Home Blog Page 163

కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్య

0

          దాసరి లక్ష్మారెడ్డి (ఫైల్ ఫొటో)

చిత్రం న్యూస్, బోథ్: కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్యచేసుకున్న ఘటన బోథ్ లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీ సాయి ప్రకారం..బోథ్ కు చెందిన దాసరి లక్ష్మ రెడ్డి (76) అపెండెక్స్ చికిత్స చేసుకొని మందులు వాడుతున్నారు.  జూలై 31 న కడుపు నొప్పి తీవ్రం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తగ్గకపోగా నొప్పి భరించలేక ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భార్య బోజబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీ సాయి తెలిపారు.

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో సుద‌ర్శ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు

0

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో సుద‌ర్శ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మాజీ మంత్రి, బోధ‌న్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద‌ర్శ‌న్ రెడ్డి అంద‌రివాడుగా పేద‌ల పెన్నిధిగా పేరు గ‌డించిన వ్య‌క్తి అని కాంగ్రెస్ నాయ‌కులు గిమ్మ‌ సంతోష్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో శ్రేణులతో క‌లిసి సుద‌ర్శ‌న్ రెడ్డి క‌టౌట్ ప్ర‌క్క‌న‌ ఆయ‌న 77వ జ‌న్మ‌దిన వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసి ఒక‌రినొక‌రు తినిపించుకొని శుభాకంక్ష‌లు తెలిపారు. వైఎస్ హ‌యాంలో  చేప‌ట్టిన జ‌ల‌య‌జ్ఞం ప‌థ‌కం స‌మ‌యంలో భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రిగా ఆదిలాబాద్ జిల్లాకు ప్రాజెక్టులు తెచ్చి ఇక్క‌డి రైతాంగానికి ఎంతో మేలు చేసార‌ని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని ఆకాంక్షించారు. ఈకార్య‌క్ర‌మంలో సీనియర్ నాయ‌కులు లోక ప్ర‌వీణ్ రెడ్డి , రావుల సోమ‌న్న‌, దొగ్గ‌లి రాజేశ్వ‌ర్ , దాస‌రి ఆశ‌న్న‌, ఎంఏ ష‌కీల్ , ర‌ఫీఖ్, అజ‌య్, శ్రీ‌లేఖ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సెయింట్ థామస్ పాఠశాలలో మాక్ పోలింగ్

0

*విద్యార్థులలో ఎలక్షన్ జోష్

*విద్యార్థులకు ఓటింగ్ పై అవగాహన.

*ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులు.

చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని  సెయింట్ థామస్ పాఠశాలలో శనివారం రోజున మాక్ పోలింగ్ నిర్వహించారు, విద్యార్థులకు ఓటింగ్ విధానం పై అవగాహన కల్పించారు. .విద్యార్థులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు దీరారు. నామినేషన్ దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం, ఓట్లు లెక్కింపు, ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం జారీ పై అవగాహన కల్పించారు, ఎన్నికలలో స్కూల్ లీడర్ గా 10 వ తరగతి శ్రీ వర్షిత, అసిస్టెంట్ లీడర్ గా 9వ తరగతి సాయి నిఖిల్, స్కూల్ స్పోర్ట్స్ లీడర్ గా పదవ తరగతి అక్షిత్, అసిస్టెంట్ కల్చరల్ లీడర్ గా 9వ తరగతి శ్రీవిద్య ఎన్నికలలో గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కోసం మాక్ పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. సాధారణ ఎన్నికలలో పోలింగ్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పీఈటీ శివానందరెడ్డి మాక్ పోలింగ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’  కార్యక్రమం

0

భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’  కార్యక్రమం కింద మొక్కలు నాటుతున్న యూత్ సభ్యులు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో మేరా యువ భారత్ లో భాగంగా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “తల్లి పేరు మీద ఒక చెట్టు” కార్యక్రమం కింద మొక్కలు నాటారు. మన భారత ప్రభుత్వం  “తల్లి పేరు మీద ఒక చెట్టు” అనే ప్రోగ్రాం ను 2024 లో ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన అందరికి భూమి అంటే అమ్మ లాంటిది. తల్లి పేరు మీద ఒక చెట్టును నాటమని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా, తల్లులు అందించే సంరక్షణ మరియు పెరుగుదలకు ప్రతీకగా ప్రచారం చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీవో శివ కుమార్ , గ్రామ కార్యదర్శి , భగత్ సింగ్ యువజన అధ్యక్షుడు నర్సయ్య, సభ్యులు రంజీత్ ,గణేష్, ముత్తన్న , రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డీఎంతో మాట్లాడి బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే

0

గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సుతో నాయకులు, గ్రామస్తులు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మంగ్రూడ్, పాటన్, కొబ్బయితో పాటు పలు గ్రామాల విద్యార్థులు జైనథ్ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టికి తీసుకెళ్లారు, ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించడంతో శుక్రవారం గ్రామాలకు బస్సు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్  శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.  బీజేపీ జనరల్ సెక్రటరీ సందీప్ టాక్రే, విద్యార్థులు,  గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

బోథ్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేస్ నమోదు

0

                            ఉష్కేల దశరథ్ 

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు శనివారం  ఎస్సై శ్రీ సాయి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..బోథ్ కు చెందిన ఉష్కేల దశరథ్ (30) తన భార్య శైలజ, కుమార్తెతో కలిసి నిర్మల్ లో నివాసం ఉంటున్నారు. భార్య అనారోగ్యం కారణంగా గత 2 వారాల క్రితం బోథ్ కు రాగా భార్య తన పుట్టింటికి నేరడిగొండ వెళ్ళింది. దశరథ్ జులై 31 న నిర్మల్ వెళ్తానని చెప్పి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో  అతని భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ,ఆచూకీ తెలిస్తే 87126 59932 ను సంప్రదించాలని ఎస్సై పేర్కొన్నారు.

ఘనంగా ఆటో దినోత్సవ వేడుకలు 

0

 ఆటో దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న యూనియన్ నాయకులు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ కేంద్రంలోనీ బస్టాండ్ లో గల ఆటో స్టాండ్ వద్ద ఆటో దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించారు. బోథ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. పగలు, రాత్రి అని తేడా తెలియక ప్రజల కష్టాల్లో ఆటో డ్రైవర్లు స్పూర్తి ఎనలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్ లు పాల్గొన్నారు.

వివేకానంద పాఠశాలలో వరలక్ష్మి పూజ 

0

వరలక్ష్మి పూజ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో వివేకానంద పాఠశాలలో ముందస్తుగా వరలక్ష్మి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య, మేనేజ్ మెంట్ ఓరగంటి ఇస్తారి, కోస్మెట్టి శుద్దోదన్, మునిగెల శ్రీధర్ అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

0

ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్రం న్యూస్, జైనథ్ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలకేంద్రంలో ని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ టీజీటీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్లంలో డిగ్రీ/ పీజీతో పాటు బీఎడ్, టెట్ అర్హత ఉండాలన్నారు. విద్యార్హతల నకలు పత్రాలతో పాటు బయోడేటాను పాఠశాలలో ఈ నెల ఐదో తేదీ లోగా సమర్పించాలని  పేర్కొన్నారు. న్యాయనిర్ణేతల సమక్షంలో డెమో ఆధారంగా ఎంపిక జరుగుతుందని వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి

0

బేలలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, బేల: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తల్లో ముంచేయడం విడ్డూరంగా ఉందన్నారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు . రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ..  కాంగ్రెస్ ప్రభుత్వం  ఏడాదిన్నర పాలన పూర్తి అయిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా సంపూర్తిగా అమలు చేయకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం అన్నారు. నూతన రేషన్ కార్డులు అంటూ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూజ్స్తుందని ఎద్దేవా చేశారు. కనీసం బియ్యం ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుల పక్షాన నిలవాల్సింది పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మెచ్చుకోవడమే కాక ముఖ్యమంత్రి సైతం శంకర్ మనవాడే అని మాట్లాడటం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే ఆత్మ అని చెప్పడానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, సతీష్ పవార్, ప్రమోద్ రెడ్డి, యాసం నర్సింగరావు, ప్రహ్లాద్, గంభీర్ ఠాక్రే, విపిన్ ఖోడె తదితరులు పాల్గొన్నారు.