Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 101

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం

0

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం

చిత్రం న్యూస్, తిరుపతి:
తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని నల్లమిల్లి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనపర్తి శాసననసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి నల్లమిల్లి సత్యవతి,యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి సుమేఘ దంపతులు,నల్లమిల్లి సనాతని,ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల గిరి ప్రకాష్ రెడ్డి సుమల దంపతులు,ఆవుల మనీష్ రెడ్డి,కొయ్యాలమూడి శ్రీనివాస్ ప్రసాదిని దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అమరుల త్యాగాలు మరువలేనివి

0

అమరుల త్యాగాలు మరువలేనివి

చిత్రం న్యూస్, శంకరపట్నం :

శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేని అన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవం-చరిత్ర

0

తెలంగాణ అవతరణ దినోత్సవం – గర్వానికో ప్రతీక

ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన జరుపుకునే తెలంగాణ అవతరణ దినోత్సవం, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మీయతకు, ఉద్యమ సమరయోధుల త్యాగానికి గుర్తుగా నిలుస్తుంది. ఇది ఒక సాధారణ దినోత్సవం కాదు — ఇది తెలుగు రాష్ట్ర చరిత్రలోనే విశేషమైన మైలురాయి.


తెలంగాణ చరిత్ర – ఉద్యమం పునాది

తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ఉన్న చరిత్ర 1948లోనే మొదలైంది. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం, భారతదేశంలో విలీనమైన తర్వాత, 1956లో “భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ” ప్రకారం, తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. కానీ, ఈ విలీనానికి తక్కువకాలంలోనే తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వారు ఎదుర్కొంటున్న సమస్యలు:

  • నీటి పారుదల, విద్య, ఉపాధిలో అన్యాయాలు
  • ఉద్యోగాల్లో న్యాయపరమైన అవకాశాల కొరత
  • సంస్కృతిలో తేడాలు, ప్రాదేశిక నిర్లక్ష్యం

ఉద్యమాల విస్తరణ

1969లో మొదలైన జై తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల నుంచి సామాన్య ప్రజల వరకూ విస్తరించి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఊపందించింది. అయితే ఆ ఉద్యమం తాత్కాలికంగా నశించింది. తర్వాత 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కే.సీ.ఆర్) గారు తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ను స్థాపించి, ఉద్యమాన్ని కొత్త ఊపుతో కొనసాగించారు. “తెలంగాణ వస్తేనే బతుకుదెరువు” అనే నినాదం గ్రామాల నుడివాడిగా మారింది.

ఈ ఉద్యమంలో భాగంగా:

  • వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు
  • అనేకమంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారు
  • పార్లమెంటు స్ధాయిలో ఉద్యమం ఉద్భవించింది

2013 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. తుది ఆమోదం అనంతరం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది.


తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అభివృద్ధికి కొత్త దిశలు పరిగెత్తాయి. ముఖ్యంగా:

  • మిషన్ కాకతీయ – చెరువుల పునరుద్ధరణ
  • మిషన్ భగీరథ – గ్రామాలకూ తాగునీటి సరఫరా
  • కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ – పెళ్లిళ్ల కోసం ఆర్థిక సహాయం
  • రైతు బంధు, రైతు బీమా – రైతుల కోసం ఆర్థిక భరోసా
  • TS-iPASS – పారిశ్రామిక రంగంలో వేగవంతమైన అనుమతులు
  • T-Hub, WE Hub – యువతకు స్టార్టప్ ప్రోత్సాహం

ఈ ప్రణాళికలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, ఐటీ రంగంలో పురోగతి వంటి అంశాల్లో దేశంలో ముందంజలో ఉంది.


అవతరణ దినోత్సవం వేడుకలు

ప్రతి సంవత్సరం జూన్ 2న, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో:

  • ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ
  • ముఖ్యమంత్రి సందేశ ప్రసారం
  • ప్రభుత్వ పురస్కారాల ప్రదానం
  • సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా ప్రదర్శనలు
  • పాఠశాలలు, కళాశాలల్లో నాటకాలు, పాటలు, ప్రదర్శనలు

ఈ వేడుకలు తెలంగాణ కలను నిజం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసే ఒక అవధిగా నిలుస్తాయి.


ముగింపు

తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక జ్ఞాపకం — ఉద్యమానికీ, త్యాగానికీ, గెలుపుకీ. ఈ రోజు ప్రతి తెలంగాణ వాసి గర్వపడే రోజు. ఇది యువతలో స్ఫూర్తిని నింపే రోజు. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలన్న సంకల్పాన్ని గుర్తుచేసే రోజు.

“తెలంగాణ తల్లి విజయగాథ ఇది
తల్లిపాలే తీపిగా సాగే భవితవ్య గాథ ఇది.”

0

అమరుల త్యాగాలు మరువలేనివి

చిత్రం న్యూస్ శంకరపట్నం:
శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేని అన్నారు.

రోడ్డు పనులు అలసత్యం పై కలెక్టర్ ఆగ్రహం

0

రోడ్డు పనులు అలసత్యంపై కలెక్టర్ ఆగ్రహం

చిత్రం న్యూస్,ఏలూరు :

తడికలపూడి నుండి జంగారెడ్డిగూడెం వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టిడిపి నాయకులు చింతలపూడిలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ కు,చింతలపూడి ఎంఎల్ఏ కు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఫిర్యాదు పై కలెక్టర్ స్పందిస్తూ రోడ్డు పనులకు నిధులు ఉన్నప్పటికీ ఎందుకు పనులు పూర్తి చేయడం లేదంటూ ఆర్ అండ్ బి అధికారులను ప్రశ్నించారు. మూడు రోజుల్లో  అండ్ బి రోడ్డు పనులు తెలుసుకోవడానికి తడికలపూడి నుంచి జంగారెడ్డిగూడెం వరకు స్వయంగా పర్యటిస్తానని, త్వరగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు.

 

మరిడమ్మ అమ్మవారి ఆలయములో లలిత సహస్రనామ పారాయణ

0

మరిడమ్మ అమ్మవారి ఆలయములో లలిత సహస్రనామ పారాయణ

చిత్రం న్యూస్, సామర్లకోట:

పెద్దాపురం గ్రామం లో కొలువైన మరిడమ్మ అమ్మవారి జన్మ నక్షత్రం మఖ నక్షత్రము సోమవారం వచ్చిన సందర్భంగా ఉదయం 9:30 గంటలకు లలిత సహస్రనామ పారాయణ జరుపబడును అని ఆలయ సహాయ కమిషనర్ , కార్య నిర్వహణ అధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. భక్తులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.

వాడపల్లి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు

0

వాడపల్లి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు

*ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం

చిత్రం న్యూస్, వాడపల్లి:
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశంలో చేపట్టిన పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్య ఉన్నందు వల్ల ఆయా ప్రాంతాల నుండి వచ్చేవారికి తగు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సత్యానందరావు ఆదేశించారు. అనంతరం అన్న ప్రసాద కేంద్రం వద్ద భోజనం చేస్తున్న భక్తులను భోజన వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు.  దర్శన ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.అనతరం ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని,ఎవరైనా సమస్యలు చెప్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ పంజా భాస్కరకృష్ణ రావు అనే భక్తుడు స్వామి వారికి 50 వేల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందజేశారు.

భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు పెంపు

0

భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు పెంపు

చిత్రం న్యూస్ సామర్లకోట:

ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) సామర్లకోట పట్టణ కమిటీ సమావేశం ప్రకృతి ఈశ్వరరావు అధ్యక్షతన భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా ప్రకృతి ఈశ్వరరావు మాట్లాడుతూ..  పెరిగిన నిత్యావసర వస్తువులు ధరలు, గ్యాస్ ధరలు, కరెంట్ చార్జీలు, ఇంటి పన్నుల పెంపుదల కారణంగా భవన నిర్మాణ కార్మికులకు జీవనం కష్టంగా ఉండటం వలన, పెరిగిన ధరలకు అనుగుణంగా స్వల్పంగా కూలీ రేట్లు పెంచడం జరుగుతుందని జూన్ 1 నుండి నూతన కూలీ రేట్లు అమలులోకీ వస్తాయని భవన యజమానులు సహకరించవలసిందిగా కోరుతున్నామని చెప్పారు. పెరిగిన రేట్లు మేస్త్రికి గతంలో రూ. 850 ఉండేదని రూ.50 పెంచి 900,  అలాగే కూలీలకు గతంలో రూ.700కు రూ.50 పెంచి రూ.750 చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమం లో సంఘం ప్రతినిధులు బేవర బంగారయ్య, షేక్ బాషా, పి. శ్రీ రామ్, సీఐటీయూ మండల అధ్యక్షులు బాలం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, విప్పర్తి కొండలరావు, కరణం గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మూల ప్రేమ్ సాగర్ రెడ్డి

0

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మూల ప్రేమ్ సాగర్ రెడ్డి

చిత్రం న్యూస్, ఓదెల:

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి, ఎంఎల్ఏ చింతకుంట విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓదెల మండలం రూపు నారాయణపేట మానేరు నదిపై 80 కోట్ల రూపాయలతో హై లేవల్ వంతెన నిర్మాణం, ఓదెల మండల కేంద్రంలో 90 లక్షల రూపాయలతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం, 13 కోట్ల రూపాయలతో ఓదెల గ్రామం నుండి పెగడపల్లి వరకు సెంటర్ లైటింగ్ తో రెండు వరసల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయ రమణారావును ఓదెల మండల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అదే స్ఫూర్తి , అదే సంకల్పంతో ప్రజాసేవకే అంకితమై ఓదెల మండలానికి మరెన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులైన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, చీకట్ల మొండయ్య, మాజీ ఎంపిటిసి బోడకుంట శంకర్, పొత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, పెద్దపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపతి సదానందం, గడిగొప్పుల సంతోష్, మినుగు సంతోష్, పచ్చిమట్ల శ్రీనివాస్, గడిగొ ప్పల నరేష్, గొర్ల శ్రీనివాస్, నూతి శంకర్, పడాల రాజు, చొప్పరి రాజన్న,అంబాల కొమురయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హుస్సేనపురం గ్రామంలో వృద్ధురాలిని దత్తత తీసుకున్న MLA చిన్నరాజప్ప

0

హుస్సేనపురం గ్రామంలో వృద్ధురాలిని దత్త తీసుకున్న MLA చిన్నరాజప్ప

చిత్రం న్యూస్ సామర్లకోట:

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం హుస్సేనపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన విజన్ 2047లో P4 Zero poverty Scheme లో  హుస్సేనపురం భాగంగా పెద్దాపురం ఎమ్మెల్యే హుస్సేనపురం గ్రామంలో ఒక వృద్దురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు .ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే చిన్నరాజప్ప హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మండల నాయకులు, హుస్సేనపురం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.