-Advertisement-

తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా వేణుగోపాల్ యాదవ్

తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా వేణుగోపాల్ యాదవ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా భోరజ్ మండలం గూడ గ్రామానికి చెందిన గోపు వేణుగోపాల్ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం సోమవారం నియోజకవర్గాల ఇంఛార్జిలను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది, ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా గోపు వేణుగోపాల్ యాదవ్ ను నియమించింది.  నియోజకవర్గ ఇంఛార్జిలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పార్టీ మండల,గ్రామ కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఇంఛార్జిగా తనను నియమించినందుకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments