Home Blog Page 57

కీర్గుల్ (కే) లో తొలిసారిగా దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపన  

0

కీర్గుల్ (కే) లో తొలిసారిగా దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపన  

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా బాసర మండలంలో కీర్గుల్ (కే) గ్రామంలో తొలిసారిగా వీడిసి ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. అమ్మవారికి అంగరంగ వైభవంగా సోమవారం రోజు శ్రీ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి దర్శనమిచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, కట్టె పొంగలి సమర్పించారు. అనంతరం తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. భక్తులు దుర్గా మాతమాల ధారణ గావించారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కుమారిలో కొలువు తీరిన దుర్గమ్మ

0

కుమారిలో కొలువు తీరిన దుర్గమ్మ

*విగ్రహ దాత వోర్స రాజు యాదవ్_ప్రవళిక దంపతులకు గ్రామస్తుల సన్మానం

చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో ఆడపడుచులు, పెద్దలు, చిన్న తేడా లేకుండా భాజా భజంత్రీలతో డప్పుల చప్పుళ్లతో మంగళహారతులతో దుర్గామాతకు స్వాగతం పలికారు. ఊరిలోని ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఊరేగింపులో పాల్గొని నియమనిష్టలతో దుర్గాదేవిని ప్రతిష్టాపన చేశారు. విగ్రహ దాత వొర్స రాజు యాదవ్, ప్రవళిక దంపతులను గ్రామస్తులు శాలువాతో సన్మానం చేశారు.  గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు  

0

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, విద్యార్థిని, విద్యార్థులకు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ మహిళా ఉద్యోగులందరి సమక్షంలో RGUKT, బాసర కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సోమవారం ఘనంగా  నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో ఉపకులపతి ఆచార్య ఎ.గోవర్థన్, కల్చరల్ కమిటీ కన్వీనర్ డా.కె.రాములు, అసోషియేట్ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్, అసోషియేట్ డీన్ ఆఫ్ సైన్స్ & హుమానిటీస్, ఆల్ HoD లు, కల్చరల్ కమిటీ డ్యాన్స్ క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ సిరసాని పవన్ కుమార్, కల్చరల్ కమిటీ సభ్యులు, టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొన్నారు.  ఉపకులపతి ఆచార్య ఎ.గోవర్థన్ మాట్లాడుతూ.. బతుకమ్మను మనం ఏవిధంగా అందంగా పేర్చుతామో విద్యార్థులు తమ జీవితాలను కూడా అంత అందంగా నిర్మించుకోవాలని చెబుతూ.. తెలంగాణ సంప్రదాయాలలో శిఖరప్రాయమైనది బతుకమ్మ పండుగ అని సందేశమిచ్చారు. బతుకమ్మ తయారు చేసిన అధ్యాపకులకు, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కల్చరల్ డ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల బతుకమ్మ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

మా గోస ఎవరూ పట్టించుకోరా?

0

మా గోస ఎవరూ పట్టించుకోరా?

*15 రోజుల నుంచి బాసరకు రాకపోకలు బంద్  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాలు ఓని, కీర్గుల్ (కె), కౌఠ, సాలాపూర్ గ్రామస్థుల గోస అంతా ఇంతా కాదు. ఈ గ్రామాల ప్రజలకు బాసరకు రాకపోకలు పదిహేను రోజుల నుండి నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఓని నుంచి బాసర వెళ్లే రహదారి మధ్యలో వంతెన ఉండటంతో వంతెన పైనుండి వరద ఉధృతంగా ప్రవహించడంతో పదిహేను రోజుల నుండి ఆయా గ్రామ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం,  ఎస్బీఐ బ్యాంకు, రైల్వే స్టేషన్, ఆర్జేయూకేటీ, రెవెన్యూ ఆఫీస్, పోలీస్ స్టేషన్ కు రావాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి లో లెవల్ వంతెన ఉందని అధికారులకు చెప్పిన ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు

విజ్ఞాన్ స్కూల్ లో  ఘనంగా విద్యార్థుల  సాంస్కృతిక కార్యక్రమాలు

0

విజ్ఞాన్ స్కూల్ లో  ఘనంగా విద్యార్థుల  సాంస్కృతిక కార్యక్రమాలు

*ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ స్కూల్ ఫర్ డిస్సబ్లెడ్ చైల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో  దేవీ నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి  హాజరయ్యారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఆదిలాబాద్ అర్బన్ ఛైర్మన్ గోపిడి సవీన్ రెడ్డి, ప్రిన్సిపల్ స్వప్న, హేమంత్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

రైతుల విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది

0

రైతుల విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది

*కడెంలో యూరియా కోసం రైతుల ఆందోళన

*సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేశారు. రైతుల చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ  ఇంఛార్జి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొని మద్దతు తెలిపారు. రైతులతో కలిసి పీఏసీఎస్ కేంద్రానికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే అధికారులు పట్టించుకోకుండా వ్యవహరించటం సరైంది కాదని ఆగ్రహం చేశారు.రేపటిలోగా రైతులకు యూరియా పంపిణీ చేపట్టకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. యూరియా కొరత కారణంగా రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతమని ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింద న్నారు. ఎన్నికల్లో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం విచారకరం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై అక్కసు ఉందని, నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు ,మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

యువతలో క్రమశిక్షణ పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ధ్యేయం

0

యువతలో క్రమశిక్షణ పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ధ్యేయం

*తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడపాలే ప్రభాకర్

చిత్రం న్యూస్, ముథోల్: యువతలో దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ద్యేయమని భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడపాలే ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన ముథోల్ లోని నాగార్జున నగర్ బుద్ధ విహార్ ఆవరణలో సమతా సైనిక్ దళ్ నిర్మల్ జిల్లా మొదటి వార్షికోత్సవ వేడుకలు, భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్ర  ఇంఛార్జి  కస్తూరె సంజయ్ బోధి వర్ధంతిని ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం యువత చెడు అలవాట్లకు బానిసై ఉన్నతమైన లక్ష్యాలకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి ప్రత్యేకంగా శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో యువత పయనించే విధంగా చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. బహుజనులపై జరిగే అన్యాయాలపై స్పందించి వారి హక్కుల సాధనలో భాగస్వాములు అవుతామన్నారు. యువతలో ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. సమతా సైనిక్ దళ్ లో చేరడానికి యువత ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాగ్మారే నారాయణ, సంస్కార్ విభాగము తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్బారావు వాగ్మారె, రాష్ట్ర కమిటీ సభ్యులు సవితా బాయ్ టోక్రే, సంజయ్ క్షిర్సాగర్, జిల్లా కోశాధికారి రామచందర్ జంగ్మే, జిల్లా పర్యటక విభాగం ప్రధాన కార్యదర్శి పండిత్ వాగ్మారే, జిల్లా సమతా సైనిక్ దళ్ ఉపాధ్యక్షులు అశోక్ బన్సోడె, జిల్లా కార్యవర్గ సభ్యులు శృంగారె గంగాధర్, రాందాస్ వాగ్మారె,  ముథోల్ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ వాగారే, లోకేశ్వరం మండల అధ్యక్షులు దిలీప్ కదమ్, తానూర్ మండల కార్యధ్యక్షులు నాగోరావ్ లోకండే, సమతా సైనిక్ దళ్ సైనికులు, బౌద్ధ ఉపాసకులు, ఉపాసికులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

కీర్గుల్ (కె)లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

0

కీర్గుల్ (కె)లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ పాటలతో, మహిళలు డీజే  చప్పుళ్ల నడుమ  హోరెత్తిస్తూ నృత్యాలు చేస్తూ సోమవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ, తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు గొప్పతనాన్ని తెలియజేస్తూ, ప్రకృతిలో సూర్య చంద్రులను కొలిచిన విధంగా వివిధ రకాల పూలను కొలిచే పండుగ మన రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్కరంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మను కొనియాడారు. ఊరు వాడ కలిసి సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం, మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ పెద్దల నాటి సాంప్రదాయంతో వచ్చిన పండగని ఘనంగా జరుపుకుంటున్నారు. కీర్గుల్ (కె) గ్రామంలో మొట్ట మొదటిసారిగా దుర్గామాతను  గ్రామస్తులు కలిసికట్టుగా  ప్రతిష్టించారు. దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని గ్రామస్తులు తెలిపారు.

బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ నేత పరామర్శ

0

బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి భూక్య జాన్సన్ నాయక్ 

చిత్రం న్యూస్, కడెం:  నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన  బీఆర్ఎస్ సీనియర్ నేత చిట్టెటి ముత్తన్న సోదరి గంగవ్వ  ఇటీవల మరణించారు.  బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి భూక్య జాన్సన్ నాయక్  సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కత్తెరపాక రాజశేఖర్ ఇటీవల ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి కాలు ఫ్యాక్చర్ కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్ని తెలుసుకొని ఆయన్ను కూడా పరామర్శించారు.  ఆర్థిక సాయం అందజేశారు.

ఘనంగా బతుకమ్మ సంబరాలు 

0

ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె)  గ్రామంలో సోమవారం బతుకమ్మ సంబరాలను మహిళలు  ఘనంగా జరుపుకున్నారు. తీరొక రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి తయారు చేసి, బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ డీజే పాటలతో హోరెత్తిస్తూ మహిళల నృత్యాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ సంబరాలు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కోలాటాలు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు.