Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

*మృతుడు భైంసా మండలం పెండ్ పెల్లి వాసి

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా భైంసా_నిర్మల్ ప్రధాన రహదారి మార్గంలో మాటేగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెండ్ పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ (25) కుంసర గ్రామానికి చెందిన విలాస్ మిత్రులైన వీరిరువురు భైంసా నుంచి పెండ్ పెల్లి వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వీరిద్దరు మాటేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై నిలిచి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న యశ్వంత్, విలాస్ లు తీవ్రగాయాలపాలయ్యారు. ఘటనా స్థలి నుంచి క్షతగాత్రులను భైంసా ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా అపస్మారక స్థితికి చేరుకున్న యశ్వంత్ మార్గమధ్యలోనే మృతి చెందారు. భైంసా రూరల్ ఎస్ఐ శంకర్ ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments