బీజేపి ఆధ్వర్యంలో ఇంటింటికీ జెండాలను పంపిణీ చేస్తున్న నాయకులు
చిత్రం న్యూస్, సాత్నాల: బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా (ఇంటింటా జాతీయ జెండా) కార్యక్రమం నాయకులు నిర్వహించారు. సాత్నాల మండలంలోని మేడిగూడ (R), మేడిగూడ (C) గ్రామాలలోని ప్రతి ఇంటికి జాతీయ పతాకాన్ని అందించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికి కరపత్రాలు పంచుతూ వివరించారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర వేసి మన దేశభక్తి చాటాలని గ్రామస్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్, పీసీఎస్ వైస్ ఛైర్మెన్ రోహిదాస్, శక్తికమిటి అధ్యక్షులు డోకే సంతోష్, నాయకులు పోతరాజు రమేష్, లింగారెడ్డి, పంద్ర రాము, తారు, అడేళ్లు, మాధవ్, దినేష్ ,రవి, బాలు, సంతోష్, సుధాకర్, సురేష్ , బూత్ కమిటీ అధ్యక్షులు పలువురు బీజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.

