ఘనంగా పంతంగి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ, షష్టిపూర్తి కార్యక్రమం
చిత్రం న్యూస్, సైదాపూర్: హెడ్ కానిస్టేబుల్ పంతంగి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ, షష్టిపూర్తి కార్యక్రమాన్ని సైదాపూర్ విశాల పరపతి సహకార సంఘం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తిచేసి ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. గతంలో కోహెడ, జగిత్యాల, ఇల్లంతకుంట, గొల్లపల్లి, మెట్ పల్లి, పెగడపల్లి, ఇబ్రహీంపట్నం, జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక ప్రాంతాల్లో అనేక సేవలు అందించినట్లు ఆయన తెలిపారు. వివిధ రాజకీయ నాయకులు, కలెక్టర్ల నుండి ఉత్తమ సేవా పతకాలు పొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దొనికెన శ్రావణి- కిరణ్ కుమార్ (సీఐ), వెంగల శ్రీవాణి-సందీప్ కుమార్, పంజాల శాలిని-రాకేష్ శ్రావణ్ కుమార్, బాంబర్థి బొమ్మగాని మమత-రాజు, మనువలు, మనుమరాండ్లు హన్సుజ, ధన్విక, మన్విత్, సిద్ధిక్ష, అరుహీ, అత్త మామలు బొమ్మగాని-మల్లవ్వ వీరయ్య, చెల్లెళ్లు ముంజ రజిత-సాగర్, దొనికెన సునీత-అనిల్, స్థానిక ప్రముఖులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

