Home Blog Page 184

నకిలీ బాబా అరెస్టు

0

_సీఐ బండారి రాజు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: టెక్నాలజీ రోజు రోజుకు ఎంత పెరగిపోతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని కొందరు దొంగ బాబాలు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫేక్‌ బాబాల నిర్వాకం వెలుగులోకి వచ్చినవే. అయితే.. ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఓ ఫేక్‌ బాబా గుట్టు రట్టైంది. దీంతో.. ఆ నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం. ఇచ్చోడ మండలం కోకస్ మన్నూరు గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ అమాయక ప్రజల బలహీతని ఆసరా చేసుకొని వ్యాధులను నయం చేస్తానంటూ తాయత్తులు కట్టి బురిడీ కొట్టించేవాడని అన్నారు. దీంతో నిందితుడిని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. ప్రజలు ఇలాంటి దొంగ బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులతో మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంసిద్ధంగా జిల్లా విపత్తు నిర్వహణ బృందం

0

   *జిల్లాలో 20 మంది సిబ్బందితో పటిష్టంగా విపత్తు నిర్వహణ బృందం

*వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల సమయంలో అత్యవసరంగా స్పందించేందుకు డీడీఆర్ఎఫ్ బృందం

*సాత్నాల ప్రాజెక్టు వద్ద బృంద సభ్యులతో శిక్షణలో పాల్గొని సిబ్బందికి సూచన

*అత్యాధునిక  పరికరాలకు పూజ చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

చిత్రం న్యూస్, సాత్నాల: రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  దూర దృష్టితో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ఒకవేళ చోటు చేసుకున్న ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడడానికి జిల్లా విపత్తు నిర్వహణ బృందం (డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ) 20 మంది పోలీసు సిబ్బందితో పక్కా ప్రణాళికతో పటిష్టంగా ఉందని తెలిపారు. సాత్నాల ప్రాజెక్టు వద్ద జిల్లా పోలీసు అధికారులు, విపత్తు నిర్వహణ బృందంతో జిల్లా ఎస్పీ ఆధునిక పరికరాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.

బోటులో ప్రయాణించి శిక్షణ సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు ఇచ్చి అత్యవసర సమయంలో వెంటనే స్పందించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ విపత్తు నిర్వహణ బృందం జిల్లాలో ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో 20 మంది పోలీసు సిబ్బందితో శిక్షణ పూర్తి అయి, ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో వరదలు సంభవించినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, రోడ్లపై చెట్లు విరిగిపడ్డ సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తమదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రజలకు “పోలీసులు మీకు ఉన్నాం అంటూ” రక్షణ కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఇల్లు కూలిపోయిన సందర్భంలో ఎలాంటి తుఫానులు, సుడిగాలులు సంభవించిన రోడ్డు స్తంభించిపోయినప్పుడు చెట్లు విరిగిపడ్డప్పుడు ఈ బృందం ఆస్తి నష్టం, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలను చేపడుతుందని తెలిపారు. ఈ డీ డీ ఆర్ ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోటు, మోటార్ మిషన్, మెడికల్ స్ట్రక్చర్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్స్ మిషన్ లాంటివి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలకు ఆపత్కాల సమయంలో ప్రాణ నష్ట, ఆస్తి నష్టం సంభవించకుండా జిల్లా పోలీసుల ద్వారా ప్రత్యేకంగా ఈ బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ బృందం హైదరాబాద్ నందు వారం రోజులు పాటు శిక్షణ తీసుకొని అత్యవసరంగా స్పందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు డి.సాయి నాథ్, కె.ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్, డీ డీ ఆర్ఎఫ్ బృంద సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

0

చిత్రం న్యూస్, ఇచ్చోడ;

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

_పీ హెచ్ సీ వైద్యాధికారి హిమబిందు

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ పీ హెచ్ సీ వైద్యాధికారి డా హిమబిందు అన్నారు. మండలంలోని సిరిచెల్మ గ్రామ పంచాయతీ పరిధిలోని నేరేడిగొండ (జి) గ్రామంలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మంది బాలింతలు, గర్భవతులు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గర్భిణులు, బాలింతలు సీజనల్ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బాలింతలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్ఎం రేణుక, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక చేయూత 

0

*రూ.5వేలు ఆర్థిక సాయం అందజేసిన అడా నేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ యువ నాయకుడు సతీష్ పవార్

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మొహబ్బత్ పూర్ గ్రామానికి చెందిన సందీప్ ఠాక్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో  అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్ రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ విపిన్ ఖోడే ద్వారా బాధితుడి పరిస్థితి తెలుసుకున్న సతీష్ పవార్ బుధవారం గ్రామానికి వెళ్లి బాధితుడికి నగదును అందజేశారు .ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అపదలో ఉన్నా వాళ్ళని ఆదుకున్నందుకు సతీష్ పవార్ కు విపిన్ ఖోడే ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్న ఓల్లప్ వార్, మాస్కే తేజరావు, గ్రామ మాజీ సర్పంచ్ విపిన్ ఖోడే, విశ్వనాథ్ ఠాక్రే మరియు గ్రామస్థులు ఉన్నారు.

విద్యుత్ తీగ తగిలి యువ రైతు మృతి

0

విద్యుత్ తీగ తగిలి యువ రైతు మృతి 

*నేరడిగొండ మండలం లింగట్లలో విషాదం

చిత్రం న్యూస్, నేరడిగొండ (ఇచ్చోడ): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన యువరైతు సాబ్లే సుభాష్ తన వ్యవసాయ భూమిలో పత్తి పంటకు కలుపు తీస్తున్న సమయంలో అక్కడే వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలింది. ప్రమాదవశాత్తు అక్కడికక్కడే  మృతిచెందాడు. గత కొన్ని నెలల నుండి విద్యుత్ తీగ వేలాడుతున్న విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

కాలభైరవ స్వామి పంచామృతాభిషేకంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

0

కాలభైరవ స్వామి పంచామృతాభిషేకంలో  పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

చిత్రం న్యూస్, పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం శివాలయంలో ఉన్న కాలభైరవ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ పంచామృతాభిషేకం కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ,  మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు, బడుగు శ్రీకాంత్,కుమారస్వామి, దుర్గా ప్రసాద్ తెలుగుదేశం నాయకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిడమ్మ అమ్మవారి జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే చినరాజప్ప

0

 

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా జిల్లా పెద్దాపురం  మరిడమ్మ అమ్మవారి జాతరను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ముప్పై ఏడు రోజుల పాటు జరగనున్న  ఈ జాతరకుఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు అధికంగా భక్తులు తరలివస్తారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తిచేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, ఆలయ ఈవో విజయలక్ష్మి ఉన్నారు.

చిన్నారిపై దాడి అమానుషం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

0

 

చిత్రం న్యూస్, నెల్లూరు: నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారి చెంచమ్మను సర్వేపల్లి శానసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సెల్ ఫోన్ విషయంలో చిన్నారిపై గరిటె కాల్చి ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టడం దుర్మార్గమన్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చెంచమ్మకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. చెంచమ్మపై అమానుషానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

టీడీపీతోనే బీసీల ఆత్మ గౌరవం పెంపు

0

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితని సన్మానిస్తున్న దాసరి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు

చిత్రం న్యూస్, అమరావతి: వెనుబడిన తరగతుల ఆత్మగౌరవం పెంపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలు గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే భిక్షాటన చేసేవారు అనే పదాన్ని తొలగింపు హర్షం వ్యక్తంచేస్తూ.. మంత్రి సవితకు దాసరి సామాజిక వర్గీయులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను దాసరి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు కలిశారు. ఇటీవల బీసీ-ఏ కేటగిరిలోని దాసరి సామాజిక వర్గానికి జారీచేసే కుల ధ్రువీకరణ పత్రంలో భిక్షాటన చేసేవారు అనే పదాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్న ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా బీసీ-ఏ కేటగిరిలో ఉన్న దాసరి కులస్తుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా కుల ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు చేశామన్నారు. దాసరి పక్కన బ్రాకెట్లో భిక్షాటన చేసేవారు అనే పదాన్ని రాసేవారని, ఆ పదాన్ని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రి తెలిపారు. బీసీలు ఆత్మ గౌరవంతో జీవనం సాగించాలనేది సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2025-26 బడ్జెట్ లో రూ.47 వేల కోట్లు నిధులు కేటాయించారన్నారు. కుల వృత్తులకు అండగా నిలుస్తూ, రూ.1000 కోట్లతో ఆదరణ మూడో విడత పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అంతకుముందు దాసరి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు మాట్లాడుతూ, తమ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, భిక్షాటన చేసేవారు అనే పదం కుల ధ్రువీకరణ పత్రాల్లో నుంచి తొలగించడంపై సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీకి, సీఎం చంద్రబాబుకు తమ జీవితాంతం రుణపడి ఉంటామని వారు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి సవితను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాసరి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పి.రవి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

పెద్దాపురంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు

0

పెద్దాపురంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా పెద్దాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో  ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం అభియాన్ ప్రముఖ్ గోరకపూడి చిన్నయ్య దొర ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహనరావు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్నయ దొర మాట్లాడుతూ ..శ్యామ ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమం నడిపారన్నారు. ఆయన “ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిశాన్, దో ప్రధాన్ నహీ చలేగా” అనే నినాదంతో కాశ్మీర్‌ను పూర్తిగా భారతదేశంలో విలీనం చేయాలని కోరారాన్నారు. 1953లో కాశ్మీర్‌లో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు ఆయనను అరెస్టు చేశారన్నారు. జూన్ 23, 1953న శ్రీనగర్ జైలులో ఆయన మరణించారన్నారు. అధికారికంగా గుండెపోటు కారణంగా మరణించినట్లు చెప్పబడినప్పటికీ, ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు, వివాదాలు ఉన్నాయని కొందరు ఆయన మరణాన్ని హత్యగా భావిస్తారని, ఈ అంశం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉందని అన్నారు. ఈ రోజు భారతీయ జనసంఘ్ (ప్రస్తుత BJP), ఇతర సంస్థలు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతీయవాద ఆలోచనలను, కాశ్మీర్ ఏకీకరణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరిస్తారన్నారు. దేశవ్యాప్తంగా సభలు, స్మారక కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించబడతాయని, ఆయన త్యాగం హిందూ జాతీయవాద భావజాలానికి, భారత ఏకత్వానికి ప్రేరణగా గుర్తించబడుతుందన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు, ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు, 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఆయన కల నెరవేరినట్లుగా భావించబడిందదని. పేర్కొన్నారు. ఆయన బలిదాన్ దివస్ భారతదేశంలో జాతీయవాద భావనలను బలోపేతం చేయడానికి ఒక సందర్భంగా గుర్తించబడిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్, దుర్గ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.