Home Blog Page 102

త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ రామానుజ జీయర్ స్వామిని కలిసిన లోక ప్రవీణ్ రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ రామానుజ జీయర్ స్వామిని  లోక ప్రవీణ్ రెడ్డి ఆదివారం కలిశారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ లో తన స్నేహితుడు టీ ఎల్ మనోహర్ స్వామి స్వగృహం శ్రీ లక్ష్మీ నృసింహ నిలయానికి వచ్చిన దేవనాథ స్వామిని తన తల్లి లోక పద్మ, పిన్ని గంగుతాయితో కలిసి లోక ప్రవీణ్ రెడ్డి కలిశారు. స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

అన్నపూర్ణదేవి డెవలపర్స్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అన్నపూర్ణదేవి డెవలపర్స్ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని APD కార్యాలయంలో 2026 సంవత్సరపు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. బ్రాంచి మేనేజర్ సుధీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంగారెడ్డి, రమేష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పరమేష్, సంతోష్, యువ నాయకులు దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు.

 

అధ్వానంగా బేల జాతీయ రహదారి..పట్టించుకునేవారేరి?

0

అధ్వానంగా బేల జాతీయ రహదారి..పట్టించుకునేవారేరి?

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని 353బీ జాతీయ రహదారి అధ్వాన్నంగా మారింది. శివాజీ చౌక్ నుంచి వెళ్లే రహదారిపై గుంతలు పడ్డాయి. మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో నీరు రోడ్డుపై చేరి గుంతలమయంగా మారింది. ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో  రోడ్డు పరిస్తితి అధ్వానంగా మారిందని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వార్డు సభ్యులు, మాడ లక్ష్మీ, ఆత్రం దశరథ్ కోరారు.

బేల హై స్కూల్లో ఇంటిగ్రేటెడ్ ఆధార్ సెంటర్ ప్రారంభం 

0

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ ఆధార్ సెంటర్ ను మండల విద్యాధికారి మహాలక్ష్మి, తహసీల్దార్ రఘునాథ్ రావ్, సర్పంచ్ భాగ్యలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆధార్ సెంటర్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోని మండలంలో మూడు ఆధార్ ఇంటిగ్రేటేడ్ సెంటర్ లను మంజూరు చేశారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ.. విద్యార్థుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ అప్డేట్ కోసం చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో మండలానికి మూడు ఇంటిగ్రెటెడ్ ఆధార్ సెంటర్ లని మంజూరు చేశారన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి_ డా.సర్ఫరాజ్

0

 * కోలాం ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని డా.సర్ఫరాజ్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలము అంకోలి కోలాం ఆశ్రమ పాఠశాలలో ప్రతి నెల మాదిరిగానే  శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు జలుబు, దగ్గు, గోకడం లాంటి లక్షణాలు కల్గిన  23 మంది పిల్లలను గుర్తించామని, వారికి పరీక్షలు జరిపి ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి పర్యవేక్షణలో మందులు అందజేశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటది అన్నారు. వేడి అన్నం, గోరు వెచ్చని నీరు విద్యార్థులకు ఇవ్వాలనన్నారు. వంట గది పరిశుభ్రతను నిర్వాహకులకు, ఇంఛార్జీ వార్డెన్ కు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజార్ ఆడే సురేష్, ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి, పవర్ ప్రేమ్ సింగ్, మరప ముయ్యాల, మోతి స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎంపీటీసీ శాగంటి రమేష్

0

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం దేవపూర్ మాజీ ఎంపీటీసీ శాగంటి రమేష్ శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా శాగంటి రమేష్ (మాజీ ఎంపిటీసీ) మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉంటూ  జాగృతి బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాజకీయాలలో జాగృతి కీలకమైన పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీనా చారి, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు మేక లలిత యాదవ్, ఆదిలాబాద్ జిల్లా నాయకులు వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సోయా పంటను కొనుగోలు చేయాలని రేపు రైతులు, brs  నేతల రాస్తారోకో.. 

0

సోయా పంటను కొనుగోలు చేయాలని రేపు రైతులు, brs  నేతల రాస్తారోకో.. 

చిత్రం న్యూస్, జైనథ్: రైతులు పండించిన సోయా పంటను ఎటువంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బేల, జైనథ్ మండలాల రైతులు BRS పార్టీ నాయకులు శుక్రవారం రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. BRS పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించనున్నారు. భోరజ్ నుండి బేల వెళ్లే 353బీ జాతీయ రహదారిపై మాకోడ, ఖాప్రి X రోడ్ వద్ద శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి ఈ ఆందోళన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బేల, జైనథ్ మండలాల రైతులు, BRS పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సోయా రైతులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టనున్నారు. ప్రభుత్వం తక్షణమే సోయా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయనున్నారు.

మంగమఠం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రధాన అర్చకులు వైభవ్ శర్మ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఏక దశ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ మంగమఠం లో బుధవారం నూతన క్యాలెండర్ ను ప్రధాన అర్చకులు వైభవ్ శర్మ భక్తులతో కలిసి ప్రారంభించారు.. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సంతోషాలతో విరజిల్లాలని దేవుణ్ణి కోరారు. సూర్యోదయానికి ముందే ఆలయాల సందర్శన చేసుకోవడం భక్తులకు ఈ సంవత్సరం మంచి కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. బొజ్జవర్ సంతోష్, రంగినేని శ్రీనివాస్, ఒరగంటి వెంకటేష్, ఉమేష్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

కీర్గుల్ (కె) సర్పంచ్, ఉపసర్పంచ్ కు ఘన సన్మానం

0

నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేసిన సర్పంచ్ మాలేగం మధుప్రీతి 

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా బాసర మండల కీర్గుల్ (కె) గ్రామ సర్పంచ్ మాలేగం మధుప్రీతి, ఉపసర్పంచ్  కోప్లే నాగనాథ్ ను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రవళిక, భవానిలు గురువారం ఘనంగా సన్మానించారు. అనంతరం  ప్రభుత్వ పాఠశాలలో  చదువుతున్న1 నుండి  ఐదో తరగతి విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులను సర్పంచ్ మాలేగం మధుప్రీతి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవందర్, అంగన్వాడీ టీచర్ ఈశ్వరబాయి. తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ అఖిల్ మహాజన్‌ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అఖిల్ మహాజన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్ర శేఖర్, నాయకులు N. సుదర్శన్, k ప్రభాకర్ రెడ్డి, దండు మధుకర్, T. వినోద్, ఇమ్రాన్, సత్యనారాయణ, అట్ల గోవర్ధన్ రెడ్డి, Sk అలీమ్, రహీం ఖాన్, సురేష్, కుదుర్పాక,సమ్ము, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు.