Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 102

సైదాపూర్ ఏ ఎస్ ఐమల్లారెడ్డిఉద్యోగ ఉద్యోగ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

0

సైదాపూర్ ఏ ఎస్ఐ మల్లారెడ్డి ఉద్యోగ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

*ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాధవి

చిత్రం న్యూస్, సైదాపూర్: 

పోలీస్ శాఖలో సేవలు అందించడం ఒక గౌరవమని సైదాపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మల్లారెడ్డి అన్నారు. సుదీర్ఘ కాలం పాటు అంకితభావంతో విధులు నిర్వహించిన ఆయన శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సైదాపూర్ విశాల సహకార పరపతి సంఘం లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మల్లారెడ్డి తన సేవల ద్వారా సమాజానికి అనేక సేవలందించారని ఆమె ప్రశంసించారు. అనంతరం ఏసీపీ మాధవి మల్లారెడ్డికి జ్ఞాపిక అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకట్ గౌడ్, సైదాపూర్ ఎస్సై తిరుపతి, ట్రైనీ ఎస్సై భార్గవ్, శంకరపట్నం ఎస్సై రవి, హెడ్ కానిస్టేబుల్ సాబీర్, కానిస్టేబుల్స్ అశోక్, రాజు, అజయ్, నాగరాజు, సాయినాథ్, వెంకన్న, సాయి కృష్ణ, ఆకాష్, సురేష్, పూజ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

0

పేద ప్రజల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

*సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

*హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు

చిత్రం న్యూస్, బేల:

గూడు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చి వారి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇల్లు లేని పేద ప్రజలను గుర్తించి ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి 35 ఇళ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ప్రత్యేక అధికారి ,ఏ ఈ వినోద్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌతమ్, ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి లతో పాటు గ్రామస్తులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిరుపేద సరైన ఇల్లు లేనటువంటి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఆధ్వర్యంలో 35 ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి భూమి పూజచేశారు . అనంతరం సామ రుపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గడచిన పదేళ్లలో బి.ఆర్.ఎస్.ప్రభుత్వం లో ఏళ్లుగా ఎదురుచూసిన అర్హులై ఉన్నప్పటికీ ఇల్లు కట్టించి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళుతున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. ఇంకా గ్రామంలో అర్హులైన ప్రతివారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే విధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తమ వంతు కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామనర్సారెడ్డి, దయాకర్ పటేల్, లస్మన్న, వినోద్,సుధాకర్, మంచికంటి నవనీత్, మంచికంటి సాయి, తదితరులు ఉన్నారు.

మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలుపు.

0

మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలుపు

చిత్రం న్యూస్ పెద్దాపురం:

పెద్దాపురం మండలంలోని  పెద్దాపురం లో కొలువై ఉన్న మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలిపివేస్తున్నట్లు  అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు. జూన్ 24వ తారీకు నుంచి మరిడమ్మ అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. ఆ సమయంలో అన్న ప్రసాద వితరణను తాత్కాలికంగా నిలుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. జాతర అనంతరం అన్న ప్రసాద వితరణ  ఉంటుందని ఆమె తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్ అందజేసిన కార్యదర్శి శ్రీకాంత్

0

ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్ అందజేసిన కార్యదర్శి శ్రీకాంత్
▪️ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసిన హౌసింగ్ ఏ ఈ మహమ్మద్ అలీ – కార్యదర్శి శ్రీకాంత్

చిత్రం న్యూస్ శంకరపట్నం:

శంకరపట్నం మండలంలోని అంబల్పూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్లను శనివారం రోజున గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. 13 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు జక్కి రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కృషి వల్లనే తమ గ్రామానికి ఇండ్లు మంజూరు అయ్యాయని అన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ఏగుర్ల ఎల్లయ్య మాట్లాడుతూ.. తమ గ్రామానికి ఇండ్లు మంజూర అయినాయని వాటిని సత్పరమే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. వడ్డకొండ వినోద్ మాట్లాడుతూ.. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇండ్లు మంజూరు కాలేదని ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హయాంలో మంజురు అయినాయని ప్రశంసలు కురిపించారు. ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన ఇనుప రాడ్లు. ఇసుక. తదితర సామాగ్రి కావలసినవారు తమను సంప్రదించాలని ఆయన అన్నారు .హౌసింగ్ ఏఈ మహమ్మద్ అలీ ,కార్యదర్శి శ్రీకాంత్ ఇండ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాశం కైలాప్ రెడ్డి, కొండల్ రెడ్డి ,మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ,బుర్ర స్వామి ,కరబర్ లింగమూర్తి ,పెద్ద కురుమ,గుడిసె కొమరయ్య ,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చినరాజప్ప చేతుల మీదగా పెన్షన్ పంపిణీ

0

ఎమ్మెల్యే చినరాజప్ప చేతుల మీదగా పెన్షన్ పంపిణీ

చిత్రం న్యూస్ , సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోంచాల గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సామర్లకోట మండల ప్రెసిడెంట్ పీ. వేమవరం శ్రీరాములు, వైస్ ప్రెసిడెంట్ సూరిబాబు గోంచాల, గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.

వికసిత్ కృషి సంకల్ప అభియాన్ వ్యవసాయ ,ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం

0

వికసిత్ కృషి సంకల్ప అభియాన్
వ్యవసాయ ,ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం

చిత్రం న్యూస్, ఓదెల:

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తలు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వానాకాలంలో వేసుకోవలసిన వ్యవసాయ ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమము జూన్ 12వ తారీకు వరకు వివిధ మండలాల్లోని గ్రామాల్లో జరుగుతున్నందున రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని రానున్న వానాకాలంలో వేస్తున్న పంటలపై అవగాహన పెంచుకోవాలని శాస్త్రవేత్తలను అడిగి వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్. బి. భాస్కరరావు మాట్లాడుతూ.. రైతు సోదరులు ప్రతి సంవత్సరం ఏక పంటగా వరి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. ఒకే పంటను సాగు చేయడం వలన చీడపీడల వలన గాని, వాతావరణంలోని మార్పుల వలన గాని, మార్కెట్లో సరైన ధర లభించకపోవడం వలన రైతు మొత్తం గా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు.  రైతులు సమగ్ర పంట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీనిలో భాగంగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల పంటలను కూడా సాగు చేసుకుని అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని ఆ పంటల సాగులో మెలకువలను వివరించారు. తదనంతరం నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్. యోగేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం తో పాటు పాడి పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలను కూడా పెంచుకొని అధిక ఆదాయం పొందవచ్చని వాటి మెలకువలను వివరించారు. ఉద్యాన అధికారి మహేష్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల్లో అమలవుతున్న వివిధ రకాల సబ్సిడీలు, ఆయిల్ పంట సాగు గురించి వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారిని సంధ్య వ్యవసాయ పంటలలో అమలవుతున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ శంకర్ రైతు సోదరులు, మహిళా రైతులు పాల్గొన్నారు.

వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు

0

వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు

చిత్రం న్యూస్, హుజురాబాద్:

హుజురాబాద్ లోని స్కూల్ గ్రౌండ్ మైదానంలో  నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించారు. 700 నుంచి 800 మీటర్ల వాకింగ్ ట్రాక్ సంబంధించిన ప్రదేశమును వాకింగ్ చేసుకుంటూ  పక్కనే ఉన్న గ్రంథాలయమును కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు,  వాకర్స్, కాంగ్రెస్  పార్టీ  నాయకులు, ఇతరులు ప్రజాసంఘాల నాయకులు ,అందరూ పాల్గొన్నారు.

ఓదెలలో పోచమ్మ తల్లి  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన 

0

ఓదెలలో పోచమ్మ తల్లి  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన 

చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పోచమ్మ తల్లి నూతన విగ్రహ  ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళ వాయిద్య పూర్వక గంగ సేకరణ, యాగశాల ప్రవేశం ,గణపతి గౌరీ పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, పంచచార్యా, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, జలాధివాసం వంటి కార్యక్రమాలను పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనీకిరెడ్డి సతీష్ మాట్లాడుతూ.. శనివారం రోజున విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతం చేయగలరన్నారు. ఈ కార్యక్రమంలో కనకిరెడ్డి సురేష్, సదానందం, సారయ్య, పరుశురాం, కిరణ్ ,సాయి రమణ, రాజ్ కుమార్ ,రాజయ్య, అనిల్, ప్రభాకర్ , కనకయ్య , మల్లమ్మ, వనజ, తిరుమల, కీర్తి, లావణ్య, రాధా .మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ

0

రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ

చిత్రం న్యూస్, పెద్దాపురం:  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయనున్నందున కార్డు దారులు రేషన్ దుకాణాల వద్దకే వెళ్లాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్ర శేఖర రెడ్డి చెప్పారు. శుక్రవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎండీయు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతుందని ప్రభుత్వం గుర్తించి ఆ వాహనాలను రద్దు చేయడం తో పాత విధానాన్ని పునరుద్ధరించారన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15 వరకూ అన్ని రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు. వృద్దులు, దీర్ఘ కాల వ్యాధులతో బాధపడుతున్నవారు, ఎటూ కదలలేని వారికి ఆయా రేషన్ డిపో నిర్వాహకులు నేరుగా కార్డుదారుడి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా డీటీ వై. శ్రీనివాస్, ఎంఎస్ఓ కమల కుమారి, కార్యాలయ ఏవో పద్మ, డీలర్లు పాల్గొన్నారు.

0

అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, పెద్దాపురం:

రాణి అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు, మహారాణి అహల్యా భాయి హోల్కర్ యొక్క స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను నేటి తరానికి, ముఖ్యంగా మహిళలకు ఆదర్శనీయంగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం, లూతరన్ హై స్కూల్ ఎదురుగా నిర్వహించనున్న  ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు అందరూ పాల్గొని, జాతీయ భావ ఐక్యతను పెంపొందించాలని బిజెపి పెద్దాపురం పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రామకుమార్ కోరారు.