Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బాసరలో బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్: ఆరుగురికి తీవ్రగాయాలు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లెఓవర్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వస్తున్న ఇసుక టిప్పర్, ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సు డ్రైవర్ తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం..ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని నిజామాబాద్ నుంచి భైంసాకు వెళుతోంది. ఈ క్రమంలో బాసర రైల్వే సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న ఎస్సై నవనీత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లో భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments