Home Blog Page 103

సోయాబీన్ రైతుల సమస్యలపై  వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు  పాయల్ శంకర్, రామారావు పటేల్

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో గురువారం హైదారాబాద్ లో బీజేపి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పటేల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోయాబీన్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైతుల ఇబ్బందులను సానుకూలంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఎమ్మెల్యేలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యుత్తు బల్బులు పెట్టించి..కాలనీలో వెలుగులు తెప్పించి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్, తాటిగూడ, నేరటివాడ, గంజి రోడ్ లో ఎన్నో రోజుల నుంచి విద్యుత్ బల్బులు రాకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. 24 వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మానే శంకర్  మొత్తం వార్డులో అన్ని విద్యుత్ స్తంభాలకు బల్బులు పెట్టించడంతో  వెలుగులతో  కాలనీ మెరిసింది.

భాగ్యనగర్ వార్డులో పొగ కాలుష్యంతో ప్రజలకు ఇక్కట్లు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 24 భాగ్యనగర్ లో వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత  కొన్ని రోజుల కింద ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ యార్డ్ లో (క్రోమ్ తోలు జిన్నింగ్ వాషర్) పనికిరాని చెత్తను పారేసి దాన్ని తగలబెడుతున్నారు, తగలబెట్టిన తర్వాత దాని నుండి వచ్చే హానికరమైన పొగతో వాయు కాలుష్యమై, భాగ్యనగర్, తాటిగూడలో నివసిస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.  జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని  ప్రజలు వేడుకుంటున్నారు.

మేడిగూడకు రూ.కోటి నిధులు కావాలని శివప్రసాద్ రెడ్డి విన్నపం..స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మేడిగూడ(ఆర్) గ్రామానికి నిధులు మంజూరు చేయాలని క్యాతం శివప్రసాద్ రెడ్డి విన్నపానికి సీఎం రేవంత్ రెడ్డి  స్పందించారు. తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ క్యాతం శివప్రసాద్ రెడ్డి ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రామాభివృద్ధికి రూ.కోటి  నిధులు మంజూరు చేయాలని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.  మేడిగూడ గ్రామానికి 50 ఇందిరమ్మ ఇళ్లు, శ్రీ వెంకటేశ్వర ఆలయం, ఏకబిల్వ శివాలయం, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేయాలంటూ గ్రామ ప్రజల తరపున ఆయన సీఎంకు లేఖ ద్వారా విన్నవించారు. ఈ నెల 30న స్పందించిన సీఎం  రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేసింది. కలెక్టర్ గ్రామాభివృద్ధి విషయమై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీవో ను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శివ ప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

రబీ పంటలో శాస్త్రవేత్తల క్షేత్ర స్థాయి పర్యటన

0

చిత్రం న్యూస్, జైనథ్: వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిరాల, జైనథ్, లేఖర్ వాడ, సావాపూర్, కచ్ కంటి గ్రామాలలో శనగ, కంది, గోధుమ రబీ పంటలలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డా.కే రాజశేఖర్, డా.జి. ప్రవీణ్ కుమార్ లు  మాట్లాడుతూ..గులాబీ రంగు పురుగు దృశ్య పత్తి పంటను తీసివేయాలన్నారు. కంది పంటలో పురుగు నివారణకు లాండా సాయి హాలోత్రిన్ + క్రోరాంతనిప్రోలు ఎకరానికి 80 మిల్లీలీటర్లు విచికారి చేసుకోవాలన్నారు. సెనగ పంటలో ఎండు తెగులు నివారణకి కాపరాక్షి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మొదట్లో పిచికారి చేయాలన్నారు. గోధుమ పంటలో తెగుళ్ళ నివారణకి ప్రాపి కొనజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇక్రిసాట్ ఇచ్చిన కందిరకాలను కూడా సందర్శించారు. రైతులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్

0

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు_జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి జనవరి 1వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 15 ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, రేసింగ్ వంటి నిబంధనలను అతిక్రమించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయిని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించి సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని ప్రజలను ఆయన కోరారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి

0

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి

_జిల్లా కలెక్టర్ రాజర్షి షాని కోరిన నేతలు

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహిస్తున్నందున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను సంబంధిత యాజమాన్యాలు ఏర్పాటు చేసేలా ఆదేశించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే నేతల బృందం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ లను కలిసి జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణంలో వినతి పత్రం సమర్పించారు. జనవరి మూడో తేదీన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని రాష్ట్ర పండగగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మాలీ మహా సంఘం, హిందీ భాష సేవా సమితి కార్యవర్గ సభ్యులు కార్యక్రమ విజయానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని అన్ని యాజమాన్యాల పాఠశాల్లో జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలేలు స్త్రీ విద్య కోసం, సామాజిక న్యాయం కోసం ఎనలేని కృషిచేసిన మహోన్నత వ్యక్తులని వారి సేవలను స్మరిస్తూ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను ఏర్పాటుచేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారిని సంఘం నేతలు కోరారు. వారిని కలిసిన వారిలో మాలే మహ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామన్న శేండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునూలే, హిందీ భాషా సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ ప్రధాన్, సంయుక్త కార్యదర్శి అనిల్ కోట్రంగే తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదం..యువకుడికి తీవ్రగాయాలు

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం(Road accicent) జరిగింది. జందాపూర్ బైపాస్ సమీపంలో ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మూగజీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ

0

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసర మండలం ఓని గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు వైద్యాధికారి డా.రాజేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను వేశారు.అనంతరం పశు వైద్యాధికారి మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న పశువులతో పాటు మేకలు, గొర్రెలు వ్యాధిన పడ్డ వాటిని గ్రహించి యజమానులు వెనువెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలని, ఎప్పటికప్పుడు పశువులను శుభ్రంగా ఉంచితే సమృద్ధిగా పాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ జగదీష్ పటేల్, ఉప సర్పంచ్, పురుషోత్తం, పశువైద్య సిబ్బంది, జేవీఓ సుజాత. గోపాలమిత్ర గణేష్ ఓఎస్ వినాయక రావు, రైతులు హల్దేకర్ గోపి, కాలేవార్,దిగంబర్, గోవింద్, దశరథ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పీఎం, సీఎం సోదరీమణులు వీరే..

0

చిత్రం న్యూస్, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్ లోని నీలకంఠ ఆలయంలో ఇద్దరు మహిళలు మెదటిసారి కలుసుకున్నారు. ఒకరు ఆలయం వెలుపల పూల దుకాణం నడుపుతున్నారు. మరొకరు దైవదర్శనం కోసం కాలి నడకన అక్కడికి వచ్చారు. వారిద్దరి సోదరులు దేశంలోని అత్యంత శక్తివంతమైన, గొప్ప పేరున్న నాయకులు. విశేషమేమంటే..వారికి ఎటువంటి భద్రతా, మంది, మర్భలం, సేవకులు లేరు. ఒకరేమో పూలదుకాణం యజమాని శశి దేవి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి కాగా మరో మహిళ వాసంతి బేన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోదరి.

పీఎం, సీఎం సోదరీమణులు వీరే..