Home Blog Page 116

మరిడమ్మ అమ్మవారి ఆలయములో లలిత సహస్రనామ పారాయణ

మరిడమ్మ అమ్మవారి ఆలయములో లలిత సహస్రనామ పారాయణ

చిత్రం న్యూస్, సామర్లకోట:

పెద్దాపురం గ్రామం లో కొలువైన మరిడమ్మ అమ్మవారి జన్మ నక్షత్రం మఖ నక్షత్రము సోమవారం వచ్చిన సందర్భంగా ఉదయం 9:30 గంటలకు లలిత సహస్రనామ పారాయణ జరుపబడును అని ఆలయ సహాయ కమిషనర్ , కార్య నిర్వహణ అధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. భక్తులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.

వాడపల్లి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు

వాడపల్లి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు

*ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం

చిత్రం న్యూస్, వాడపల్లి:
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశంలో చేపట్టిన పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్య ఉన్నందు వల్ల ఆయా ప్రాంతాల నుండి వచ్చేవారికి తగు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సత్యానందరావు ఆదేశించారు. అనంతరం అన్న ప్రసాద కేంద్రం వద్ద భోజనం చేస్తున్న భక్తులను భోజన వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు.  దర్శన ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.అనతరం ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని,ఎవరైనా సమస్యలు చెప్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ పంజా భాస్కరకృష్ణ రావు అనే భక్తుడు స్వామి వారికి 50 వేల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందజేశారు.

భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు పెంపు

భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు పెంపు

చిత్రం న్యూస్ సామర్లకోట:

ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) సామర్లకోట పట్టణ కమిటీ సమావేశం ప్రకృతి ఈశ్వరరావు అధ్యక్షతన భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా ప్రకృతి ఈశ్వరరావు మాట్లాడుతూ..  పెరిగిన నిత్యావసర వస్తువులు ధరలు, గ్యాస్ ధరలు, కరెంట్ చార్జీలు, ఇంటి పన్నుల పెంపుదల కారణంగా భవన నిర్మాణ కార్మికులకు జీవనం కష్టంగా ఉండటం వలన, పెరిగిన ధరలకు అనుగుణంగా స్వల్పంగా కూలీ రేట్లు పెంచడం జరుగుతుందని జూన్ 1 నుండి నూతన కూలీ రేట్లు అమలులోకీ వస్తాయని భవన యజమానులు సహకరించవలసిందిగా కోరుతున్నామని చెప్పారు. పెరిగిన రేట్లు మేస్త్రికి గతంలో రూ. 850 ఉండేదని రూ.50 పెంచి 900,  అలాగే కూలీలకు గతంలో రూ.700కు రూ.50 పెంచి రూ.750 చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమం లో సంఘం ప్రతినిధులు బేవర బంగారయ్య, షేక్ బాషా, పి. శ్రీ రామ్, సీఐటీయూ మండల అధ్యక్షులు బాలం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, విప్పర్తి కొండలరావు, కరణం గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మూల ప్రేమ్ సాగర్ రెడ్డి

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మూల ప్రేమ్ సాగర్ రెడ్డి

చిత్రం న్యూస్, ఓదెల:

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి, ఎంఎల్ఏ చింతకుంట విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓదెల మండలం రూపు నారాయణపేట మానేరు నదిపై 80 కోట్ల రూపాయలతో హై లేవల్ వంతెన నిర్మాణం, ఓదెల మండల కేంద్రంలో 90 లక్షల రూపాయలతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం, 13 కోట్ల రూపాయలతో ఓదెల గ్రామం నుండి పెగడపల్లి వరకు సెంటర్ లైటింగ్ తో రెండు వరసల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయ రమణారావును ఓదెల మండల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అదే స్ఫూర్తి , అదే సంకల్పంతో ప్రజాసేవకే అంకితమై ఓదెల మండలానికి మరెన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులైన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, చీకట్ల మొండయ్య, మాజీ ఎంపిటిసి బోడకుంట శంకర్, పొత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, పెద్దపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపతి సదానందం, గడిగొప్పుల సంతోష్, మినుగు సంతోష్, పచ్చిమట్ల శ్రీనివాస్, గడిగొ ప్పల నరేష్, గొర్ల శ్రీనివాస్, నూతి శంకర్, పడాల రాజు, చొప్పరి రాజన్న,అంబాల కొమురయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హుస్సేనపురం గ్రామంలో వృద్ధురాలిని దత్తత తీసుకున్న MLA చిన్నరాజప్ప

హుస్సేనపురం గ్రామంలో వృద్ధురాలిని దత్త తీసుకున్న MLA చిన్నరాజప్ప

చిత్రం న్యూస్ సామర్లకోట:

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం హుస్సేనపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన విజన్ 2047లో P4 Zero poverty Scheme లో  హుస్సేనపురం భాగంగా పెద్దాపురం ఎమ్మెల్యే హుస్సేనపురం గ్రామంలో ఒక వృద్దురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు .ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే చిన్నరాజప్ప హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మండల నాయకులు, హుస్సేనపురం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జూన్ లో ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమిస్తున్న ‘

0

జూన్ లో ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమిస్తున్న ‘

*దర్శకుడు భాను తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం 

*సాత్విక్ వర్మ, ప్రీతి హీరో హీరోయిన్లుగా

చిత్రం న్యూస్, ఫిల్మ్ నగర్:

ఐ బి ఎం ప్రొడక్షన్ హౌస్ లో దర్శకుడు భాను దర్శకత్వంలో యంగ్ హీరో సాత్విక్ వర్మ, నూతన హీరోయిన్ ప్రీతి నటించగా ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమకు నిర్వచనం తెలుపుతూ ప్రేక్షకులకు ముందుకు వస్తున్న చిత్రం ‘ప్రేమిస్తున్న’. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ జూన్ నెలాఖరులో విడుదలకు సిద్ధం అవుతుంది.

గతంలో అర్ధనారి. రాజధాని ఫైల్స్. రాజు మహారాజు. ఇలాంటి ఎన్నో  గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు భాను తన పంథాను మార్చుకొని మొట్టమొదటిసారిగా ఓ ప్రేమ కథ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సందేశాత్మకంగా తీసిన చిత్రాలు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. అర్ధనారి చిత్రానికి మూడు నంది అవార్డులు రాగా ప్రత్యేక రాజధాని కోసం రాజధాని ఫైల్స్ లాంటి సినిమా తీసి ప్రేక్షకుల మెప్పుపొందగలిగాం. ఎన్నో రోజుల నుండి తెలుగు ప్రేక్షకులకు ఓ మంచి ప్రేమ కథ చిత్రం అందించాలనే ఉద్దేశంతో ఈ ‘ప్రేమిస్తున్న’ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు భాను తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు మించి రాబోతున్న ఈ చిత్రానికి నిర్మాత కనకదుర్గారావు పప్పుల. చిత్ర నిర్వహణ మర్రి రవికుమార్, డిఓపి భాస్కర్,సంగీతం సాలూరి సిద్దు, మాటల రచయిత అనిల్, ఫైట్స్ నందు, కొరియోగ్రఫీ స్వర్ణ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ భూపతి యాదగిరి, ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మణ్, పీ ఆర్ ఓ శ్రీధర్, మేకప్ బాబు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈశ్వర్, పల్లె ప్రదీప్, నాగరాజు, శ్రీకాంత్, గణేలు ఉన్నారు. జూన్ లో  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

డ్యాన్సర్ గా మొదలు..నటుడిగా ఎదిగి

0

డ్యాన్సర్ గా మొదలు..నటుడిగా ఎదిగి

*నీరుకుళ్ళ సినిమాతో వెండితెర పైకి

*ఆర్ కే మాస్టర్ ప్రస్థానం

చిత్రం న్యూస్, ఫిల్మ్ నగర్:

ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అందుకున్న ఓ మనిషి.. నాన్న కార్ డ్రైవర్.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి వాటిని  పాఠాలుగామార్చుకొని డ్యాన్స్ మాస్టర్ గా తనజీవితం ప్రారంభించి నటుడిగా ఎదిగి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో  తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. అతనే మన ఆర్ కే మాస్టర్ (రాధాకృష్ణ). చిన్న డ్యాన్స్‌ర్ గా తన జీవితాన్ని ప్రారంభించి గ్రూప్ డ్యాన్సుల్లో ఎక్కడో మూలన ఉండి నటించిన తను మెయిన్ డ్యాన్సర్ గా ఎదిగి ఎంతోమంది హీరోలకు డ్యాన్స్ నేర్పారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి, రమ గార్లకు డ్యాన్స్ లో మెలకువలు నేర్పి ప్రపంచాన్నంతా తన వైపు తిప్పుకొన్నాడు. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించి మంచి విజయాలతో దూసుకు పోతున్నాడు. నీరుకుళ్ల అనే సినిమాతో వెండితెర పై అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి ప్రశంసలు పొందాడు.  తను నటించిన మొదటి సినిమా సుమారు 75 థియేటర్లలో రిలీజ్  అయ్యింది. దీంతో  తానేంటో నిరూపించుకున్నాడు. దాని తర్వాత వెంటనే మహాబలి అనే సినిమా ఒకే నెల తేడాతో రిలీజ్ అయ్యింది. అతడితో ఒక సినిమా కూడా చేయని వాళ్ళతో తానేంటో నిరూపించుకున్నాడు.  ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి ఓస్కార్ అవార్డు మిస్సింగ్, హారర్ మూవీ ,దుస్కర్మ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. నీరుకుళ్ల ఓక హారర్ సినిమా మరియు మహాబలితో ఒక పెద్ద సాహసమే అని చెప్పవచ్చు. కేవలం సినిమా మొత్తంలో 6 డైలాగ్ లతో ఉంటుంది.  ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ సినిమాలో కూడా చట్టం చేశాడు . ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలకి డ్యాన్స్ నేర్పి చాల మంది డ్యాన్స్ మాస్టర్ల దగ్గర పనిచేసి ఇప్పుడు నటుడిగా తన ప్రస్తానాన్ని సాగిస్తున్నాడు మన ఆర్ కే మాస్టర్.

సైదాపూర్ ఏ ఎస్ ఐమల్లారెడ్డిఉద్యోగ ఉద్యోగ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

సైదాపూర్ ఏ ఎస్ఐ మల్లారెడ్డి ఉద్యోగ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

*ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాధవి

చిత్రం న్యూస్, సైదాపూర్: 

పోలీస్ శాఖలో సేవలు అందించడం ఒక గౌరవమని సైదాపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మల్లారెడ్డి అన్నారు. సుదీర్ఘ కాలం పాటు అంకితభావంతో విధులు నిర్వహించిన ఆయన శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సైదాపూర్ విశాల సహకార పరపతి సంఘం లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మల్లారెడ్డి తన సేవల ద్వారా సమాజానికి అనేక సేవలందించారని ఆమె ప్రశంసించారు. అనంతరం ఏసీపీ మాధవి మల్లారెడ్డికి జ్ఞాపిక అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకట్ గౌడ్, సైదాపూర్ ఎస్సై తిరుపతి, ట్రైనీ ఎస్సై భార్గవ్, శంకరపట్నం ఎస్సై రవి, హెడ్ కానిస్టేబుల్ సాబీర్, కానిస్టేబుల్స్ అశోక్, రాజు, అజయ్, నాగరాజు, సాయినాథ్, వెంకన్న, సాయి కృష్ణ, ఆకాష్, సురేష్, పూజ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

పేద ప్రజల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

*సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

*హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు

చిత్రం న్యూస్, బేల:

గూడు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చి వారి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇల్లు లేని పేద ప్రజలను గుర్తించి ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి 35 ఇళ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ప్రత్యేక అధికారి ,ఏ ఈ వినోద్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌతమ్, ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి లతో పాటు గ్రామస్తులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిరుపేద సరైన ఇల్లు లేనటువంటి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఆధ్వర్యంలో 35 ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి భూమి పూజచేశారు . అనంతరం సామ రుపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గడచిన పదేళ్లలో బి.ఆర్.ఎస్.ప్రభుత్వం లో ఏళ్లుగా ఎదురుచూసిన అర్హులై ఉన్నప్పటికీ ఇల్లు కట్టించి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళుతున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. ఇంకా గ్రామంలో అర్హులైన ప్రతివారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే విధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తమ వంతు కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామనర్సారెడ్డి, దయాకర్ పటేల్, లస్మన్న, వినోద్,సుధాకర్, మంచికంటి నవనీత్, మంచికంటి సాయి, తదితరులు ఉన్నారు.

మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలుపు.

మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలుపు

చిత్రం న్యూస్ పెద్దాపురం:

పెద్దాపురం మండలంలోని  పెద్దాపురం లో కొలువై ఉన్న మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలిపివేస్తున్నట్లు  అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు. జూన్ 24వ తారీకు నుంచి మరిడమ్మ అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. ఆ సమయంలో అన్న ప్రసాద వితరణను తాత్కాలికంగా నిలుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. జాతర అనంతరం అన్న ప్రసాద వితరణ  ఉంటుందని ఆమె తెలిపారు.