Home Blog Page 59

కిర్గుల్ (కె) పాఠశాలలో ముందస్తు  బతుకమ్మ వేడుకలు

0

కిర్గుల్ (కె) పాఠశాలలో ముందస్తు  బతుకమ్మ వేడుకలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కిర్గుల్ (కె) ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు ముందస్తుగా బతుకమ్మ వేడుకలు శనివారం నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన విద్యార్థులు పూజలు చేసి చుట్టూ చేరి వర్షాన్ని సైతం లెక్క చేయక బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవళిక  మాట్లాడుతూ.. గౌరమ్మకు ప్రతిరూపమైన బతుకమ్మ పువ్వులలోని పరిమళాన్ని,  వివిధ రంగులను మన జీవితంలో కూడా తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవళిక, ఉపాధ్యాయురాలు భవాని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

0

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

* పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిడిగొండ మండలం బుగ్గరం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో  ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను ప్రిన్సిపల్ సన్మానించారు. అనంతరం విద్యార్థినిలు చేసిన నృత్యాలు వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పాఠశాలను మరింత అభివృద్ధి చేసుకుందామని విద్యార్థులకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అనిల్ అన్న 24 గంటలు అందుబాటులో ఉంటాడని ఏ సమస్య వచ్చినా అన్న దగ్గరికి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రాథోడ్ సురేందర్, నేరడిగొండ మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, కృష్ణ, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలి

0

విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలి

చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ అన్నారు. బేల మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ లో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారితో కలిసి సందర్శించారు. పాఠశాల  చుట్టూ ఉన్న అపరిశుభ్రతను వెంటనే బాగుచేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పాఠశాలలో వంట గది, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు,  విద్యార్థుల ఆరోగ్యం గురించి ప్రత్యేక అధికారి గెడం నవీనను అడిగి తెలుసుకున్నారు. మండల ప్రత్యేక అధికారి మనోహర్ విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఆడారు.  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అజయ్ మహాకాళ్ జన్మదిన వేడుకలు

0

అజయ్ మహాకాళ్ కు కేకు తినిపిస్తున్న  LPR సైన్యం అధ్యక్షుడు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  అజయ్ మహాకాళ్ సేన అధ్యక్షుడు అజయ్ మహాకాళ్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి, LPR సైన్యం నడుమ ఆయన కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా మహాకాళ్ సేన, LPR సైన్యం, అభిమానులు  ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో   శ్రీరాం, శ్రీకాంత్ రెడ్డి, సృజన్, గోరక్ నాథ్, సురేందర్, కొంపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సును  వెనుక నుంచి ఢీకొట్టిన బోలేరో వాహనం

0

ఆర్టీసీ బస్సును  వెనుక నుంచి ఢీకొట్టిన బోలేరో వాహనం

చిత్రం న్యూస్,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల శివారులో  నిర్మల్ వెళ్ళే బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును  వెనుక నుంచి బోలేరో వాహనం ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూరు నుండి బోథ్ ఎక్స్ రోడ్ పోచ్చెర క్రాస్ రోడ్ నుండి కిన్వట్ వెళ్ళే టీజీ01జడ్ 0011 బస్ ను వెనుక నుండి బోలేరో వాహనం ఢీ కొట్టింది. దీంతో  బోలేరో వాహనంలో  ఉన్న 10 పశువుల్లో ఒక పశువు మృతి చెందింది. మూడు పశువులకు  తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పశువులకు చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పోలీసులు నంబర్ ప్లేట్ ప్రకారం మహారాష్ట్ర కు చెందిన వాహనంగా గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న కండక్టర్ కు  గాయాలు కాగా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం వేరే బస్ ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాద ఘటన స్థలం నుండి బోలేరో పికప్ వాహన డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిది

0

సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిది

*ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : ప్రస్తుత సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం విశ్వకర్మ మరాఠీ సంఘం ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మఠంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విశ్వకర్మ విగ్రహానికి పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. కులస్తులంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.. జిల్లా కేంద్రంలో ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. గోపాలకృష్ణ పీఠాధిపతి యోగానంద సరస్వతి మాట్లాడుతూ.. ప్రతిరోజు విశ్వకర్మను పూజిస్తే మోక్షం లభిస్తుంది అన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, భాజపా నాయకురాలు సుహాసిని రెడ్డి, బీసీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాన్వె సంతోష్, ఎం.దిలీప్, వివిధ మండలాల కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

భారీ శోభయాత్ర 

విశ్వకర్మ విగ్రహంతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక గోపాలకృష్ణ మఠం నుoచి ప్రారంభమైన శోభాయాత్ర వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఠాకూర్ హోటల్ మీదుగా చందా వాగు వరకు కొనసాగింది..దారి పొడుగునా డీజే సౌండ్ మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు.

జైనథ్ ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో  స్వచ్ఛ భారత్

0

జైనథ్ ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో  స్వచ్ఛ భారత్

చిత్రం న్యూస్, జైనథ్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని బీజేపి పార్టీ నాయకులు గురువారం సేవ పక్వాడ కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్కం రాందాస్, నాయకులు గొడుగుల సత్యనారాయణ, అశోక్, వెంకట్ రెడ్డి, దంతెల రవీందర్, రామన్న, ఉషన్న, సూర్య రెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

సేవ పక్వాడలో భాగంగా స్వచ్ఛ భారత్

0

సేవ పక్వాడలో భాగంగా స్వచ్ఛ భారత్

చిత్రం న్యూస్ ,జైనథ్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని బీజేపి పార్టీ నాయకుల గురువారం సేవ పక్వాడ కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కాట్కం రాందాస్, గొడుగుల సత్యనారాయణ, అశోక్, వెంకట్ రెడ్డి,దంతెల రవీందర్, రామన్న, ఉషన్న, సూర్య రెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

స్నేహితుల ఉదారత

0

స్నేహితుల ఉదారత

*మిత్రుడి కుటుంబానికి రూ.60 వేలు, నిత్యవసర సరకులు అందజేత

చిత్రం న్యూస్, ఇచ్చోడ : చిన్నప్పటినుంచి అందరూ కలిసి చదువుకున్నారు. పదో తరగతి తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డారు.  కానీ మిత్రులంతా మంచి, చెడులను చర్చించుకునేందుకు ఒక వేదికను ఏర్పరచుకున్నారు. తమతో కలిసి చదువుకున్న విద్యార్తి విధి వక్రీకరించడంతో   మృతిచెందారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి చేయూతనిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఆడేగామ(కే) గ్రామానికి చెందిన బైరీ విలాస్ (40) అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పదవ తరగతి జడ్పీ ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ్  మిత్రబృందం ఇచ్చోడలో కలుసుకున్నారు. మిత్రులందరూ తలా కొంత డబ్బులు జమ చేశారు. ఒక క్వింటాన్నర  బియ్యం, నిత్యవసర సరుకులతో పాటు, ఆర్థిక సహాయంగా రూ. 60 వేలు నగదును మృతుడు విలాస్ సతీమణికి అందజేశారు. మేమున్నామంటూ బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. విలాస్ పవిత్ర ఆత్మ శాంతి కలగాలని కోరుతూ చిత్ర పటానికి నివాళులర్పించారు. గతంలో అకాలంగా మృతి చెందిన భోజన్న, నాగరాజు కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచామని స్నేహితులు తెలిపారు.

ఆధార్ సెంటర్ ప్రారంభించాలి

0

ఆధార్ సెంటర్ ప్రారంభించాలి
చిత్రం న్యూస్, నేరడిగొండ:
నేరడిగొండ మండలంలో గత కొన్ని నెలలుగా మూతపడి ఉన్న ఆధార్ సెంటర్ ను పునః ప్రారంభించాలని నేరడిగొండ మండల యువకులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎండీ కలీంకు బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధార్ కార్డులో ఉన్న తప్పులు సరిచేసుకోవాలన్న, కార్డు అప్డేట్ చేసుకోవాలన్న, కొత్తగా పెళ్లైన వారి ఆధార్ కార్డు బదిలీ చేసుకోవాలన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళాలి. గత కొన్ని నెలలుగా ఆధార్ సెంటర్ మూతపడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు నమోదు చేసుకోవాలన్నా ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనీ, ఇచ్చోడ ఆధార్ సెంటర్ ఇటీవల తిరిగి ప్రారంభమైనా నేరడిగొండ ఆధార్ సెంటర్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో  తహసీల్దార్ ను కలిసి విన్నవించామన్నారు. మండల జనాభా ప్రాతిపదికన ప్రజల సౌలభ్యం కోసం మరో ఆధార్ సెంటర్, మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సాబ్లే సంతోష్, సింగ్, రాథోడ్ రాజశేఖర్, ఏలేటి మనోజ్ రెడ్డి, బొంతుకుల శ్రీను, కుంచపు గోవింద్, బాక్రే ప్రశాంత్, సురేష్, తగిరే చందర్ సింగ్ తదితరులు ఉన్నారు.