చిత్రం న్యూస్, కలెక్టరేట్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం సాధించి బాధ్యతలు చేపట్టిన భీంపూర్ మండలం ఆర్లీ (టి) కు చెందిన రామెల్లి శివ కుమార్ ను ఆదిలాబాద్ జిల్లా సహకార శాఖ యూనియన్ తరపున శనివారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహకార శాఖ అధికారి బి.మోహన్ మాట్లాడుతూ..నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ కు యూనియన్ తరపున అభినందనలు తెలిపారు. సహకార శాఖ పటిష్టత ను కాపాడుతూ, ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆత్మారామ్, శారద, అరుణ, ఉద్యోగులు విక్రాంత్, దేవేందర్ , దినేష్, సంతోష్, నయీం, సంజయ్, సంతోష్, దిరేష్, లక్ష్మీ, ఆశ జ్యోతి, రజిత , శశికళ, దేవు బాయి తదితరులు పాల్గొన్నారు.
వైభవోపేతంగా భావుబీజ్ వేడుకలు
చిత్రం న్యూస్, బేల: సోదర అనుబంధానికి, అనురాగాలకు ప్రతీగా నిలిచే భావుబీజ్ వేడుకలను శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. దీనిని మహారాష్ట్ర, గోవా, మరియు గుజరాత్‌లలో భావుబీజ్ అని పిలుస్తారు, ఇది “భాయ్ దూజ్” కు మరొక పేరు. మహారాష్ట్రలోని ఈ పండగను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోగా సరిహద్దులోని ఇక్కడి ప్రాంత మరాఠీ ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదిలాబాద్, బేల, జైనథ్, భీంపూర్ మండలాల్లో ఈ పండగను వేడుకగా నిర్వహించారు. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని చాటుతూ వేడుకలు నిర్వహించగా సోదరీమణులు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. సోదరులు వారికి కానుకలు అందజేసి తమ ప్రేమను చాటుకున్నారు. భావు బీజ్ వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.
పత్తి ముజ్జుకు లోక ప్రవీణ్ రెడ్డి పరామర్శ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పత్తి ముజ్జును కాంగ్రెస్ సీనియర్ నాయకులు, న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి పరామర్శించారు. గత రెండు రోజుల క్రితం పత్తి ముజ్జు సోదరి మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం పత్తి ముజ్జు నివాసానికి వెళ్ళి ఆయన్ను పరామర్శించారు. పత్తి ముజ్జు సోదరి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. లోక ప్రవీణ్ రెడ్డి వెంట మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.
సహృదయ్ యాదవ్ కు ఎంబీబీయస్ సీటు
విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు
చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని జామిని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ కుమారుడు సహృదయ్ యాదవ్ కు యం. ఎంబీబీఎస్ లో సీటు వచ్చిన సందర్బాన్ని పురస్కరించుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి స్వీట్స్, పసందైన చికెన్ తో కూడిన విందుభోజనం ఏర్పాటు చేసి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మా పెద బాబు సహృదయ్ యాదవ్ కు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది అని అన్నారు. పాఠశాల విద్యార్థులకు చదువు యొక్క విలువను తెలియజేయడం జరిగింది అని అన్నారు. డాక్టర్ కావడం మా బాబు కల అని, గిరిజనులకు, పేదలకు సేవ చేయాలనే లక్ష్యం ఉందని అని అన్నారు. నా సంతోషాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందం ఉంది అని అన్నారు. మా బాబులాగా మరింత ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో జామిని గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేయడం సంతృప్తిని ఇచ్చింది అని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు జ్యోతి, జయశ్రీ, లక్ష్మణ్, దూస గంగన్న, పెంటపర్తి ఊశన్న, మూనాహిద్,మోహిజే పోచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.
వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా
వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా
*ఒకరికి తీవ్రగాయాలు, మరొకరికి విరిగిన కాలు
*తప్పిన పెను ప్రమాదం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ నుంచి అబ్దుల్లాపూర్ వెళ్లే రహదారిలో వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి కాలు విరిగింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం బోరేగాం నుంచి వడతల్ వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
చిత్రం న్యూస్, బోథ్: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో బుధవారం నిర్వహించారు. బోథ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీసాయి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, మండలం లోని యువకులు జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రక్తదానం చేశారు. రక్తదానం చేయడంతో ఒక ప్రాణం నిలబడుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు.
ఇండోఫిల్ ఇండస్ట్రీస్ ‘ప్రాజెక్ట్ ఖుషి’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం
చిత్రం న్యూస్, జైనథ్: “సంస్కృతి, సమాజం పోషణకు ఒక అభివ్యక్తి”ని సూచించే ఇండోఫిల్ ఇండస్ట్రీస్ యొక్క “ప్రాజెక్ట్ ఖుషి (విస్టేరియా)” కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్, వెంకటేశ్వర దేవాలయం వద్ద వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులతో ముచ్చటించి వారితో కలిసి చురుకుగా వృక్షారోపణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ASM గజానన్, RDGM గౌతమ్ రెడ్డి, RSM మహిపాల్ రెడ్డి, ఆదిలాబాద్ DGE ఎర్ల సాయికృష్ణ, నిజామాబాద్ ప్రాంత DGO సంతోష్, CO బాపన్న హాజరయ్యారు.
విద్యార్థుల పరీక్ష ఫీజు గడువు పెంచాలి
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొదటి మూడు, ఐదవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడం కోసం ఈ నెల 22 వరకు గడువు ఉంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న ప్రత్యేక వాతావరణం, వర్షాలు, ఆదివాసీ విద్యార్థులు అధికంగా ఉన్న బేల, బజార్ హత్నూర్, ఉట్నూర్ లాంటి మండలాల్లో దీపావళి సందర్భంగా గుస్సాడీ దండారీలు అనే ప్రత్యేక పరిస్థితి ఉండటంతో అధిక శాతం మంది విద్యార్థులు ఇంకా ఫీజు చెల్లించలేక పోతున్నారు. అలాగే సాంకేతిక కారణాలు కూడా ఉండటంతో యూనివర్సిటీ అధికారులు మానవత దృక్పథంతో మరో వారం రోజులు పరీక్ష ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పెంచాలని ఏడీసీఏ ( ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్) తరుపున డా. వేముగంటి వరప్రసాద రావు సమావేశంలో యూనివర్సిటీ అధికారులని కోరారు.
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి
చిత్రం న్యూస్, హైదరాబాద్: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. హైదరాబాద్‌లో మంగళవారం మంత్రిని కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సోయా బీన్ పంటను రైతులు మార్కెట్లో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందని, దీంతో క్వింటాల్‌కు రూ.1200–రూ.1500 వరకు నష్టపోతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు బెంగాల్ గ్రామ్ విత్తనాలను సబ్సిడీపై అందించాలని సూచించారు. పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, వారికి ఆహారం పంపిణీ చేయాలని కోరారు. రైతులకు మెరుగైన వసతులు కల్పించేందుకు మార్కెట్ యార్డులో కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పాయల్ శంకర్ మంత్రికి సూచించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.
లారీ ఓనర్లకు కంది శ్రీనివాస రెడ్డి భరోసా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: లారీ ఓనర్లకు తన అండదండలుంటాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని అన్నివేళలా అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు వారు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఎవరి బెదిరింపులకు భయపడవద్దని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మనందరి లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయడమేనన్నారు. దాంతో పాటు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కష్టపడి పని చేయడమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిమ్మ సంతోష్ రావు, లోక ప్రవీణ్ రెడ్డి, మునిగెల విట్టల్, రఫిక్, రోహిత్ షిండే, షఖీల్, శరత్, నరేష్, సోమ ప్రశాంత్, తోఫిక్,అంజాద్, ఆదిలాబాద్ జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫహీం ఖాద్రి, ప్రధాన కార్యదర్శి సందీప్, కోశాధికారి నయీముద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్ షరీఫ్, ఉపాధ్యక్షులు సయ్యద్ సిరాజ్, జాయింట్ సెక్రటరీ మోహిసిన్ అహ్మద్, సభ్యులు అమర్, అబ్దుల్ అజీజ్, వాహెద్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.










