Home Blog Page 104

ఖండాల జలపాతంలో పడి విద్యార్థి గల్లంతు

మనోహర్ సింగ్ (ఫైల్ ఫొటో)

చిత్రం న్యూస్, అదిలాబాద్:  ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల జలపాతంలో పడి ఓ విద్యార్థి గల్లంతైన ఘటన బుధవారం చోటుచేసుకుంది.  ఆదిలాబాద్ పట్టణంలోని  భుక్తాపూర్ కాలనీకి చెందిన  మనోహర్ సింగ్ (17) తన స్నేహితులతో కలిసి ఖండాల జలపాతం వద్దకు వెళ్ళారు.  ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మనోహర్ సింగ్ గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు  భయపడి ఇంటికి వచ్చేశారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు డీడీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

✖ Close హోం

బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆపరేషన్ జ్వాలా 

చిత్రం న్యూస్, బేల:  విపత్కర పరిస్థితిలో నుంచి బయటపడి బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బేల లో ఆపరేషన్ జ్వాలా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్సై మధు కృష్ణ తెలిపారు. బుధవారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఒక్కో పాఠశాలలో 10 రోజుల చొప్పున రెండు నెలల పాటు ఈ శిక్షణ నిర్వహిస్తామన్నారు.   కరాటే వల్ల బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నవీన, సీఆర్టీలు, విద్యార్థులు పాల్గొన్నారు

✖ Close హోం

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

మెగా జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేసున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఇచ్చోడ:  టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో ఈ నెల 25 న నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి లు కోరారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో జాబ్ మేళాకు సంబందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ, ఇంటర్, పీజీ, BE, B.Tech, M.Tech, BA, B.Sc., B.Com, , MBA, MCA, MCS , హోటల్ మేనేజ్మెంట్, ITI తదితర కోర్సులను పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉట్నూర్ మండలం పెర్కగూడ లోని JCN ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

✖ Close హోం

ఆర్మీ జవాన్ ఆకాష్ కుటుంబానికి  రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేత

ఆర్మీ జవాన్ ఆకాష్ కుటుంబానికి  రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్  టీం సభ్యులు

చిత్రం న్యూస్, బోథ్: బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన యువకుడు ఆర్మీ జవాన్ ఆకాష్ మృతి చెందగా బుధవారం అంత్యక్రియలు వర్తమాన్నూర్ గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా అంతక్రియల్లో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ మాట్లాడుతూ తక్షణం వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తనవంతుగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆడే గజేందర్ ఆదేశాలమేరకు ఆడే గజేందర్ గారి (టీం) సభ్యులు ఆర్మీ జవాన్ ఆకాష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..ఆకాష్ కుటుంబానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా కూడా ఆదుకునే విధంగా చొరవ చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్, గస్కంటి రవి,(AGF)టీం ఎండి సద్దాం, మౌలానా, క్రాంతి, తీగల విలాస్, గ్రామస్తులు  పాల్గొన్నారు.

✖ Close హోం

స్ఫూర్తిదాయకమైన సేవలే సమసమాజ నిర్మాణానికి సూచికలు

0

శర్వాణి స్కూల్‌లో  పుస్తకాలు, పెన్నులను విద్యార్ధులకు పంపిణీ చేస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

చిత్రం న్యూస్,ఏలూరు: స్ఫూర్తిదాయకమైన సేవలే సమసమాజ నిర్మాణానికి సూచికలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి తోడుగా దాతలు కూడా చేయూతనందించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో అవసరార్థులకు అందిస్తోన్న సేవాకార్యక్రమాలు వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇదేక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తోన్న విద్యార్ధులకు దాతల సహకారంతో అనేక సేవలు అందుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలోని శ్రీ శర్వాణి స్కూల్‌లో నందమూరి ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన పుస్తకాలు, పెన్నులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్ధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన నందమూరి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఇదేసమయంలో కూటమి ప్రభుత్వ పాలనలో విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ సారథ్యంలో విద్యాశాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మాక మార్పులను వివరించిన ఆయన.. ఆ పథకాలన్నింటినీ విద్యార్ధులు సద్వినియోగం చేసుకొని విద్యలో ఉత్తమంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్ధసారధి, నందమూరి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులు బిబిజి తిలక్‌, కర్ణ శ్రీనివాస్‌, శ్రీ శర్వాణి పాఠశాల డైరెక్టర్‌ కె. మదన్‌ మోహన్‌ రాజు, ప్రిన్సిపల్‌ సత్యశారద చల్ల సత్యనారాయణ (పెదబాబు ), సంకబాత్తుల నాగరాజు, 40 వ డివిజన్ ఇంచార్జి బోర ప్రసాద్, బొంతు చిన్న, ఆకుల రంగారావు, రెడ్డి కుమార్, భీమవరపు పాపారావు, తంగేటి మనోహర్, లక్ష్మణ, ఆనంద్, రవి, శ్రీనివాసరావు, మురళి తదితరులు  పాల్గొన్నారు.

✖ Close హోం

పురుగుమందు తాగి డిగ్రీ విద్యార్ధిని బలవన్మరణం

          వైద్య సాక్షి (ఫైల్ ఫొటో)

పురుగుమందుతాగి డిగ్రీ విద్యార్ధిని బలవన్మరణం

 చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం లేఖర్వాడ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్ధిని వైద్య సాక్షి(20) రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గౌతం తెలిపిన వివరాల ప్రకారం.. లేఖర్వాడ గ్రామానికి చెందిన వైద్య సాక్షి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివింది. పరీక్షలు సైతం రాసింది. ఈ నెల 21న సోమవారం రోజు తల్లిదండ్రులు అనిత, గణేష్, తమ్ముడు చరణ్ తో కలిసి వ్యవసాయ పనుల కోసం చేనుకు వెళ్ళింది. మధ్యాహ్నం అందరూ ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ పొలం పనులకు వెళ్ళారు. సాక్షి మాత్రం ఇంటి పట్టునే ఉంది. 3:30 గంటల సమయంలో పురుగుమందు తాగి తమ్ముడు చరణ్ కు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చిన చరణ్ అక్క వాంతులు చేసుకోవడంతో విషయాన్ని తండ్రి గణేష్ కు చెప్పాడు. ఇద్దరూ వచ్చి పురుగు మందు ఎందుకు తాగావని అడగ్గా నేను మీతో పాసయ్యానని అబద్ధం చెప్పాను. డిగ్రీ సెమిస్టర్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని, మీరేమన్న అంటారేమో అని పురుగుమందు తాగానని చెప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబీకులు వెంటనే 108 అంబులెన్స్ లో రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సాక్షి మృతి చెందిందని, ఆమె తండ్రి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ గౌతం తెలిపారు.

 

 

✖ Close హోం

పుస్తక ఆవిష్కరణ

పుస్తక ఆవిష్కరణ

చిత్రం న్యూస్, బేల: సీనియర్ వృక్ష శాస్త్ర అధ్యాపకులు, బేలలోని కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. వేముగంటి వరప్రసాద్ రావు రాసిన వివిధ పుస్తకాలని ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వృక్షశాస్త్ర అధ్యాపకులు డా. వెల్మ మధు  పర్యవేక్షణలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.అచ్చి శ్రీనివాస్, డా.జలగం అనిత, డా.సరస్వతి, డా.కె.మురళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. వెల్మ మధు పలు సలహాలు, సూచనలు అందించారు. భవిష్యత్తు లో మరిన్ని పుస్తకాలు రాసి వృక్షశాస్త్రం గొప్పదనం తెలియజేయాలన్నారు..త్వరలోనే డిగ్రీ మొదటి సంవత్సరం నూతన సిలబస్ పుస్తకాన్ని కూడా విడుదల చేస్తున్న విషయాన్ని డా. వెల్మ మధుకి డా.వరప్రసాద్ రావు తెలియజేశారు.

✖ Close హోం

సొనాల  ప్రాథమిక పాఠశాలలో బోనాల జాతర

సొనాల  ప్రాథమిక పాఠశాలలో బోనాల జాతర

చిత్రం న్యూస్, సొనాల:ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని విద్యార్థినిలు, మహిళా ఉపాధ్యాయులు గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు. పోతరాజు వేషధారణలో విద్యార్థులు అలరించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పుష్పల విద్యార్థులకు బోనాల విశిష్టతను, ఆషాడ మాసంలో గ్రామ దేవతలని మన ఇంటి ఆడబిడ్డలుగా భావించి బోనంతో పాటు సారెను సమర్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, భారతి, వరలక్ష్మి, పోషకులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఘనంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బోరంచు శ్రీకాంత్ రెడ్డిని సన్మానిస్తున్న  టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ

చిత్రం న్యూస్, మావల: తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మావల మండల కేంద్రంలోని ఆయన నివాసంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, వివిధ మండలాల అధ్యక్షులు హాజరై బోరంచు శ్రీకాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

✖ Close హోం

రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (న్యాయవాది) పంద్రం శంకర్

రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (న్యాయవాది) పద్రం శంకర్

*ఈనెల 27న రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావుతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న జిల్లా అధ్యక్షులు పద్రం శంకర్

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని పట్నాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది పద్రం శంకర్ ను ఆదిలాబాద్ జిల్లా రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.  జిల్లా అధ్యక్షులుగా తనకు భాద్యతలు అప్పగించడంతో పద్రం శంకర్ రాజ్ గోండ్ సేవ సమితి స్టీరింగ్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 27న రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావుతో పాటు జిల్లా అధ్యక్షులుగా తాను ప్రమాణస్వీకారం చేయనున్నట్లు  పద్రం శంకర్ తెలిపారు. తనకు అప్పగించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించి రాజ్ గోండ్ సేవ సమితికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.

✖ Close హోం