Home Blog Page 55

కూష్మాండ మాత అలంకారంలో బాసర సరస్వతీ అమ్మవారు

0

కూష్మాండ మాత అలంకారంలో బాసర సరస్వతీ అమ్మవారు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదియ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతి అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గురువారం  నాలుగో రోజు సరస్వతి అమ్మవారు భక్తులకు కూష్మాండ మాత అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా  అల్లం గారెలు సమర్పించారు. భక్తులు పాటించవలసిన పూజ నియమాలను సూర్యుడికి అర్ఘ్యం అర్పిస్తే వ్యాధులు, దోషాలు మరియు దారిద్య్రం తొలగిపోతాయని ఆలయ అర్చకులు బాలకృష్ణ తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా వస్తున్నారు. పవిత్రమైన గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటున్నారు ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్

0

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా భైంసా డివిషన్ లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని, న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలు ఉంటే అక్క‌డ రాక‌పోక‌లు నిషేధించాల‌ని ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్ సూచించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే,  భోస్లె నారాయణ్ రావు పటేల్ గ

0

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిషన్లో  ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని, న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలు ఉంటే అక్క‌డ రాక‌పోక‌లు నిషేధించాల‌ని ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్ సూచించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని ఆయన పేర్కొన్నారు.

ఘనంగా దేవి నవరాత్రుల మహోత్సవాలు  

0

ఘనంగా దేవి నవరాత్రుల మహోత్సవాలు  

* శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో గ్రామస్తులకు దర్శనం ఇచ్చారు. గ్రామస్తులు దేవీ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు, వేద మంత్రోచ్ఛారణాలతో అమ్మవారిని కొలిచారు. నైవేద్యంగా  పొంగలి సమర్పించారు. ఊరు వాడా తరలివచ్చి అమ్మవారికి హారతులు ఇచ్చారు. యువకులు భవాని దీక్షను చేపట్టారు. నియమ నిష్ఠలతో దీక్షను బూని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాత్రివేళ నిర్వహిస్తున్న సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

ఘనంగా బతుకమ్మ సంబరాలు

0

ఘనంగా బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల traditions కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వీధుల్లో సందడి చేసే ఈ పూల పండగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ భైంసా మండలంలోని వాలేగాం గ్రామంలో ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ పండుగను ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దలు పాల్గొని నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మగా పూజించారు. తంగేడు, గునుగు వంటి పూలతో నాలుగంతరాల బతుకమ్మను అందంగా పేర్చారు. పీఠంపై గౌరమ్మను నిలిపి పూజించారు. నానబియ్యం నైవేద్యం బతుకమ్మకు సమర్పించారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు తల్లి బతుకమ్మ ఉయ్యాలో ” అంటూ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన

0

చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అధికారులు బుధవారం అవగాహన  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TGB RO  అరుణ్ కుమార్  మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్  PMSBY, PMJJBY, అటల్ పెన్షన్ యోజన కలిగి ఉండాలని వివరించారు. ఆడ బిడ్డలకు సుకన్య సమృద్ది యోజన చేసుకోవాలని సూచించారు. బ్యాంకులో తీసుకొన్న లోన్స్ సకాలంలో కట్టుకోవాలని,  సైబర్ క్రైమ్ గురించి కళా ప్రదర్శన ద్వారా అందరికీ స్వచ్ఛత గురించి, చెట్ల యొక్క ఉపయోగాలు, ప్రాధాన్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో TGB చప్రాల బ్రాంచ్ మేనేజర్ M.శివకుమార్ ,క్యాషియర్ ప్రభాకర్, SERP APM, CC, VOA మంజుశ, బేల CFL కౌన్సిలర్స్ అజయ్, అనికేత్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి

0

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ ను ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా బుధవారం ఆయనను కలిశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై  ఆయన ఆరా తీయగా సామ రూపేష్ రెడ్డి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారని ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పించాలని ఆయనను కోరారు. అయితే ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని రూపేష్ రెడ్డి తెలిపారు.

చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం 

0

చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో  బుధవారం చంద్రఘంటా అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు చంద్రఘంటా అలంకారంలో పులి వాహనంపై జపమాల, కమండలం, విల్లంబులు, ఖడ్గం ధరించి భక్తులకు కనిపించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారినీ  భక్తిశ్రద్ధలతో  కొలిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు తమ చిన్నారులకు అక్షరభ్యాసం పూజలు నిర్వహిస్తే విద్యావంతులుగా రాణిస్తారని భక్తుల నమ్మకం. ఆలయ వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో, ఆలయ అధికారులు ప్రత్యేక సదుపాయాలను కల్పించారు.

ఆర్ కే మాస్టర్ హీరోగా “మా ఊరి బావి” 

0

ఆర్ కే మాస్టర్ హీరోగా “మా ఊరి బావి” 

చిత్రం న్యూస్, ఫిల్మ్ నగర్: ఆర్ కే  మాస్టర్ హీరోగా “మా ఊరి బావి” అనే మరో సినిమా తెరకెక్కుతోంది. అచ్చమైన పల్లెటూరి వాతవరణంలో కొనసాగే హార్రర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. నటీ, నటులపై  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ దృశ్యాలను ఈ మధ్యే తెరకెక్కించారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్  పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్స్  కార్యక్రమాల వైపు దూసుకెళుతోంది.  ప్రేక్షకుల ముందుకు త్వరలో సినిమాను తీసుకొచ్చేందుకు  చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నర్సూరి నరేష్ దంపతులు 

0

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నర్సూరి నరేష్ దంపతులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాసర సామాజిక  కార్యకర్త, వ్యాపార వేత్త నర్సూరి నరేష్, దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు  నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద తన తల్లిదండ్రుల చేతుల మీదుగా భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అందరిపై అమ్మవారి కరుణ కటాక్షాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నట్టు నర్సూరి నరేష్ తెలిపారు.