చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో 38వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఎల్మెలవార్ అర్చనరాంకుమార్ నుభారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి కోరారు. 38వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎల్మెలవార్ అర్చన రాంకుమార్ ను గెలిపించాలంటూ ఆ వార్డులో లోక ప్రవీణ్ రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, ఎన్నికల్లో అర్చన రాంకుమార్ ను గెలిపించాలని ప్రజలను ఓటు అభ్యర్తించారు. కాలనీ అభివృద్ధి జరగాలంటే చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కాలనీ ప్రజలను కలుస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను మద్దతు కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

