-Advertisement-

కాంగ్రెస్ లోకి తెలంగాణ రాష్ట్ర, జిల్లా మాదిగ జేఏసీ నేతలు

కాంగ్రెస్ లోకి తెలంగాణ రాష్ట్ర, జిల్లా మాదిగ జేఏసీ నేతలు

పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, అడ్డి భోజారెడ్డి, ఎస్సీ విభాగం చైర్మన్ పరమేశ్వర్ సమక్షంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మోతె బారికరావు, నక్క రాందాస్, మల్యాల మనోజ్, లింగంపల్లి ప్రసన్న కుమార్, తారా రవికుమార్, కత్తి గంగాధర్, జెల్ల మహేందర్, బట్టు మహేందర్, ఖంపెల్లి ఆనందరావు, మంద సురేష్, కల్లేపల్లి మల్లయ్య, సిందే సంజయ్, మహిళా నాయకురాళ్లు నాతరి సరోజ, విజయ సురేఖతో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మాదిగ సామాజిక వర్గానికి లభిస్తున్న రాజకీయ ప్రాధాన్యతను చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments