Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 19

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

0

చిత్రం న్యూస్, బోథ్: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో బుధవారం నిర్వహించారు. బోథ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీసాయి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, మండలం లోని యువకులు జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రక్తదానం చేశారు. రక్తదానం చేయడంతో ఒక ప్రాణం నిలబడుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు.

ఇండోఫిల్ ఇండస్ట్రీస్ ‘ప్రాజెక్ట్ ఖుషి’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం

0

చిత్రం న్యూస్, జైనథ్: “సంస్కృతి, సమాజం పోషణకు ఒక అభివ్యక్తి”ని సూచించే ఇండోఫిల్ ఇండస్ట్రీస్ యొక్క “ప్రాజెక్ట్ ఖుషి (విస్టేరియా)” కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్, వెంకటేశ్వర దేవాలయం వద్ద వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులతో ముచ్చటించి వారితో కలిసి చురుకుగా వృక్షారోపణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ASM గజానన్, RDGM గౌతమ్ రెడ్డి, RSM మహిపాల్ రెడ్డి, ఆదిలాబాద్ DGE ఎర్ల సాయికృష్ణ, నిజామాబాద్ ప్రాంత DGO సంతోష్, CO బాపన్న హాజరయ్యారు.

విద్యార్థుల పరీక్ష ఫీజు గడువు పెంచాలి

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొదటి మూడు, ఐదవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు  చెల్లించడం కోసం ఈ నెల 22 వరకు గడువు ఉంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న ప్రత్యేక వాతావరణం, వర్షాలు, ఆదివాసీ విద్యార్థులు అధికంగా ఉన్న బేల,  బజార్ హత్నూర్, ఉట్నూర్ లాంటి మండలాల్లో దీపావళి సందర్భంగా గుస్సాడీ దండారీలు అనే ప్రత్యేక పరిస్థితి ఉండటంతో అధిక శాతం మంది విద్యార్థులు ఇంకా ఫీజు చెల్లించలేక పోతున్నారు. అలాగే సాంకేతిక కారణాలు కూడా ఉండటంతో యూనివర్సిటీ అధికారులు మానవత దృక్పథంతో మరో వారం రోజులు పరీక్ష ఫీజు గడువును  ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పెంచాలని ఏడీసీఏ ( ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్) తరుపున డా. వేముగంటి వరప్రసాద రావు సమావేశంలో యూనివర్సిటీ అధికారులని కోరారు.

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. హైదరాబాద్‌లో మంగళవారం మంత్రిని కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సోయా బీన్ పంటను రైతులు మార్కెట్లో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందని, దీంతో క్వింటాల్‌కు రూ.1200–రూ.1500 వరకు నష్టపోతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు బెంగాల్ గ్రామ్ విత్తనాలను సబ్సిడీపై అందించాలని సూచించారు. పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, వారికి ఆహారం పంపిణీ చేయాలని కోరారు. రైతులకు మెరుగైన వసతులు కల్పించేందుకు మార్కెట్ యార్డులో కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పాయల్ శంకర్ మంత్రికి సూచించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.

లారీ ఓన‌ర్ల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి భ‌రోసా 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: లారీ ఓన‌ర్ల‌కు త‌న అండ‌దండ‌లుంటాయ‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ఎప్పుడు ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌న దృష్టికి తేవాల‌ని అన్నివేళ‌లా అండ‌గా ఉంటాన‌ని వారికి భ‌రోసానిచ్చారు. బుధ‌వారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూత‌న కార్య‌వర్గం ఎన్నిక సంద‌ర్భంగా కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. ఆయ‌న‌కు వారు ఘ‌న స్వాగ‌తం ప‌లికి శాలువాల‌తో స‌త్క‌రించారు. ఎవ‌రి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. మ‌నంద‌రి ల‌క్ష్యం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయడమేన‌న్నారు. దాంతో పాటు స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు గిమ్మ సంతోష్ రావు, లోక ప్రవీణ్ రెడ్డి, మునిగెల విట్టల్, రఫిక్, రోహిత్ షిండే, షఖీల్, శరత్, నరేష్, సోమ ప్రశాంత్, తోఫిక్,అంజాద్, ఆదిలాబాద్ జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫహీం ఖాద్రి, ప్రధాన కార్య‌ద‌ర్శి సందీప్, కోశాధికారి న‌యీముద్దీన్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అక్బ‌ర్ ష‌రీఫ్, ఉపాధ్య‌క్షులు స‌య్య‌ద్ సిరాజ్, జాయింట్ సెక్ర‌ట‌రీ మోహిసిన్ అహ్మ‌ద్, స‌భ్యులు అమ‌ర్, అబ్దుల్ అజీజ్, వాహెద్, ల‌తీఫ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సోయా పంట కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు

0

చిత్రం న్యూస్, బోథ్: సోయా పంట కొనుగోలు చేయాలంటూ బుధవారం రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. చేతికొచ్చిన సోయా పంట గత 20 రోజుల నుండి స్థానిక మార్కెట్ యార్డ్ లో తేమ శాతం లేకుండా ఆరబెట్టి మార్కెట్ యార్డు లో సోయా పంట నిల్వలు పేరుకపోవడంతో కనీసం మార్కెట్ యార్డ్ లో కూడా సోయా పంట తీసుకువద్దామన్న కూడా స్థలం కూడా లేదని ప్రభుత్వం ఒకపక్క రైతు ప్రభుత్వం అంటూ మోసాలు చేస్తుందన్నారు. కనీసం పండించిన పంట అమ్ముకుందామన్నా కూడా కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆరుగాలం కష్ట పడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేపట్టడం లేదన్నారు. ఒక పక్క రబీకి పంట సాగు చేయాలో లేక సోయా పంట కోసం రాత్రింబవళ్ళు మార్కెట్ యార్డులోనే ఉండవలసి వస్తుందని వెంటనే సోయా పంటను కొనుగోలు చేయాలని రైతులు డైమండ్ చేశారు. మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ. సోయా పంట కొనుగోలు చేయాలని, అదే విధంగా అకాల వర్షాల వల్ల పంట దిగుబడి రాలేదని నష్ట పోయిన ప్రతి రైతుకు  రూ.10 వేల సహాయంతో పాటు వరి పంటకు ఏవిధంగా అయితే 500 రూ. బోనస్ ఇస్తుందో అదే విధంగా మా ప్రాంతంలో పండిస్తున్న , పత్తి, సోయా, మొక్క జొన్న, కందులు, పెసర్లు, మినుములకు 500 రూ. బోనస్ ప్రకటించాలని అన్నారు. రెండు మూడు రోజుల్లో సోయా పంట కొనుగోళ్లు జరపాలని లేని పక్షంలో రైతులందరం ఏకమై ఉద్యమాలు చేస్తామని సూచించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బోథ్ మండల రైతులు, ఇట్టేడి మోహన్ రెడ్డి, బోడ్డు శ్రీనివాస్, కొట్టాల రమేష్ రెడ్డి , సోమ శంకర్, నోముల ప్రభాకర్ రెడ్డి, రాజారాం, చాంద్ బాషా, రైతు వేదిక అధ్యక్షుడు బొర్రన్న, శ్రీధర్ రెడ్డి, అల్లకొండ ప్రశాంత్, సోయాబీన్ పంట రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అక్టోబర్ 27 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని పత్తి రైతులకు శుభవార్త .అక్టోబర్ 27 సోమవారం నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ (CCI) మరియు ప్రైవేట్ వ్యాపారులచే పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.కనీస మద్దతు ధర (MSP) 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటా కనీస మద్దతు ధర రూ. 8,110 గా నిర్ణయించింది.

*కొనుగోలు నియమాలు: ఈ సంవత్సరం సీసీఐ కొనుగోలు నియమ నిబంధనల ప్రకారం.. రైతులు తమ పత్తిని సీసీఐకి విక్రయించాలంటే మార్కెట్ యార్డుకు రాకముందే ‘Kapas Kisan’ యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ తేదీ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మార్కెట్ యార్డుకు లేదా సీసీఐ సెంటర్‌కు రావాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌లోని A మరియు B సెంటర్‌లలో రైతులు పత్తిని సీసీఐకి అమ్ముకోవడానికి, ‘Kapas Kisan’ యాప్‌లో జిన్నింగ్ మిల్లుల ఎంపిక కోసం అక్టోబర్ 24 2025 నుండి స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సీసీఐ బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. రైతులు ఖచ్చితంగా స్లాట్ బుకింగ్ నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే పత్తి అమ్మకానికి మార్కెట్ యార్డుకు రావాలని సూచించారు.

*తేమ శాతం ఆధారంగా ధరలు: నాణ్యత ప్రమాణాల ప్రకారం, తేమ శాతం ఆధారంగా పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి:

8%: రూ. 8,110.00

9%: రూ. 8,028.00

10%: రూ. 7,947.80

11%: రూ. 7,866.70

12%: రూ. 7,785.60

వైద్య వృత్తిలో రాణించి పేదలకు సేవలందించాలి: ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్

0

అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థులకు సన్మానం 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని మన బైంసా ప్రాంత విద్యార్థులు ఎంబీబీఎస్ లో సీటు సాధించడం అభినందనీయమని, వైద్య వృత్తిలో రాణించి పేదలకు సేవ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సూచించారు. మంగళవారం భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 25 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ లో సీటు సాధించిన సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్యులు అవసరమని, భవిష్యత్తులో డాక్టర్లు అయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాలన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లిదండ్రులను విస్మరించవద్దన్నారు. తల్లిదండ్రులు దైవంతో సమానులని, పిల్లల కోసం వారి ఎండనక, పగలనక శ్రమిస్తా రన్నారు. భైంసా ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అనుకున్న రంగంలో రాణించాలి

ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ సతీష్ పవార్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశీనాథ్, వైద్యులు అనిల్ పద్మావతి మాట్లాడుతూ.. వైద్యరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని భవిష్యత్తులో అనుకున్న రంగంలో సక్సెస్ అయి వైద్య సేవలు చేపట్టాలని సూచించారు. మండల విద్యాధికారులు సుభాష్, చంద్రకాంత్, ఉపాధ్యాయ సంఘ నాయకులు బి.వి.రమణారావ్, వినోద్, శంకర్, భాజిరెడ్డి, శ్రీనివాస్ గంగాధర్ తో  పాటు పలువురు మాట్లాడుతూ..  గత పది సంవత్సరాలుగా విద్యారంగాన్ని అభివృద్ధి పరచడానికి అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలు పంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిఎఫ్ఓ దత్తురామ్ పటేల్, సీనియర్ నాయకులు సొలంకి భీమ్ రావ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

నిజాయతీ చాటుకున్న బాసర ఆలయ సిబ్బంది

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సిబ్బంది తమకు దొరికిన పర్సును అందజేసి నిజాయతీ చాటుకున్నారు. మంగళవారం ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ భక్తురాలు తన పర్సును  లడ్డు ప్రసాదం కౌంటర్ వద్ద మరిచిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ హోంగార్డులు రాజేష్, రవి, వాగ్దేవి సొసైటీ సిబ్బంది నాగేష్ విషయం తెలుసుకుని  ఆచూకీ కోసం పరిసరాల్లో గాలించారు. వారికి రూ.7 వేల నగదుతో కూడిన పర్సు దొరకడంతో అందులో ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించి తిరిగి భక్తురాలికి అప్పజెప్పారు. విధుల పట్ల నిజాయతీ చాటుకున్న సిబ్బందిని  భక్తులు అభినందించారు.

పల్లెల్లో దీపావళి సంబరాలు

0

చిత్రం న్యూస్,బేల: దీపావళి పండగను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున ఇళ్ల  ముందు రంగవల్లులు వేశారు. వ్రతాలు పూజలతో అందరి ఇళ్ళలో సందడి నెలకొంది. మంగళవారం గోమాతకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. టపాసుల కాంతులతో పల్లెలు దద్దరిల్లాయి.