పవార్ విజయ్ కుమార్ కు నలంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా తానూరు మండలం జవాల (కే) గ్రామానికి చెందిన పవార్ విజయ్ కుమార్ ఉస్మానియా విశ్వావిద్యాలయం నుండి వృక్ష శాస్త్ర విభాగం లో,ప్రొఫెసర్ P.కమలాకర్ పర్యవేక్షణలో పవార్ విజయ్ కుమార్ పరిశోధన పూర్తిచేశారు. హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిగిన 85వ స్నాత్నకోత్సవంలో ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శివ ప్రతాప్ శుక్ల, ప్రముఖ పరిశోధన సంస్థ భారత్ బయోటెక్ అధినేత Dr.కృష్ణ M.ఎల్ల చేతుల మీదుగా (Phd) డాక్టరేట్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. భైంసా మండలం దేగాం గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నలంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ వ్యవస్థాపకులు కపిల్ వాగ్మారే ముఖ్యఅతిథిగా హాజరై శాలువాతో పాటు ఫౌండేషన్ జ్ఞాపికనూ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ఉప సర్పంచ్ బాలేకర్ శివాజీ,వార్డ్ మెంబర్ వాగ్మారే సిద్దోదన్,వార్డ్ మెంబర్ చోటు, పాత్రికేయులు కరండే గంగాధర్,సోషల్ వర్కర్ బాలేకర్ అజయ్ కుమార్,బ్రదర్స్ ఈవెంట్స్ ఆర్గనైజర్ వాగ్మారే ఆకాష్, కరండే జనార్ధన్,తదితరులు పాల్గొన్నారు.
