నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో నేరాల నియంత్రణకే సీసీ కెమెరా లను మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఆర్.రమేష్ అన్నారు. బుధువారం ముదోల్ మండల కేంద్రంలోని తానూర్ భైపాస్ రోడ్డు, హనుమాన్ మందిరం, భోగడ వాడకట్టులో ఏర్పాటు చేసిన 4 సీసీ కెమెరాలను ముధోల్ మండల కేంద్రం లోని ఆవరణలో మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు ఆర్. రమేష్ సంఘా సభ్యులతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఆర్.రమేష్ మాట్లాడుతూ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు. నేరాలు జరిగిన సందర్భంలో దర్యాప్తునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయన్నారు ఆర్.బాలాజీ, టి.ధర్మన్న, హంగీర్గ లక్ష్మణ్, వెంకటపూర్ పోతన్న, హంగీర్గ భోజన్న, టి.భూమన్న, బి.పోతన్న, కే.గంగాధర్, పీ.సాయిలు, టి.రాములు, ఇ.సురేష్, హెచ్.ఈరన్న, యు.సాయినాథ్, బి.గంగాధర్, పీ.పోశెట్టి, హెచ్.శంకర్, సీ.దత్తు తదితరులు పాల్గొన్నారు.

