బోథ్ మండలంలో భారీ వర్షం
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని గ్రామాల్లో నిన్న సాయంత్రం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. జిల్లా కలెక్టర్ ఈ మండలంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కరత్వాడ ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి పొంగిపొర్లుతూ ఆహ్లాదాన్ని పంచుతోంది. పొచ్చర జలపాతం వద్ద భారీగా వరదనీరు రావడంతో ప్రజలు జలపాతానికి వెళ్లరాదని, భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్, పోలీసు, అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఇబ్బంది ఉంటే సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
-Advertisement-

