిత్రం న్యూస్, ఇచ్చోడ: వర్షాకాలంలో విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని CHO డాక్టర్ బ్రహ్మానంద్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని TTWURJC AHS బాలికల హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు వివిధ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్లోని వంటశాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. వర్షాల కారణంగా దోమలు వృద్ధి చెంది, డెంగ్యూ, మలేరియా, అతిసారం, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాస్, పి హెచ్ ఎన్ రాజుభాయి, ఏఎన్ఎంలు సుధారాణి, పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

భారీ వర్షాలు…నిర్మల్ జిల్లా విద్యా సంస్థ లకు ఒక రోజు సెలవు

0

భారీ వర్షాలు…నిర్మల్ జిల్లా విద్యా సంస్థ లకు ఒక రోజు సెలవు

చిత్రం న్యూస్, భైంసా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధువారం రాష్ట్రంలో రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.అతిభారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అవసరమైతే కలెక్టర్లు నిర్ణయం తీసుకొని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలపగా.. వాతారవరణ శాఖ సూచన మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్కూళ్లకు హాలిడేస్ ఇస్తున్నామన్నారు . విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులు జలమయం కావడం, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోవడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రయాణించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు.నాడు (ఆగస్టు 20) జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఒకరోజు సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132లో సంప్రదించవచ్చని తెలిపారు.

నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్

0

 

నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్

*రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని అసెంబ్లీ ప్రస్తావిస్తానని భరోసా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. మంగళవారం భీంపూర్ మండలంలో బైకుపై సుడిగాలి పర్యటన చేపట్టారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన కరంజి, గోముత్రి, అంతర్గావ్, అర్లి, వడూర్, గుబిడి, ధనోర, భీంపూర్, కరణ్ వాడి, పెన్ గంగా ప్రభావిత గ్రామల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ధైర్యం కల్పించారు. నష్టపోయిన ప్రతీ రైతుకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి వచ్చేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నష్టపోయిన రైతులకు రూ. 25వేలు పరిహారం అందించాలని వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రస్థావిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట మండల కన్వీనర్ నాగయ్య,నాయకులు లస్మన్న, నరేందర్, సంతోష్, కల్చప్, ప్రముఖ న్యాయవాది కేమ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ముథోల్ కు 45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు

0

ముథోల్ కు 45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో రూ.45.15 కోట్ల నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ తెలిపారు. గతంలో ఇక్కడ ఐటీఐ కళాశాల ( టెక్నాలజీ సెంటర్) మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రిని కోరడంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించడంతో  ముథోల్ లో ఏటీసీ సెంటర్  ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కరంగా ఉంటుందన్నారు. కార్మికులకు ఉపాధి కల్పన ఆధ్వర్యంలో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో  కేంద్రం సాగుతుందన్నారు. విద్యార్థులకు, ని రుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల అవకాశం కల్పిస్తామన్నారు. ఏటీసీ ఏర్పాటు కల శుభసూచకమన్నారు. ఈ నిధులతో భవనం, యంత్రాలు, కంప్యూటర్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా  ప్రభుత్వానికి, టాటా కంపెనీకి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

అంబులెన్స్ లో ప్రసవం..తల్లీ బిడ్డలు క్షేమం

అంబులెన్స్ లో ప్రసవం..తల్లీ బిడ్డలు క్షేమ

చిత్రం న్యూస్, ఇచ్చోడ:

అంబులెన్స్ లో ఓ మహిళ ప్రసవించిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముక్రా (బి) గ్రామానికి చెందిన ప్రతిక్ష అనే మహిళకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ 108కు చరవాణిలో సమాచారం ఇచ్చారు. దీంతో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రతిక్ష ప్రసవించి ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చిందని, తల్లీ ఇద్దరు కవల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని అంబులెన్స్ పైలట్ వినోద్, ఈఎంటీ రాకేష్ తెలిపారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం 

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం 

చిత్రం న్యూస్ బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని అంజన స్టూడియో ఆవరణలో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం  నిర్వహించారు. ప్రముఖ ప్రపంచ ఛాయాచిత్ర పితామహుడు జుకులాస్ లూయిస్ డాగురే మండే 171 వ వర్ధంతి సందర్భంగా బోథ్, సొనాల మండలాల అధ్యక్షులు బుస లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఫొటో వీడియో గ్రాఫర్స్ పాల్గొని లూయిస్ డాగురే కు ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం ఫొటోగ్రాఫర్స్ కేక్ కట్ చేశారు. ఫొటోగ్రపీ అధ్యక్షులు బుస లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఫొటోగ్రఫీ అంటే సృష్టికి ప్రతిసృష్టిగ అద్దం పట్టేది ఒక్క ఫొటోకు మాత్రమేనన్నారు. ప్రతి సన్నివేశం ప్రతి మధుర క్షణాలను పపదే గుర్తు చేసి అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేసేది ఫొటో మాత్రమేనన్నారు. మండల సభ్యులు రంజిత్, ముక్కల రాజేశ్వర్,  కాడేరుగుల గణేష్, నరేష్ కుమార్, రవీందర్, లక్ష్మణ్, దేవేందర్, కుశాల్ రెడ్డి,నితీష్ గౌడ్, కాడేరుగుల రాజశేఖర్, సురేష్, ప్రకాష్, జీకే కిరణ్. తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అన్నా బాహు సాఠే జయంతి

0

ఘనంగా అన్నా బాహు సాఠే జయంతి

చిత్రం న్యూస్, భైంసా: లోక్‌ షాహిర్, సాహిత్య సామ్రాట్‌ అన్నా బాహు సాఠే 105 జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా  భైంసా మండలంలోని వాలేగాం లో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్నా బాహు సాఠే సాహిత్య సామ్రాట్, అన్నా బాహు సాఠే మాదిగ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్, అన్నా బాహు సాఠే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. అణగారిన వర్గాలను చైతన్యవంతం చేసిన అన్నా బాహు సాఠే కృషిని అందరూ స్మరించుకున్నారు. కుల వివక్ష నిర్మూలన కోసం నిరంతరం పోరాడిన మహా యోధుడని కొనియాడారు. నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య సామ్రాట్ మాదిగ సంఘం సభ్యులు కత్తి.బాబు,ఎ.సాయినాథ్,బీ.భోజన్న, పొచ్చిరాం, ఆనంద్, అడేల్లు, దినేష్, మారుతి, గంగాధర్, లక్ష్మన్, కె.సాయినాథ్, తరుణ్, శ్రీకిష్ణ, కె.బాబు, నరేష్, వీడిసి సభ్యులు,బీ.బాబు, కె.ఆనంద్,మానాజీ మల్లేష్, శ్యాంరావు , పోతన్న, రాములు, గంగాధర్, రాజు, శంకర్, భారత బాయి, లక్ష్మి, ఈశ్వర్ బాయి, సరస్వత, ఆనందబాయి, జనాభాయి, ఆడేల బాయి, రాజు బాయి, సాగర్ బాయి, అంబు భాయి మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు కన్నీటి కష్టం 

అన్నదాతకు కన్నీటి కష్టం 

*భారీ వర్షాలతో నీట మునిగిన పంటలు 

*నదులు, వాగుల సరిహద్దు ప్రాంతాల్లో భారీగా నష్టం 

*పలు చోట్ల కోతకు గురైన రోడ్లు, కల్వర్టులు 

*నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు 

*వరద ప్రాంతాలను పరిశీలించిన  ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు, వాగులు పొంగి పోర్లడంతో సమీప పంట పొలాలను వరద ముంచేత్తింది. దీంతో ఏపుగా పెరుగుతున్న పత్తి, సోయా, కంది తదితర పంటలు నీట మునిగాయి. మిగతా చోట్ల రోజుల తరబడి పంటలు నీళ్లలోనే ఉండటంతో తెగుళ్ల భారిన పడి ఎదుగలేని పరస్థితికి చేరుకోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోపక్క అనేక చోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు

అన్నదాతకు తీరని వేదన

ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల పంటలకు మేలు జరగగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం తీవ్ర నష్టం చేకూర్చింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నది ఉగ్రరూపం దాల్చడంతో సమీపంలోని జైనథ్, బేల, భీంపూర్, బోరజ్ మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వీటితో పాటు వివిధ మండలాల్లో వాగులు, వంకలు ఉదృతం గా ప్రవహించి పంట చేలలోకి వెళ్లడంతో పాటలు నీట మునిగాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే సుమారు 11వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మిగతా మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే మాదిరి పంటలు నష్టపోయినట్లు తెలిసింది. పూర్తి స్థాయి సర్వే చేస్తే ఎంత మేర పంటలు నష్టపోయాయో తెలిసేందుకు అవకాశం ఉంటుంది.

రోడ్లు, కల్వర్టులకు నష్టం

భారీ వర్షాలకు పంటలతో పాటు పలు చోట్ల రోడ్లు, కల్వర్టులు వరద దాటికి తెగిపోవడంతో రూ.కోట్ల లో నష్టం జరిగింది. కొన్ని చోట్ల లో లెవల్ వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితి లో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఆదిలాబాద్ పట్టణంలో శివారులో కాలనీల్లోని తట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీళ్లు చేరడంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు స్వాంతన కలిగిస్తున్నారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సమాచారం అందించాలని చెబుతున్నారు. అటు పోలీసు యంత్రాంగం సైతం అప్రమత్తం గా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టెందుకు డీడీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. తాజాగా మంగళవారం ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

నేడు విద్యా సంస్థలకు సెలవు

నేడు విద్యా సంస్థలకు సెలవు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

భైంసాలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

0

భైంసాలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

*పాల్గొన్న బీసీ సంఘం, జనసేన పార్టీ నాయకులు

చిత్రం న్యూస్,భైంసా:  బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసి సంఘం జిల్లా నాయకులు సుంకేట పోశెట్టి, జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనం ఆవరణలో సర్దార్ పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను స్థానిక బీసీ సంఘం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనిల్, రజక సంఘం నాయకులు శ్రీను, ముత్యం, సాయినాథ్, భూమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.